Categories: వ్యాఖ్య

పగ సాధిస్తా! నిను వేధిస్తా!! 

Published by
Siva Prasad

ప్రపంచం లో చైనీస్ సరుకులు అమ్మని చోటు లేనట్లుగానే, ఆ దేశపు సామెతలు చెల్లుబాటు కానీ రంగాలు కూడా లేవు. ఉదాహరణకి ఈ సామెత చూడండి-  “పగసాధించి తీరాల్సిందే అనుకునే వాళ్ళు రెండు సమాధులను సిద్ధం చేసి పెట్టుకోవాలి; ఒకటి తమ శత్రువు కోసం – మరొకటి తమ కోసం!” – ఇది ఓ చైనీస్ సామెత. మన దేశంలో దీనికి ఉన్నంత డిమాండ్ బహుశా చైనాలో కూడా ఉండదేమో.
మన ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు. పగతీర్చుకోవడానికే జీవితాలను అంకితం చేసిన మహానుభావులు లేని చోటు ఎక్కడా ఉండదేమో. పోనీ వీళ్ళందరూ ఒకే పోలికలతో ఉంటారా అంటే అలాక్కూడా ఉండరు. ఒకేలా ఆలోచించే అలవాటు కూడా ఉండదు వీళ్ళకి. కొందరైతే గుట్టుగా తమ పగ తీర్చుకోవాలని చూస్తారు. మరి కొందరు బాహాటంగా పగ సాధించాలని పడరాని పాట్లు పడుతూ ఉంటారు. వాళ్ళైనా వీళ్ళయినా, పగ సాధించడం కోసం చట్టాలను ఉల్లంఘించడం కద్దు. మరికొందరు శాంతి భద్రతల యంత్రాంగం దృష్టికి రాకుండా, గోప్యంగా తమ పగ సాధించుకోవాలని చూస్తారు. చిత్రమేమిటంటే, ఇక్కడ మాత్రమే- అంటే మనదేశంలో ఒక్కచోటే- పగ సాధించడానికి చట్టాలనూ, చట్టసభలనూ, రాజ్యాంగ వ్యవస్థలనూ, చివరికి రాజ్యాంగాన్నిసైతం వినియోగించడం చూస్తాం. పగ తీరడం మాట దేవుడెరుగు కానీ, దశాబ్దాల అనుభవం ప్రాతిపదికగా రూపు దిద్దుకున్న రాజ్యాంగ వ్యవస్థలు మాత్రం ఈ క్రమంలో సర్వనాశనం అయిపోతాయి! మన దేశం ఇదే  విషాద భరిత నాటకంలోని ఆసక్తికరమైన ఒక అంకాన్ని చూస్తోందిప్పుడు.
అనగనగా ఓ చిదంబరం! దేశ దేశాలు తిరిగేసి, తెగబోలెడు చదివేసి, రెండు చేతులా సంపాదించి, సుప్రీం కోర్ట్ న్యాయవాదిగా జెండా ఎగరేశాడు. నిదానంగా రాజకీయ రంగ ప్రవేశం చేశాడాయన. సరే, గత ఏభై ఏళ్లుగా, మన దేశంలో రాజకీయాలకన్నా లాభసాటి వృత్తీ, వ్యాపారం మరేదీ లేనందువల్ల, అందులోనూ కుమ్మేశాడు! డజన్ల కొద్దీ భవంతులనూ, సినిమా హాళ్ళనూ, మాల్స్ నూ, వందల ఎకరాల తోటలూ దొరువులనూ సంపాదించాడాయన. రాష్ట్ర రాజకీయాల్లో చాణక్య నీతికి చిరునామా అనిపించుకున్నారు. కేంద్రంలో ఆర్ధిక మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. హోమ్ మంత్రిగా గండరగండళ్ళను గడగడలాడించాడు. కాంగ్రెస్ కొలువుకూటంలో ప్రధాన విదూషకుడిగా రాణించాడు. ఇన్ని సాధించిన వాడు, తన సుపుత్రుణ్ణి తనకు వారసుడిగా తీర్చి దిద్దాలని, తనకు మించిన స్థాయిలో అతగాడు వర్ధిల్లాలని కోరుకున్నాడంటే అందులో వింతేముంది? అంత చిన్న  పాపానికి, పాపం, చిదంబరాన్ని తప్పు పట్టలేం కదా! ఎటొచ్చి, తానొకటి తలిస్తే దైవం మరొకటి తేల్చింది పాపం! ఇప్పుడు అదే కుమారరత్నం నిర్వాహకం పుణ్యమా అని చిదంబరం సీబీఐ శరపరంపరగా గుప్పిస్తున్న ప్రశ్నల జడివానలో తడిసి ముద్దవుతున్నారు!
మన ప్రపంచంలో, ముఖ్యంగా మన పుణ్యభూమిలో, కారణం లేని కార్యాలేవీ జరగవు. చిదంబరానికి ఈ గతి పట్టడానికి సైతం ఒకానొక కారణం ఉంది. ఆయన కేంద్ర  హోమ్ మంత్రిగా ఉన్న రోజుల్లో అమిత్ షా గుజరాత్ లో చెలరేగి పోవడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ అగ్రనాయకుల ఆదేశాల మేరకే చిదంబరం, సదరు షా కి చెక్ చెప్పారు; సోహ్రాబుద్దీన్ ”ఎన్కౌంటర్” కేసులో షాని జైలుపాలు చేశారు. అది కూడా సీబీఐ చేతులమీదుగానే చేయించారు ఆనాటి కేంద్ర హోమ్ మంత్రి. అదే ఇప్పుడు చిదంబరం మెడకు యమపాశంగా పరిణమించింది.
ఈ లోకంలో, ఏదైనా స్థిమితంగా ఉండొచ్చు కానీ కాలచక్రానికి మాత్రం కాలునిలకడ బొత్తిగా ఉండదు. ఎదో కొంపలు ములిగిపోతున్నట్లుగా గిరగిరా తిరుగుతూనే ఉంటుందది. ఆ విధంగా కాలచక్ర పరిభ్రమణంలో చిదంబరం అనే ఓడ బండిగా మారింది- అమిత్ షా బండి ఓడై కూర్చుంది. ఇటీవలనే సదరు షా కేంద్ర హోమ్ మంత్రిగా పదవీ స్వీకారం చేసి కొత్త అంకానికి తెర తీశారు. సీబీఐ చేతులమీదుగానే చిదంబరానికి “షా” చెప్పారు అమిత్ షా. అంతకు ముందు జరిగిన నాటకీయ పరిణామాల గురించి చెప్పకపోతే, కథ రక్తికట్టదు మరి! మాజీ కేంద్రమంత్రి చిదంబరం దేశం వదిలి పరారీ కాబోతున్నట్లు మన “ఇంటెలిజెంట్” వర్గాలు ఓ కథనం ప్రచారంలో పెట్టాయి. పత్రికాగోష్టిలో పాల్గొని వచ్చిన మాజీ హోమ్ మంత్రి ఇంటి గోడలు దూకి మరీ వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడితో కథ అయిపోలేదు. ఇది చిన్న మలుపు మాత్రమే!
కొన్ని వేల కేసుల్లో ముద్దాయిల్ని తికమక పెట్టిన వకీలు చిదంబరం సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరని కాదు- అంతటి వ్యవహర్తకి సొంత కేసు ఎలా పరిష్కరించుకోవాలో తెలియదనీ కాదు. అటు, చిదంబరమైనా- ఇటు షా అయినా రాజ్యాంగ బద్ధ వ్యవస్థల్ని రాజకీయ ప్రయోజనాల కోసం పుర్రచెయ్యి మాదిరిగా వాడుకోవడం ఎక్కడికి దారి తీస్తుంది? ఓడలు బళ్లయినప్పుడల్లా రాజ్యాంగ బద్ధ వ్యవస్థల్నిఇలా ఎడాపెడా వాడుకుంటూ పోతుంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయి?
ఇవీ, మనం అందరం ఆలోచించాల్సిన ప్రశ్నలు ! కానీ, మన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈ ప్రశ్నల  తాలూకు ప్రాధాన్యం గుర్తించిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. రాజ్యాంగ బద్ధ వ్యవస్థలతో ఇలా పింగ్- పాంగ్ ఆడడం ఎంత ప్రమాదకరమో ఈ క్రియాశీలకులు గ్రహించినట్లు కనిపించదు. అందుకే అనేది- ప్రస్తుతం దేశం ఒకానొక విషాద భరిత నాటకంలోని ఆఖరి అంకాన్ని చూస్తోందని!!
“కానూన్ ఉన్నది కనుక, కానున్నది కాక మానదు!”
కానివ్వండి- అదీ చూద్దాం!!

