NewsOrbit
Entertainment News Telugu TV Serials

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

Brahmamudi May 07 Episode 403

BrahmaMudi: రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి అంటున్న మాటలు వింటూ సైలెంట్ గా ఉంటాడు. రుద్రాణి కావ్య నీ తప్పుపడుతుంది సుభాష్ నా కోడల్ని అనే హక్కు నీకు లేదు అని అంటాడు. నా కోడలు మీద ఆపనిందలు వేస్తే చూస్తూ ఊరుకోను అని అంటాడు ఆస్తి కోసం ఉంటుందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అని అంటాడు. నా కోడల్ని పల్లెత్తు మాట అనే హక్కు కూడా నీకు లేదు నోరు మూసుకొని తిను అన్నం అని అంటాడు. మమ్మీ నీ నిర్ణయాన్ని నేను గౌరవించాను నా నిర్ణయాన్ని నువ్వు ఆమోదించక పోయినా నువ్వు వెళ్లిపోమంటే నేను వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాను ఈ రెండు రోజులు నీ మనసు బాధ పెట్టి నా మనసు బాధ పెట్టుకోలేను. నేను వెళ్లేటప్పుడు నీకు ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. ఆ బాధ నీకు ఉండకూడదంటే నాతో కలిసి భోజనం చెయ్ మమ్మీ అని అడుగుతాడు. చేస్తాను తప్పకుండా చేస్తాను కాకపోతేఆ బిడ్డని వదిలేసి రా ఇప్పటివరకు జరిగిందంతా ఒక దురదృష్టకరమైన సంఘటనగానే మర్చిపోతాను. ఎప్పటిలా నీతో మాట్లాడతాను అని అంటుంది. నాకు ఆకలి చచ్చిపోయిందని రాజ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు.నీకు ఆకలి మాత్రమే చచ్చిపోయింది నాలో అమ్మతనం కూడా చచ్చిపోయింది నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ రాజ్ కూడా వెళ్ళిపోతాడు.

Brahmamudi May 07 Episode 403
Brahmamudi May 07 Episode 403

ఇక కావ్య నిజం బయటపడితే గాని ఇంట్లో గొడవలు అన్నీ సద్దుమనగా ఆ నిజాన్ని నేనే బయట పెడతాను అని మనసులో అనుకుంటుంది ఇక అప్పు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అసలు ఆ వీడియో రికవరీ అయిందా లేదు అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పు కాల్ చేస్తుంది. ఏంటే చెప్పిన పని ఎంత వరకు వచ్చింది అని అంటుంది. నువ్వు చెప్పింది ఏమైనా చిన్న పని అనుకున్నావా అని అంటుంది అప్పు ముందు అడిగిన దానికి సమాధానం చెప్పవే రికవరీ అయ్యాయా లేదా అని అంటుంది కావ్య. రికవరీ అయ్యాయా యొక్క అని అంటుంది దాంతో హమ్మయ్య అని అనుకుంటుంది కావ్య అయితే ఇంటికి వచ్చేసేయ్ అని అంటుంది నేను ఇప్పుడు అక్కడికి వస్తే లేనిపోని అనుమానాలు అన్నీ వస్తాయి అని అంటుంది అప్పు. నువ్వు రాకపోతే టెన్షన్ తో నేను చచ్చిపోతాను అని అంటుంది కావ్య. అలాంటిదేం జరగదు కానీ ఆ వీడియోలు అన్ని డ్రైవ్ చేసి నీ మెయిల్ లో పెట్టాను డౌన్లోడ్ చేసి చూసుకొని అంటుంది. అయితే నువ్వు ఫోన్ పెట్టేసేయ్ అని కావ్య టెన్షనుగా, లాప్టాప్ తీసుకొచ్చి ఆ వీడియోలని డౌన్లోడ్ చేస్తుంది ఇంట్లో ఎవరైనా చూస్తారేమోనని రూమ్ లోపల తలుపు వేసుకొని వీడియోలో ఏముందో అని టెన్షన్ పడుతూ ఓపెన్ చేస్తుంది. ఇక మరోవైపు రాజు ఒంటరిగా బయట నుంచొని ఉంటాడు. అక్కడికి సుభాష్ వచ్చి విన్నావు కదా మీ అమ్మ ఏం చెప్పిందో, ఇంక నీకు రెండు రోజులే గడువు ఉంది మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అంటాడు. చేయడానికి చెప్పడానికి నా దగ్గర ఏం లేదు డాడీ మామ్ కి నిజం చెప్పకుంటే ఒప్పుకోదు, నిజం చెప్పి నేను ఇంకో తప్పు చేయలేను అని అంటాడు. దానికన్నా నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవడం మంచిది అని అనిపిస్తుంది అంటాడు రాజ్ ఆ మాటలకు సుభాష్ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు కావ్య వీడియో డౌన్లోడ్ అవ్వలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సుభాష్ ఇదంతా నావలే వచ్చింది మీ పెళ్లి రోజు రాత్రి నువ్వు ఇంటికి వెళ్లి పోతు, తిరిగే నా వైపుకు రాకుండా ఉండాల్సింది అని అంటాడు. నువ్వు నేరుగా ఇంటికి వెళ్లిపోయి ఉన్నట్టయితే అందరూ సంతోషంగా ఉండి ఉంటారు అని అంటాడు. కానీ మీరు ప్రాణాలతో ఉండే వాళ్ళు కాదు కదా అని అంటాడు రాజ్.

