Intinti Gruhalakshmi: ఇంట్లో వాళ్ళందరూ కలిసి నవ్వుతూ ఇంట్లోకి అడుగు పెడుతుండగా ప్రేమ్ వచ్చి ఆగండి అని అంటాడు.. నేనొక్కడిని ఉన్నానని అందరూ మరిచిపోయినట్టున్నారు.. గుర్తు చేయమంటారా అని ప్రేమ్ అంటుండగా.. అభి ఇప్పుడు ఇవేమీ వద్దురా.. అందరం సంతోషంగా ఉన్నాం.. ఇప్పుడు ఇవేమీ వద్దు పదా అని కూల్ చేసి లోపలకు తీసుకువెళ్తాడంతో నేటి ఎపిసోడ్ మొదలవుతుంది..!
ఇంట్లో అభి వచ్చాడన్న సంతోషంలో అందరూ కలిసి డాన్స్ చేస్తూ సందడి చేస్తూ.. మాట్లాడుతుండటం చూస్తున్న లాస్యం ఉందో కోపంతో రగిలి పోతూ ఉంటారు. తులసిని ఇంట్లో వాళ్ళందరూ పొగుడుతూ ఉండగా.. దివ్య మీ గురించి పొగడటం మేము ఆపినా.. బయట నికున్న ఇమేజ్ కి మీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా ఉన్నారు ఆంటీ అని శృతి అంటుంది. నందు ముందే అందరూ తులసిని పొగడటం చూస్తున్న నందు ఇక ఆపుతారా అంటాడు..
వీళ్లంతా తులసి భజన భక్త బృందం బ్యాచ్ నందు అంటూ లాస్య ఆజ్యం పోస్తుంది. ఇప్పుడు వీళ్ళు అందరూ అన్న దాంట్లో తప్పేముందిరా అని నందుని వాళ్ళమ్మ నిలదీస్తుంది. ఊరికినే చేసిన ఈ పని గురించి కాదు ముందు పెద్ద గండం ఉంది దాని గురించి ఆలోచించండి. తులసి ఆ గండం క్లియర్ చేస్తే నేను కూడా తులసి భజన చేస్తాను. దేవతల నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాను. ఏం ప్రాబ్లం ఉంది అని ఇంట్లో వాళ్ళు అడగగా.. మీరు తులసిని భజన చేసే సంబరాల్లో మునిగిపోయారుగా.. మీకు ఆ ప్రాబ్లం ఎలా గుర్తుంటుంది. మరో రెండు రోజుల్లో శశికళ వచ్చి డబ్బులు తీర్చమని అడుగుతుంది. అప్పుడు గుర్తొస్తుంది మీకు అంటూ వెటకారంగా మాట్లాడుతాడు.
ఇప్పుడు తులసి ఆ డబ్బులు మొత్తం తీర్చేస్తే నేను కూడా దేవతలా చూస్తాను. తులసిని ఇప్పుడు అప్పు తీర్చమని చెప్పండి. లేకపోతే ఈమె ఫ్యాన్స్ ఉన్నారుగా.. వాళ్ళు కడతారేమో అడగండి అని అనడంతో.. లాస్య అందుకని ఏమో నందు కట్టిన కడతారేమో అంటూ.. తులసిపై మొగుడు పెళ్ళాలు ఇద్దరు విరుచుకుపడ్డారు. దాంతో కోపం వచ్చిన తులసి ఇందాక నుంచి మాట్లాడుతుంటే వింటూనే ఉన్నాను. సరే కోపం లో ఉన్నారు కదా.. రెండు మాటలు అనేసి ఊరుకుంటారులే.. అనుకుంటే మరి రెచ్చిపోతున్నారు శశికళ విషయంలో ఎవరి బాధ్యత వారిదే. ఎవరి వాటా వారిదే. 20 లక్షలు తీసుకువచ్చి ఇస్తాను. ఇందులో ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సహాయం ఆశించను. మీ సహాయం అసలు తీసుకోను. మీకు దమ్ముంటే మీ డబ్బులు మీరు తీసుకువచ్చి కట్టండి. అంతేకానీ నా మీద పడి ఏడవకండి అని నందు లాస్య లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తులసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
నన్ను దగ్గరకు వెళ్లి ప్రేమ్ అమ్మ ని ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు. విడాకులు ఇచ్చేసి మీరు పక్కకు వెళ్ళిపోయారు. ఇంకా మళ్లీ అమ్మను ఎందుకు టార్చర్ చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకుని అమ్మ ని టార్గెట్ చేసి తిడుతున్నారు . అమ్మ ఇంట్లో ఎవరిని వదిలేసి వెళ్ళిపో లేదు . అందరికీ తను అండగా నిలిచి ఉంటుంది. మీకు ఎందుకు అంత కోపం పౌరుషం.. మీ పని మీరు చేసుకొని పక్కకు పొమ్మని నందు కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు ప్రేమ్. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
This post was last modified on March 2, 2022 5:38 pm
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More