కేంద్రం చేతిలో ఏపి కౌన్సిల్ భవితవ్యం

Published by
sharma somaraju

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి భవితవ్యం కేంద్రం చేతికి వెళ్లడంతో అక్కడ నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మండలిని రద్దు తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. శాసనమండలి రద్దు సిఎం జగన్ అనుకున్నంత సులువు కాదని టిడిపి పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొంటున్నారు. ఇప్పటికే పది రాష్ట్రాలు శాసనమండలిలను పునరుద్ధరించాలని పంపిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వారు చెబుతున్నారు. వాటిపై ఇప్పటి వరకూ కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోనందున దీనిపైనా వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం లేదని వారు అంటున్నారు. అయితే బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు మాత్రం కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ బద్ధంగానే వ్యవహరిస్తుందనీ, రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదనీ అనడం గందరగోళానికి దారి తీసినట్లు అయ్యింది.
సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మండలి రద్దు చేయాలని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి రద్దు నిర్ణయాన్ని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టిడిపితో సహా బిజెపి, జనసేన తదితర రాజకీయ పక్షాలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. మండలి రద్దుపై తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపింది. ఇప్పుడు కేంద్రం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నది అనేది ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం ఒకే చెప్పి వెంటనే ఉభయసభల్లో బిల్లు ఆమోదింపజేసి రాష్ట్రపతి ద్వారా మండలి రద్దుకు ఉత్తర్వులు ఇస్తే ఇక్కడి వైసిపి ప్రభుత్వాన్ని కేంద్రంలోని బిజెపి అదుకున్నట్లు లెఖ్క. అయితే ఇక్కడి రాష్ట్ర బిజెపి నాయకత్వం వైసిపి ప్రభుత్వం చర్యను సమర్థించడం లేదు. మరో పక్క తెలుగుదేశం పార్టీ తమ ఎంపిల ద్వారా శాసనమండలి రద్దు కాకుండా కేంద్రంపై ఒత్తిడి చేయాలని చూస్తున్నది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు కౌన్సిల్ రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఈ తరుణంగా ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి మండలి రద్దుకు కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకుంటుందా? తీసుకుంటే…ఇప్పటేకే పెండింగ్‌లో ఉన్న పది రాష్ట్రాల శాసనమండలిల పునరుద్ధరణ ప్రతిపాదనలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి చేసే అవకాశం ఏర్పడుతోంది.

This post was last modified on January 30, 2020 12:23 pm

sharma somaraju

Recent Posts

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More

May 9, 2024

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More

May 9, 2024

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More

May 9, 2024

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌రియు… Read More

May 9, 2024

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More

May 9, 2024

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong Backing from Domestic Family Offices and UHNIs

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More

May 9, 2024

Millennials dominate 60% of Investor Base into Fractional Investments: Grip Invest Report

Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More

May 9, 2024