Brahmamudi May 07 Episode 403
Brahmamudi May 07 Episode 403

ఇక కావ్య వీడియో డౌన్లోడ్ అయినందుకు, ఆ వీడియోలో ఏముందో ఏంటో అని టెన్షన్తో చూస్తూ ఉంటుంది. ఆ వీడియోలో సుభాష్ ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అది చూసి కావ్య షాక్ అవుతుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. లాప్టాప్ నీ పక్కన పడేసి వెనక్కి జరుగుతుంది. ఇక వీడియో ప్లే అవుతుంటే కావ్య ల్యాప్టాప్ ని మళ్ళీ తీసుకొని ఒళ్లో పెట్టుకొని చూస్తూ ఉంటుంది. సుభాష్ ఉరి వేసుకుంటే రాజ్ అటుగా వెళుతూ గమనించి లోపలికి వస్తాడు. డాడీ మీరేం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా నన్ను అమ్మని వదిలేసి ఈ పిచ్చి పని ఏంటి అయినా మీకు ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని గట్టిగా నిలదీస్తాడు. నేను రావడం క్షణం ఆలస్యం అయ్యి ఉంటే ఏం జరిగేది మీరు నాకు దూరం అయిపోయే వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అయినా నేనుండగా మీకేం కానివ్వండి అని అంటాడు అసలు మీరు ఎందుకు ఇలా చేశారో చెప్పండి ఏమైంది అంత బాధ ఏమొచ్చింది మా నుంచి దూరం అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు అని గట్టిగా అడుగుతాడు. సుభాషిని కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి ఇప్పుడు నిజం చెప్పండి డాడ్ మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను మీకు ఏ బాధ ఉన్నా కానీ నేను తీరుస్తాను నిజం చెప్పండి అని అడుగుతాడు దాంతో సుభాష్ ఎమోషనల్ గా నేను నీకు నిజం చెప్పలేను చెప్పలేక కదా ఇలా ఉరివేసుకోవాలనుకున్నాను మీ అందరికీ దూరం అవ్వాలి అనుకున్నాను అని అంటాడు.

Brahmamudi May 07 Episode 403
Brahmamudi May 07 Episode 403

చెప్తున్నాను కదా డాడ్ మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తానని మీకు ఏ కష్టం రానివ్వను నిజం చెప్పండి అంటే అప్పుడు సుభాష్ నేను వైజాగ్ బ్రాంచ్ లో మాయా అనే సెక్రటరీ తో ఒకరోజు రాత్రి నా పెద్దరికం పక్కనపెట్టి దుగ్గిరాల వంశం పరువు నువ్వు మంటలో కలిపి నేను అమ్మాయితో ఒక రోజు రాత్రి అని ఆపేస్తాడు వెంటనే రావచ్చు అర్థమైంది అని అంటాడు. ఆ తర్వాత అమ్మాయి అంతటితో అయిపోయిందని వెళ్ళిపోయింది. అన్యాయం చేశానని పశ్చాత్తాపంతో తిరిగి వచ్చేసాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తిరిగి వచ్చి నాకు ఆ అమ్మాయితో ఉన్న సంబంధానికి ఒక బిడ్డ పుట్టాడని ఆ బిడ్డను మీడియా ముందుకు తీసుకువెళ్లి నిజం చెప్తానని బెదిరిస్తుంది ఇప్పుడు ఏం చేయాలో తెలీక నేను దూరమైతే అయినా ఇక్కడితో ఈ సమస్య లాగిపోతాయని అనుకున్నాను. మీ అమ్మకి అన్యాయం చేసి, మాయకి న్యాయం చేయలేక నేను చనిపోవడమే మంచిది అనుకున్నాను నా గురించి ఇంట్లో తెలిస్తే మీ నానమ్మ తాతయ్య తట్టుకోలేరు మీ అమ్మ గుండె పగిలిపోతుంది అందుకనే ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్తాడు దాంతో రాజ్ షాక్ అయిపోతాడు.ఈ విషయాలను ఎవరితో చెప్పలేను అని అంటాడు దానికి రాజ్ ఇప్పుడు నా దగ్గర ఒకటే మార్గం ఉంది మిమ్మల్ని కాపాడడానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు.

