ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు…!

Published by
Siva Prasad

టిడిపి అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ నేతలను ఉద్దేశించి తాజాగా చేసిన హెచ్చరిక తెలుగు రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలక్షన్‌ మిషన్‌ 2019 విషయమై టిడిపి ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో గురువారం ఉదయం సిఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకమీదట ఆంధ్రప్రదేశ్ కు విచ్చేసే టిఆర్ఎస్ నేతల పర్యటనల్లో టిడిపి నేతలు పాల్గొనవద్దని హెచ్చరించారు. అలా ఆ పార్టీ నేతలతో పాటు ఎవరైనా పర్యటనల్లో పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

బంధుత్వాలు వంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి…స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. అంతే తప్ప బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టవద్దని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయవద్దని సూచించారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే అటువంటి చర్యలను సహించనని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. తెలంగాణా మాజీ మంత్రి, టిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆయన టిడిపి శ్రేణులకు ఈ వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

అయితే చంద్రబాబు చేసిన ఈ హెచ్చరికలపై రాజకీయ పరిశీలకులు, మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఈ విషయమై ఎందుకు ఇంతలా రియాక్ట్ అయారనేది ఆయా శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ హెచ్చరికలు చంద్రబాబుని కలవరపరుస్తున్నాయా? …కెసిఆర్ సూచనలతోనే తలసాని ఎపి పర్యటన, తదనంతర పరిణామాలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారా?…టిఆర్ఎస్ నేతలు ఎపిలో కుల రాజకీయాల వంటివి రెచ్చగొట్టి ఇక్కడ అలజడి సృష్టించే అవకాశం ఉందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారా?…అందుకే పార్టీ శ్రేణులకు ఆ స్థాయిలో వార్నింగ్ ఇచ్చారా?…అంటూ వివిధ కోణాల్లో చర్చించుకుంటున్నారు.

అయితే పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ప్రముఖంగా ఈ హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ఆ విషయానికి అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్లయిందని, అంతేకాకుండా ఎపిలో తమ ఉనికి చంద్రబాబులో ఆందోళన కలిగిస్తుందనే భావన టిఆర్ఎస్ నేతల్లో కలిగినట్లయితే వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అది కెసిఆర్ సూచనలకు అనుగుణంగానైనా జరగొచ్చు లేదా ఆయనను మెప్పించేందుకైనా తమంతట తాము అటువంటి చర్యలకి పాల్పడవచ్చని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు టిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఎపి సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఊహించిన విధంగానే ఆ పార్టీ నేతలు ఘాటుగా ప్రతిస్పందిస్తున్నారు. ఆ వ్యాఖ్యలు చేసేందుకు కారణంగా భావిస్తున్న టిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎపి సిఎం చంద్రబాబు హెచ్చరికలను ఉద్దేశించి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ…”ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి మాటలు విడ్డూరంగా ఉన్నాయి” అన్నారు. అలాగే చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్ అనేదే లేదని చెప్పారని, కానీ తమకు ఆయనలా కుట్ర, దొంగ రాజకీయాలు చేసే అలవాటు లేదని తలసాని చెప్పారు. ప్రస్తుతం భారత దేశంలోని రాజకీయ పరిణామాల దృష్ట్యా కేసీఆర్ ఈ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల సీఎంలను, రాజకీయ పార్టీల అధినేతలను కలవడం జరుగుతోందని చెప్పారు.

ఎపిలో సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని…అక్కడ అవినీతి బాగా పెరిగిపోయిందని, అంతా ప్రచార ఆర్భాటమే కనిపిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ తాను పర్యటిస్తానని తలసాని వెల్లడించారు. కులాల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబేనన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం, చిల్లర రాజకీయాలు చేయడం వంటి అలవాట్లుకు చంద్రబాబుకేనని తమకి లేవన్నారు. బంధుత్వాలు,స్నేహాల గురించి అలా మాట్లాడేందుకు చంద్రబాబుకు సిగ్గు లేదా?…అయినా చంద్రబాబుకు బంధువుల గురించి, బంధుత్వం గురించి, వ్యక్తుల గురించి ఎలా తెలుస్తుందని తలసాని ఎద్దేవా చేశారు. ఎపిలో చిల్లర రాజకీయాలు చేస్తే ఎవరూ ఏమీ అనరేమో కానీ, తెలంగాణాలో అలాంటి వ్యాఖ్యలకు జవాబులు చాలా సీరియస్‌గా ఉంటాయన్నారు.

రాబోయే 15,20 రోజుల్లో ఏపీకి కేసీఆర్ వస్తున్నారని…నీకు దమ్ముంటే…లేదా రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలనే ఆలోచన ఉంటే…కేసీఆర్ ఏపీకి వచ్చినప్పుడు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడాలని అన్నారు. అప్పుడు అభివృద్ధి ఎలా చేయాలో ఆయనే మీకు చెబుతారన్నారు. దీంతో ఒకవైపు టిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి చంద్రబాబు తమ పార్టీనేతలను హెచ్చరించడం…మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై తెరాస నేతలు ఘాటుగా ప్రతిస్పందించడాన్ని బట్టి ఒక రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి మరింత రాజుకోవడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి.

Siva Prasad

Share
Published by
Siva Prasad

Recent Posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More

May 10, 2024

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024