ఏపీ రాజకీయాలు ఇప్పుడు గవన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ తిరుగుతున్నాయి. వంశీని టీడీపీ సస్పెండ్ చేసిన తర్వాత కృష్ణా జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో హాట్ హాట్ గా ఉన్నాయి. టీడీపీని వీడి త్వరలోనే వైసీపీలో చేరేందుకు సిద్దమైన వంశీ తెలుగుదేశం పార్టీపై విమర్శలుకు పదును పెట్టారు. అయితే రెండు రోజుల క్రితం డైరెక్టుగా చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తు వంశీ మాట్లాడే సరికి వివాదం తరస్ధాయికి చేరుకుంది. ఒక ప్రముఖ ఛానెల్ డిబేట్ లో టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. రాజేంద్రప్రసాద్ పై వంశీ అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజలు వీక్షిస్తున్నారన్న విషయం కూడా మరచిపోయి ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. జోకర్, బఫూన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగిపోలేదు బాబూ రాజేంద్రప్రసాద్ ఎలా ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్నారో వల్లభనేని వంశీ పూస గుచ్చినట్లు వివరించారు. అంతేకాదు ఎన్నికల సమయంలో టీడీపీ నేత బోడె ప్రసాద్ నుంచి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ డబ్బు తీసుకున్నారంటూ వంశీ ఆరోపణలు చేశారు. ఇప్పుడీ అంశం జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. బోడే ప్రసాద్, రాజేంద్రప్రసాద్ కు డబ్బులు ఎందుకు ఇచ్చాడు ? ఇద్దరి మధ్య లావాదేవీలకు సంబంధించిన అంశాలపై చర్చలు మొదలైయ్యాయి.
దీంతో వల్లభనేని వంశీపై టీడీపీ కౌంటర్ అటాక్‌కు దిగింది. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని వంశీ ఆరోపించటాన్ని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఖండించారు. రాజేంద్రప్రసాద్ కు తాను ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని, రాజేంద్రప్రసాద్ తో తనకు ఎలాంటి నగదు లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. వంశీ తనకు మంచి స్నేహితుడు అని చెప్పిన బోడె ప్రసాద్.. స్నేహం వేరు.. రాజకీయం వేరు అని పేర్కొన్నారు. ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగత దూషణలు మంచిది కాదని, మొన్నటి వరకు టీడీపీ నేతలను గౌరవించిన వ్యక్తి వైసీపీలోకి వెళ్లగానే విమర్శలకు దిగడం మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు. తాను కూడా పార్టీ మారతానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. అవసరమైతే రాజకీయాలు మానుకుంటా తప్ప పార్టీ మాత్రం మాననని బోడె ప్రసాద్ స్పష్టం చేశారు.
వంశీ విషయంలో టీడీపీ హైకమాండ్ కి హై బీపీ పెరిగిపోతోంది. ఆయన ఇంకా ఎవరిని టార్గెట్ చేస్తారు ? అన్నది ఉత్కంఠగా మారింది. వైసీపీలో చేరే వరకు వంశీ టీడీపీపై విమర్శల దాడిని కొనసాగించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన ఇప్పటికే విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. తనను కించపరిచేలా ఆడపిల్లల పేర్లుతో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎమ్మెల్యే వంశీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ సోషల్ వింగ్ పేరుతో సర్క్యులేట్ చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమలను టార్గెట్ చేసిన వంశీ.. ఇకమీదట ఏ టీడీపీ నేతను టార్గెట్ చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది.
This post was last modified on November 17, 2019 10:03 am
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More