YSRCP: మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి ఎమోషనల్ స్పీచ్ వెనుక..

Published by
sharma somaraju

YSRCP: మాజీ మంత్రి, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి తన ఆవేదనను బహిరంగ వేదికపై మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఎమోషనల్ స్పీచ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. నియోజకవర్గ ప్రజలు తనను ఎప్పుడూ ఆదరిస్తున్నా, అభిమానిస్తున్నా సీఎం వైఎస్ జగన్ మాత్రం తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్ధసారది.

వైసీపీ సామాజిక బస్సు యాత్ర వేదికపై ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక ఇన్ చార్జిల మార్పులు, చేర్పుల వ్యవహారంలో తనను పక్కన పెట్టే అవకాశం ఉందని బావించే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా సీనియర్ నేతగా ఉన్న కొలుసు పార్ధసారధికి జగన్ కేబినెట్ లో అవకాశం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆయనకు అవకాశం లభించలేదు. ఆ తర్వాత రెండున్నరేళ్ల తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో అయినా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని పార్ధసారధి ఆశించారు. కానీ జగన్ అవకాశం కల్పించలేదు. దీంతో అప్పట్లోనే అసంతృప్తిని వ్యక్తం చేశారు.

గతంలో వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేసిన పార్ధసారధి .. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా మాత్రమే ఉండిపోవాల్సి వచ్చింది. దానికి తోడు రాబోయే ఎన్నికల్లో పెనమలూరు టికెట్ ను కూడా సర్వే నివేదికల ఆధారంగా మరొకరికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఎందుకంటే.. పెనమలూరులో 2009 ఎన్నికల్లో పిఆర్పీ అభ్యర్ధికి 30వేలకు పైగా ఓట్లు రాగా నాడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన కొలుసు పార్ధసారది కేవలం 117 ఓట్ల తో టీడీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు.

రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలో చేరిన కొలుసు పార్ధధి 2014 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. పెనమలూరులో 2014 లో టీడీపీ అభ్యర్ధి బోడె ప్రసాద్ 30వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో పార్ధసారది వైసీపీ తరపున పెనమలూరు నుండి పోటీ చేసి బొడే ప్రసాద్ పై కేవలం 11, 317 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్ధికి 15వేలకుపైగా ఓట్లు వచ్చాయి. ఈ సారి టీడీపీ – జనసేన కూటమి అభ్యర్ధి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుండి బలమైన అభ్యర్ధిని రంగంలో దింపే ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తొందన్న వార్తలు వినబడుతున్నాయి.

ఈ కారణంగానే సామాజిక సాధికార యాత్రలో పార్ధసారది కీలక వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. సీఎం జగన్ తనను గుర్తించలేదన్న బాధను వ్యక్తం చేశారు. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, తాను ఎమ్మెల్యేని కాదని సేవకుడిగా ఉంటానని అన్నారు. తాను ఎక్కడ ఉన్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని పార్ధసారధి చెప్పుకురావడం చూస్తుంటే ఎన్నికలకు దూరంగా ఉండటానికి సిద్దపడ్డారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Union Minister Mansukh Mandaviya: ఏపీలో వైద్య సేవలను ప్రశంసించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవియా

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

Krishna Mukunda Murari:కృష్ణ మురారి పూజ చేస్తూ ఉంటే ముకుంద మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతుంది. ముకుందకు ఏమైందో అని… Read More

May 13, 2024

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, దానిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) భాగస్వామిగా ఉంటుందని… Read More

May 13, 2024

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Avinash: జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ఒకప్పుడు ఓ రేంజ్ టిఆర్పి… Read More

May 12, 2024

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Singer Geetha Madhuri: ప్రజెంట్ జనరేషన్ లో టాలీవుడ్ కి చెందిన అనేకమంది కపుల్స్ విడాకులు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి… Read More

May 12, 2024

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Zara Hatke Zera Bachke OTT: జరా హట్ జార బచ్కే సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కోసం చాలామంది ప్రేక్షకులు… Read More

May 12, 2024

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

The Goat Life OTT: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం ది… Read More

May 12, 2024

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Vidya Vasula Aham OTT: ఆహా ఓటిటి లోకి నేరుగా మరో మూవీ రానుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండానే విద్య… Read More

May 12, 2024

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

AP Elections 2024: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభాల పర్వానికి నేతలు… Read More

May 12, 2024

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆదివారం పలు… Read More

May 12, 2024

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Aavesham OTT: మలయాళం సూపర్ స్టార్ ఫహిత్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. పుష్ప మూవీ తో… Read More

May 12, 2024

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Jyoti Roy: రెండు రోజుల కిందట జ్యోతి రాయ్‌ అనే నటి ఇంటిమేట్ వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. అనంతరం… Read More

May 12, 2024

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Pallavi Prashant: బిగ్బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకులలో విపరీతమైన సానుభూతులు కలిగించిన ఏకైక వ్యక్తి పల్లవి ప్రశాంత్.… Read More

May 12, 2024

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Getup Srinu: ప్రజెంట్ ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా నడుస్తుందో మనందరం చూస్తూనే ఉంటున్నాం. ఒకరిపై ఒకరు కాంట్రవర్షల్… Read More

May 12, 2024

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Amardeep: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావచ్చా అంటే.. నిర్మోహమాటంగా రావచ్చు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా ఎటువంటి బ్యాగ్రౌండ్… Read More

May 12, 2024