కరోనా వైరస్.. చైనా తయారు చేసిన జీవాయుధమా!?

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ప్రపంచాన్ని భయపెడుతున్న ‘కరోనా వైరస్‌’వూహాన్‌లోని జంతుమాంసం విక్రయించే మార్కెట్‌ నుంచి వ్యాపించలేదా? చైనా తయారు చేసిన జీవాయుధం (బయో వెపన్) ప్రయోగశాలలో ఉండాల్సిన ఆ వైరస్‌ పొరపాటున బయటి ప్రపంచంలోకి వచ్చి విస్తృతంగా వ్యాపిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.  కరోనా వైరస్ కారణంగా చైనాలో 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ఎక్కడ తమ దేశంలోకి ప్రవేశిస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైరస్ జంతుమాంసం విక్రయించే మార్కెట్‌ నుంచి పుట్టిందని తొలుత చైనా వెల్లడించింది. కానీ అందులో నిజం లేదని ఇజ్రాయెల్‌కు చెందిన డానీ షోహమ్‌ అనే మైక్రోబయాలజిస్టు అంటున్నారు.

చైనా తన యుద్ధ వ్యూహాల్లో భాగంగా వూహాన్‌లోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో జీవాయుధాలను తయారుచేస్తోంది. అయితే, రసాయనిక, జీవాయుధాల తయారీపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. వాటివల్ల శత్రు దేశ సైనికులకే కాక సామాన్యులకు కూడా ముప్పు ఉంటుంది కాబట్టి ఈ నిషేధం. కానీ, కొన్ని దేశాలు తమ బయొలాజికల్‌ వార్‌పేర్‌లో భాగంగా రహస్యంగా ఈ తరహా వైర్‌సలను తయారు చేస్తున్నాయనే అనుమానం ఉంది. చైనా కూడా ఇలాగే చేస్తోందని.. ఈ వైర్‌సను తయారుచేస్తున్న ల్యాబ్‌ వూహాన్‌లోనే ఉందని డానీ షోహమ్‌ ఆరోపిస్తున్నారు. ‘వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’ చైనా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించిన బయోసేఫ్టీ లెవెల్‌ 4గా వ్యవహరించే వైరాలజీ కేంద్రం. కరోనా వంటి వైరస్లను నియంత్రించేందుకు పరిశోధనల కోసం 2018లో దీన్ని నిర్మించారు. అక్కడ చైనా తన జీవాయుధ కార్యక్రమంలో భాగంగా కరోనా వైరస్లతోపాటు, ఎబోలా, నిపా వైరస్‌ తదితర సూక్ష్మజీవులపై పరిశోధనలు చేస్తోందని డానీ షోహమ్‌ చెప్పారు. ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు లీకైందనే ఆరోపించారు.. కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి అతి దూరంలోనే వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోసేఫ్టీ లాబోరేటరీ ఉండటం అనుమానాలకు తావిచ్చింది.

మరోవైపు కరోనా వైరస్‌ తమ తప్పేనని చైనా అంగీకరిస్తూ క్షమాపణ చెప్పబోతోందని చైనీస్‌ కోటీశ్వరుడు గుయోకు చెందిన పత్రిక ఒకటి సంచలన కథనాన్ని ప్రచురించింది. చైనా కావాలనే ఈ వైరస్ ను లీక్‌ చేసిందనే అనుమానం వచ్చేలా కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది. అయితే, గుయో ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన కావాలనే ఇలా అసత్య కథనాలు ప్రచారం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వైరస్ టీకాను తయారు చేస్తున్నట్టు అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఫర్‌ హెల్త్‌ అధికారి ఆంథోనీ తెలిపారు. ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. కరోనా వైరస్‌ వ్యాపించే ముప్పు అధికంగా ఉన్న 30 దేశాల్లో భారత్‌ కూడా ఉందని యూకేకు చెందిన సౌథాంప్టన్‌ వర్సిటీ అధ్యయనంలో తేలింది.

కరోనా చైనా జీవాయుధం అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి దీనికి వుహాన్‌‌లో ప్రయోగశాలే కారణమని తాను నమ్మడం లేదని ఆస్ట్రేలియా డిఫెన్స్ అనలిస్ట్ డాక్టర్ మాల్కమ్ డేవిస్ ట్వీట్ చేశారు. కానీ బయో సైన్స్‌లో చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుండటం, నైతికతకు కట్టుబడి ఉండని దాని వైఖరి అనుమానాలకు తావిస్తోంది. చైనా కరోనా వైరస్ విషయంలో నోరు మెదపకపోవడంతో అనుమనాలు మరింతగా పెరుగుతున్నాయి.

ఇదిఇలా ఉంటే.. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకు వ్యాధి కేంద్రంగా ఉన్న వుహాన్ లోనే నమోదైన మరణాలు తాజాగా ఆ దేశ రాజధాని బీజింగ్ కు పాకాయి. చైనాలోని మొత్తం పది నగరాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. చైనాలో గత డిసెంబరులో తొలి కరోనా వైరస్ కేసు వుహాన్ లో బయటపడింది. ప్రస్తుతం వుహాన్ నగరంలో ఉన్న 11 మిలియన్ల మంది ప్రజలను నగరం వరకే పరిమితం చేశారు. వీరి ద్వారా ఇతర ప్రాంతాలకు మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చైనాలో 130 మందికిపైగా చనిపోయారు. సుమారు ఆరు వేల మంది ఈ ప్రమాదకర వైరస్ బారిన పడినట్టు గుర్తించారు. చైనాలో ప్రత్యేకంగా కరోనా వైరస్ బాధితుల కోసమే యుద్ధప్రాతిపదికన వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నారు.

This post was last modified on January 30, 2020 5:56 pm

Mahesh

Share
Published by
Mahesh
Tags: american biological weapons strike chinaanimal-borne diseaseap latest newsap newsap news updatesap politicsbiological war against chinabiological warfarebiological warfare (film subject)biological weaponbiological weaponsbiological weapons conventionchinachina biowarfare programmechina chemical weaponschina virusChina's covert biological weapons programchinese bio-weaponschinese biological espionageChinese biological warfareChinese biological weaponschinese government biological experimentscoronaviruscoronavirus casecoronavirus chinacoronavirus newscoronavirus outbreakcoronavirus symptomsDany Shohamdeath toll of coronavirusformer Israeli military intelligence officer Dany ShohamIsraeli biological warfare analystjapan biological weaponsjapan wwii biological weaponslaboratory in Chinalatest ap politicslatest newslatest news todaylatest news updates todaylatest politicslatest politics newslatest telugu newslatest telugu news updatesnews orbitnews orbit teluguNovel coronavirusonline latest newsonline newsonline telugu newspolitical newspolitics latest newsPolitics newssuspected case of coronavirussuspected coronavirus case in patnasuspected coronavirus in indiaTelangana Newstelugu newstelugu news channelstelugu news latest updatestelugu news onlinetelugu online newstelugu varthaluthe new chinese virus is an american biological weapontoday news updatestop telugu newswhat is Coronaviruswhat is the coronaviruswuhan coronavirusWuhan Institute of VirologyWuhan VirusWuhan-based laboratory

Recent Posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024