‘పరిపాలనపై జగన్ దృష్టిపెట్టాలి’

Published by
sharma somaraju

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. వ్యక్తిగత మత విశ్వాసాలు ఉంటే పూజ గదికే పరిమితం చేయాలనీ, ప్రభుత్వంలో చొప్పించ కూడదనీ అన్నారు. జెరూసలేంకు ఆర్థిక సాయం చేసే ప్రభుత్వం బద్రీనాధ్‌కో, కేధార్‌నాధ్‌కో వెళ్లడానికి హిందువులు సాయం చేయమంటే ఏం చేస్తారని సుజనచౌదరి ప్రశ్నించారు. పన్నుల రూపంలో ప్రజల నుండి వచ్చిన సొమ్మును ఇష్టానుసారం మతాల వారీగా పంచడం రాజ్యాంగ విరుద్దమని ఆయన అన్నారు. అధ్యాత్మిక టూరిజాన్ని అభివృద్ధి చేసి వచ్చిన రాబడితో ప్రభుత్వం డబ్బులు పంచిపెట్టుకుంటే అభ్యంతరం లేదని అన్నారు. ప్రజల నుండి పన్నులుగా వచ్చిన సొమ్మును నచ్చిన మతాలకు ఇవ్వడంపైనే అభ్యంతరమని పేర్కొన్నారు. ఈ విషయాలు అన్నీ తాను కేంద్రం పెద్దలతో సంప్రదించే మాట్లాడుతున్నానని సుజనా వివరించారు.

ఇంగ్లీషు మీడియం నిర్ణయం తీసుకునే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సుజనా ప్రశ్నించారు. ఉపాధ్యాయులను సిద్ధం చేయకుండా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం సరికాదని అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తే విద్యార్థులు అటూ ఇటూ కాకుండా పోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యావేత్తలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని సుజనా అభిప్రాయపడ్డారు. మైసూర్‌లో ఉన్న తెలుగు అధ్యయన కేంద్రం ఏపి రావడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారని గుర్తు చేస్తూ రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తిపైనా చులకనగా మాట్లాడటం అక్షేపణీయమన్నారు. పిల్లలు సృజనాత్మకంగా పెరగాలంటే మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని చెప్పేందుకు శాస్త్రీయ కారణాలున్నాయని సుజనా అన్నారు. 6400 హైస్కూళ్లు ఉంటే కేవలం 32శాతం మంది మాత్రమే ఇంగ్లీషు మీడియంలో చేరుతున్నారని ఆయన చెప్పారు. సగానికి పైగా హైస్కూళ్లలో తెలుగు మీడియంలోనే చేరుతున్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు

ఆరు నెలలైనా పరిపాలనపై జగన్ దృష్టి పెట్టలేదని సుజనా విమర్శించారు. రాజు మారగానే రాజధాని మార్చడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో రాజధాని మాత్రమే కాదు అన్ని ప్రాజెక్టులను నిలిపివేశారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుండి నిధులు కూడా రావని సుజనా చెప్పారు. ఇప్పటికైనా ఎన్నికల కోణం నుండి బయటకు వచ్చి పాలనపై దృష్టి పెట్టాలని అన్నారు.

‘25మంది ఎంపిలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఇప్పుడేమైంది, వైసిపికి 22 మంది ఎంపిలు ఉండి ఏం లాభం, వారు ఎటు మాట్లాడినా ఉలిక్కిపడుతున్నారు’ అని సుజనా వ్యాఖ్యానించారు. నగేరా పథకాలకు కేంద్రం ఇచ్చిన సొమ్ములను దారి మళ్లిస్తున్నారనీ, ఆ పథకాలపై ఆధారపడే పేదల కడుపు కొట్టడం సరికాదనీ అన్నారు. కృష్ణారివర్ బోర్డును అమరావతికి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. జగన్ నిర్ణయాలు చూసి జనం నవ్వుకుంటున్నారని సుజనా వ్యాఖ్యానించారు.

ఏపిలో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదగాలనే అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో చర్చించామని సుజనా చెప్పారు.

This post was last modified on November 22, 2019 10:07 am

sharma somaraju

Recent Posts

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024