తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలో ఇప్పుడు ఫైర్ తగ్గిందా? ఎమ్మెల్యేగా ఓడిన సమయంలోనూ కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడిన జగ్గారెడ్డి… ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? గత కొద్ది రోజులుగా కేసీఆర్ పై సానుకూల వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు ? ఇప్పుడివే అంశాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర తల వంచుతానని జగ్గారెడ్డి కామెంట్ చేశారు. శుక్రవారం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎంకు వ్యతిరేకంగా తాను స్టేట్మెంట్లు ఇవ్వనన్నారు. అలాగే ఎవ్వరూ ఇవ్వద్దన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూడా స్టేట్మెంట్లు ఇవ్వద్దని సూచించారు. సంగారెడ్డి అభివృద్ధే ముఖ్యమని, తన ప్రతి మాట, ప్రవర్తన వెనుక ఎత్తుగడ ఉంటుందన్నారు. ఒక వ్యూహంతోనే తాను మాట్లాడతాని, వ్యూహం లేకుండా మాట్లాడనని చెప్పారు. తాను ఏది చేసినా సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల కోసమేనని అన్నారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. జగ్గారెడ్డి తాజా ప్రకటన వెనుక అర్ధం ఏమిటని అనుచరులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
అయితే, ఎన్నికలకు కొన్నాళ్లకు ముందు అక్రమ మనుషుల రవాణా కేసులో అరెస్టై, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న జగ్గారెడ్డి… వాటికి కేసీఆరే కారణమని భావిస్తున్నారు. తాను గెలిస్తే కేసీఆర్, హరీశ్‌రావుల సంగతి చూస్తానని గతంలో పలుసార్లు హెచ్చరించారు. అయితే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీనే మరోసారి అధికారం దక్కింది. కేసీఆర్‌పై విమర్శలతో విరుచుకుపడతారని భావించిన జనాలకు జగ్గారెడ్డి షాకిచ్చారు. తానిక కేసీఆర్‌ను తిట్టబోనని, రాజకీయ విమర్శలు చేయబోనని.. నియోజక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలుస్తానని, జిల్లా మంత్రులతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తీరునూ ఆయన తప్పుబట్టారు. ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్‌ను విమర్శించడం వృథా అన్నారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌ను విమర్శించడం మానుకోవాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అంతగా బలంలేని కాంగ్రెస్ అండతో కేసీఆర్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాకపోవచ్చనే ఆందోళనలో జగ్గారెడ్డి ఉన్నారని రాజకీయవర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలోకి జంపవుతారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. మరోవైపు జగ్గారెడ్డి మాట, ప్రవర్తన వెనుక ఏదో ఎత్తుగడ ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే జగ్గారెడ్డి ఏం వ్యూహాం చేశారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on October 11, 2019 3:27 pm
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More
Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More