అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నా: రాపాక

Published by
Mahesh

అమరావతి: మూడు రాజధానులపై ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసినా..ఎమ్మెల్యే రాపాక పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని అసెంబ్లీ వేదికగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు అంశాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక ప్రసంగించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. విశాఖపట్టణం ఎగ్జిక్యూటీవ్ రాజధాని అయితే వలసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఒకేచోట జరగడం సమంజసం కాదని, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రతీ దాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించడం భావ్యం కాదన్నారు.

మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ప్రజాభిప్రాయం సేకరించాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాపాక ప్రస్తావించారు. రామానాయుడు చెప్పినట్టుగా ప్రజాభిప్రాయం సేకరిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. మూడు రాజధానులకు ఎవరూ వ్యతిరేకంగా లేరని, అందరూ అనుకూలంగానే ఉన్నారని అభిప్రాయపడ్డారు. ప్రజల అభిప్రాయమే తమ అభిప్రాయమని, యావత్తు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. మూడు రాజధానులు వద్దని ప్రతిపక్షంలో ఉన్న రామానాయుడు మాట్లాడాలి కనుక మాట్లాడుతున్నారే తప్ప, నిజంగా అయితే ఆయనకు కూడా ఇష్టమేనని చెప్పారు. సీఆర్డీఏ బిల్లు రద్దుకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నానని, యువ ముఖ్యమంత్రి జగన్ ని అభినందిస్తున్నానని ఎమ్మెల్యే రాపాక చెప్పుకొచ్చారు.

మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పవన్ చెప్పినా.. రాపాక పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే రాపాకపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా రాపాక వరప్రసాద్ సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన వ్యవహరం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార వైసీపీ నిర్ణయాలకు మద్దతు ఇస్తూ ఆపార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు కూడా రాపాక మద్దతు ఇచ్చారు. రాజధానిపై పవన్ నిర్ణయంతో తనకు సంబంధం లేదని.. ఆయన ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పవన్ కూడా మూడు రాజధానుల్ని వ్యతిరేకించడం లేదని.. పార్టీ అధినేతగా నిర్ణయం ఆయనదేనని.. తనకు పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యం చెప్పారు. అమరావతి భూములు లాక్కున్నప్పుడు పవన్ ఆందోళన చేశారని గుర్తు చేశారు.

రాపాక వ్యవహార శైలిపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతుంటే.. రాపాక మాత్రం అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో కొనసాగుతూనే.. ఇలా జగన్ సర్కార్ నిర్ణయాలకు మద్దతు పలకడం వారికి ఇబ్బందిగా మారింది. రాజధాని సహా పలు అంశాలపై జగన్ ప్రభుత్వాన్ని జనసేన అధినేత విమర్శలు గుప్పిస్తుంటే.. రాపాక మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాపాక వ్యవహారంపై జనసేన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

This post was last modified on January 20, 2020 5:57 pm

Mahesh

Recent Posts

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More

May 9, 2024

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More

May 9, 2024

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More

May 9, 2024

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌రియు… Read More

May 9, 2024

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More

May 9, 2024