 – మందలపర్తి కిషోర్

This post was last modified on August 25, 2019 9:58 am

Siva Prasad

Recent Posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ నామినేషన్ దాఖలు చేసిన… Read More

May 14, 2024

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

సీChandrababu: ఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని..… Read More

May 14, 2024

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

Pulavarti Nani: ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి పులవర్తి… Read More

May 14, 2024

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుండి జూన్… Read More

May 14, 2024

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Lok sabha Elections 2024: ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. మోడీ… Read More

May 14, 2024

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Dhe: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కంటే కమెడియన్సే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. హీరో మరియు హీరోయిన్స్… Read More

May 14, 2024

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Super Jodi Winner: జీ తెలుగు సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో అయిన సూపర్ జోడి గ్రాండ్ ఫినాలే ముగిసింది.… Read More

May 14, 2024

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Inaya: చూపు తెప్పకుండా మాట దాటకుండా చేసే అందం మైమరిపించే పాటు డేరింగ్ అండ్ డాషింగ్ గట్స్ తో ఆకట్టుకున్న… Read More

May 14, 2024

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Balakrishna: నటి మరియు యాంకర్ అయినటువంటి ఉదయభాను మనందరికీ సుపరిషతమే. ఆరోజుల్లో ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అయ్యేవారు. కొన్ని… Read More

May 14, 2024

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Jabardasth Sujatha: ప్రజెంట్ జనరేషన్ లో చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా.‌.. తాము సంపాదించిన దాంట్లో కొంతమేర… Read More

May 14, 2024

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

Double Ismart teaser: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006వ సంవత్సరంలో "దేవదాసు"… Read More

May 14, 2024

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.… Read More

May 14, 2024

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా సత్తా చాటుతున్న వారిలో అజిత్ కుమార్ ఒకడు. నిజానికి అజిత్… Read More

May 14, 2024

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

Barzan Majid: మానవ అక్రమ రవాణాలో ఆరితేరి, యూరప్ మోస్ట్ వాంటెడ్ గా మారిన బర్జాన్ మాజీద్ అలియాస్ స్కార్పియన్… Read More

May 14, 2024

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

Chiranjeevi-Balakrishna: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభా, స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.… Read More

May 14, 2024