NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

Alia Bhatt: ఆలియా భట్.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలియని ఇండియన్ సినీ ప్రియులు ఉండరు. దాదాపు దశాబ్దన్నరకాలం నుంచి నార్త్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆలియా భట్.. గంగూబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో సౌత్ ప్రేక్షకులకు కూడా చేరువయ్యింది. తనదైన అందం, నటన ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. పెళ్లయి ఓ బిడ్డకు తల్లైన‌ తర్వాత కూడా నటిగా సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొన‌సాగిస్తున్న ఆలియా భ‌ట్‌.. తాజాగా మెట్ గాలా 2024లో మెరిసింది. మెట్ గాలా అనేది ప్రతి ఏడాది న్యూయార్క్ లో జరిగే ఫ్యాషన్ ఫెస్టివల్. నగరంలోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్ వేదిక‌గా మే నెలలో ఈ వేడుకను నిర్వహిస్తుంటారు.

ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ ఫ్యాష‌న్ వేడ‌క‌లో సంద‌డి చేస్తుంటారు. ఈ ఏడాది మే 6న మెట్ గాలా వేడుక అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ఈసారి ఇండియా నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, అప‌ర కుబేరులు ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఈషా అంబానీ, బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భ‌ట్ మెట్ గాలాకు హాజ‌రైయ్యారు. ఆలియా ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి డిజైన్‌ చేసిన ఫ్లోరల్‌ శారీ క‌ట్టుకుని రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోయింది.

అంతర్జాతీయ కెమెరా మెన్స్ కు ఫోజులు ఇస్తూ చీర‌లో ఆలియా భ‌ట్ మ‌రింత అందంగా క‌నిపించింది. ఈ సంద‌ర్భంగా ఆలియా భ‌ట్ మాట్లాడుతూ.. `నేను చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాను. ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది. మెట్ గాలాలో పాల్గొన‌డం ఇది రెండోసారి. అయితే చీరకట్టులో రావ‌డం మాత్రం ఇదే తొలిసారి. చీర కంటే కాలాతీతమైనది మరొకటి లేదు` అంటూ చెప్పుకొవ‌చ్చింది. భారతీయ సంస్కృతిని మెట్ గాలాలో చాట‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ఆలియా భ‌ట్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇక మ‌రోవైపు ఆలియా భ‌ట్ క‌ట్టుకున్న చీర ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. పాస్టల్ గ్రీన్ శారీని ఆలియా భ‌ట్ క‌ట్టుకుంది. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్ కు స‌రిప‌డేలా ఈ చీర‌ను డిజైన్ చేశారు. ఆలియా భ‌ట్ చీర కొంగు మొత్తం రెడ్ కార్పెట్ ను కవర్ చేసేసింది. అంత పొడుగ్గా చీర‌ను రూపొందించారు. ఇక్క‌డ షాకింగ్ విష‌యం ఏంటంటే.. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 163 మంది హస్త కళాకారులు 1905 గంటలు ఈ చీర‌ను త‌యారు చేయ‌డానికి శ్ర‌మించారట‌. పొడవాటి కొంగు చీరలో ఆలియా భ‌ట్ రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆమె చుట్టూనే తిరిగాయి. మెట్ గాలాలో ఆలియా చీర స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. కాగా, బాలీవుడ్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ తో వివాహ‌మైన ఏడు నెల‌ల‌కు పండంటి కూతురికి జ‌న్మనిచ్చిన ఆలియా భ‌ట్‌.. ప్ర‌స్తుతం జిగ్రా అనే సినిమాతో బిజీగా ఉంది. వాసన్ బాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

Related posts

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Saranya Koduri

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju