కెసిఆర్ పంచన సిపిఐ..తగదంటున్న కార్యకర్తలు!

Published by
Siva Prasad

హైదరాబాద్: హుజూర్ నగర్ ఉపఎన్నికలో అధికారపక్షమైన టిఆర్ఎస్ అభ్యర్ధిని బలపరచాలన్న సిపిఐ నిర్ణయం చాలామందికి మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం చెప్పి సిపిఐని దారికి తెచ్చుకున్నారోనని రాజకీయవర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. ఎమ్ఎల్‌సి సీటు ఒకటి కేటాయిస్తానని సిఎమ్ హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

ఎమ్ఎల్‌సి ఇస్తానన్నా, మరోటి ఇస్తానన్నా సిపిఐ లొంగాల్సింది కాదని వామపక్ష అభిమానులు అంటున్నారు. సిపిఐ నాయకులు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. హుజూర్ నగర్‌లో గెలవడం ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్‌కు చాలా  ముఖ్యం. పరిస్థితి తమకు అనుకూలంగా లేనందువల్లే ఆయన సిపిఐ ముఖం చూశారనీ, లేకపోతే ఆమడ దూరంలో ఉంచేవారనీ అంటున్నారు. క్రితం అసెంబ్లీలో సిపిఐకి ఉన్న ఒక్క సభ్యుడినీ టిఆర్ఎస్‌లో చేర్చుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆ చేదు అనుభవం  అప్పుడే మరిచిపోతే ఎలా అని సిపిఐ కార్యకర్తలే అంటున్నారు.

అవిభక్త కమ్యునిస్టు పార్టీగా సిపిఐకి ఆంధ్రప్రదేశ్‌లో ఉజ్వలమైన చరిత్ర ఉంది. 1962 ఎన్నికలలో సిపిఐ ఏకంగా 51 సీట్లు గెలుచుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మలుపు అయిన  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత చూస్తే 1985 ఎన్నికలలో 11 సీట్లు, 1994 ఎన్నికలలో 19 సీట్లు చేజిక్కించుకున్నది.

మధ్యలో 1999 మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో సిపిఐ సభ్యులు లేకపోవడం అన్నది ఎప్పుడూ లేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో సిపిఐ ఒక్క సీటు సాధించగలిగింది. ఆ ఒక్క సభ్యుడినీ కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ లాగేసుకుంది. 2018 ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మూడు సీట్లలో పోటీ చేసిన సిపిఐ ఘోర పరాజయం మూట కట్టుకున్నది. ఆ పార్టీకి 0.4 శాతం ఓట్లు వచ్చాయి. వేరే ఫ్రంట్‌లో భాగంగా పోటీ చేసిన సిపిఎమ్‌కు కూడా 0.4 శాతం ఓట్లే పోలయ్యాయి.

తొలుత నిజాం పాలనకూ, అనంతరం నెహ్రూ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా తెలంగాణ సాయుధపోరాటం నడిపి యావత్ దేశం దృష్టినీ ఆకర్షించిన కమ్యునిస్టుల ఘనత ఆ విధంగా గతకీర్తికి పరిమితమై పోయింది.

2014 ఎన్నికల తర్వాత సిపిఐ టిఆర్ఎస్ పాలనను విమర్శిస్తూ వచ్చింది. అనంతరం 2018 ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. తర్వాత తెలంగాణలో రాజకీయంగా ఏం మార్పు వచ్చిందని సిపిఐ విధానం మార్చుకుందో చెప్పాలన్న ప్రశ్న వినబడుతోంది. ఇంతకాలం టిఆర్ఎస్ అవలంబించిన ప్రజావ్యతిరేక విధానాలు అకస్మాత్తుగా మంచివయిపోయాయా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దివాలాకోరు విధానాల వల్లనే పెట్టని కోట వంటి తెలంగాణలో పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని వామపక్ష అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

This post was last modified on October 2, 2019 5:02 pm

Siva Prasad

Recent Posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More

May 10, 2024

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More

May 10, 2024

Balagam: ఘాటు అందాలతో బలగం బ్యూటీ.. ఇందువల్లే ఈమెకి అవకాశాలు రావడం లేదా..!

Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More

May 10, 2024

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: చత్తీస్‌గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More

May 10, 2024

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More

May 10, 2024

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More

May 10, 2024

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024