Brahmamudi May 07 Episode 403
Brahmamudi May 07 Episode 403

ఇక రాజ్ మీ వ్యక్తిత్వంపై ఎలాంటి మచ్చ పడకుండా మాయ బిడ్డని నా కొడుకుగా ఇంటికి తీసుకువెళ్తాను అని అంటాడు దానికి శుభ సోప్పుకోడు నేను తప్పు చేస్తే నువ్వు నింద పడాల్సిన అవసరం లేదు అని అంటాడు నేను తప్పు చేసినా పర్వాలేదు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. కానీ మీరు తప్పు చేశారని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు అమ్మ గుండె ఆగిపోతుంది అమ్మ కోసం నేను ఈ నిందని నా మీద వేసుకుంటాను ఏం జరిగినా సరే ఎలాంటి అవమానాలు జరిగిన ఇంట్లో ఎలాంటి గొడవలు జరిగిన నన్ను ఎంత మంది అవమానించిన ఈ నిజాన్ని మీరు బయట పెట్టకూడదని సుభాష్ తో తన మీద ఒట్టు వేయించుకుంటాడు. ఇదంతా చూసి కావ్య షాక్ అవుతుంది ఆ వీడియోలో రాజ్ దగ్గర ఉన్న బిడ్డ రాజ్ బిడ్డ కాదని సుభాష్ బిడ్డ అని తెలుసుకొని కావ్య షాక్ అవుతుంది రాజ్ తన తమ్ముడిని కొడుగ్గా ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడని కావ్యఆశ్చర్యంలో ఉండిపోతుంది.ఇక మరోవైపు రాజ్ తో సుభాష్ బయట మాట్లాడుతూ ఉంటాడు మీ అమ్మకి నిజం చెప్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇంట్లో ఉంటావు అని అంటాడు నేను నిజం చెప్పి ఇంట్లో ఉండడం కన్నా అబద్ధంతో బయటకు వెళ్లడమే మంచిది గుండె ఆగిపోతుంది ఆమె లేని జ్ఞాపకాలతో బతకడం కంటే ఆమెని దూరం నుంచి అయినా చూసుకోవచ్చు నేను బయటికి వెళ్తే మహా అయితే నేను తప్పు చేశాను అని అనుకుంటారు కానీ తప్పు చేసిన కొడుకుని కూడా బయటికి పంపించిందని అమ్మని అందరూ మెచ్చుకుంటారు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు ఇది నిజం మనలోనే ఉండాలి అని అంటాడు దానికి సుభాష్ నేను తప్పు చేసి నీకు పెద్ద శిక్ష వేశాను పశ్చాతాపంతో జీవితాంతం ఈ బాధని అనుభవించడమే అని అంటాడు.

Brahmamudi May 07 Episode 403
Brahmamudi May 07 Episode 403

రాజ్ దగ్గర పెరుగుతున్న బిడ్డ వెనుక రహస్యం అంతా కావ్య తెలుసుకుంటుంది కానీ ఆ నిజాన్ని నలుగురికి చెప్పలేక సతమతమవుతూ కృష్ణుడి మందిరం దగ్గరికి వెళ్లి కృష్ణుడితో తన బాధని చెప్పుకుంటుంది. ఏమిటి కృష్ణ ఇలా చేశావు. నా భర్త తప్పు చేయలేదని బిడ్డని ఇంటికి తీసుకొచ్చిన రోజే నాకనిపించింది నేను నా భర్త మీద నమ్మకం పెట్టుకున్నాను ఆ నమ్మకమే ఇవాళ గెలిచిందని నేను సంతోషించాల ఈ తప్పు చేసింది మా ఇంట్లో వ్యక్తి అది మా మామగారిని తెలిసి బాధపడాలా కొడుకు తప్పు చేస్తేనే తట్టుకోలేని మా అత్తగారు ఇంట్లో నుంచి వెలివేస్తుంది అలాంటిది తన తాళి కట్టించుకున్న భర్త తప్పు చేశాడు అని తెలిస్తే ఆమె ఏమైపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి నిజం తెలిసి మౌనంగా ఉండాలా ఈ నిజాన్ని చెప్పి మా అత్తగారిని మా మామగారి పరువు తీయాలా అని మనసులో అనుకుంటుంది కృష్ణుడి దగ్గర మొరపెట్టుకుంటుంది. ఇప్పుడు తప్పు చేసింది మా మామయ్య గారు అని తెలిసి నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితిని నాకు కల్పించావు అని బాధపడుతుంది.ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi May 07 Episode 403
Brahmamudi May 07 Episode 403

రేపటి ఎపిసోడ్ లో, అపర్ణ ఎదురుగా నిలబడి, మీరు నా భర్తని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం జరిగినా, నేను దానికి తలవంచటానికి సిద్ధంగా ఉన్నాను. మీ నిర్ణయానికి నా భర్త ఎలా తలవంచాడో, నేను అలానే అంగీకరిస్తాను. నా భర్తతో పాటే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఆ మాట విని ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అపర్ణ, ఇందిరా దేవి ఏమి మాట్లాడలేక అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక రాజ్ రూంలోకి వచ్చి కావ్య భుజం మీద తలవాల్చి బాధపడుతూ ఉంటాడు. కావ్య రాజ్ బాధపడడం చూసి తట్టుకోలేక పోతుంది.

Related posts

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

bharani jella

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella