శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించరట!

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలనే అంశాన్ని సుప్రీం కోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన వేళ… అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రక్షణ కల్పించలేమని కేరళ మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం శాంతియుత వాతావరణ కోసమే కృషి చేస్తుందని, అందువల్ల ప్రస్తుతానికి దేవాలయం వద్ద పోలీసులను మోహరించకూడదని నిర్ణయించామని చెప్పారు.

ఈ నెల 16న అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకుంటానని చెప్పిన మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్‌ని సున్నితంగా హెచ్చరించారు మంత్రి సురేంద్రన్. ‘మీ బల ప్రదర్శనకు శబరిమల లాంటి పుణ్య క్షేత్రాన్ని వేదికగా ఎంచుకోవద్దు. శబరిమల అయ్యప్ప దర్శనానికి రావద్దు, ఒకవేళ రావాలని నిర్ణయించుకుని.. పోలీస్ భద్రత కావాలనుకుంటే సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి’ అని మంత్రి సురేంద్రన్ వ్యాఖ్యానించారు. శనివారం నుంచి శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మండల పూజలు ప్రారంభించేందుకు ఆలయం తలుపులు తెరుస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు నవంబర్ 16న శబరిమల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తామని మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ ప్రకటించారు. తనతో పాటు మరికొందరిని తీసుకు వెళ్తానని తెలిపారు. శబరిమల వెళ్లి పూజలు చేసేందుకు మహిళలకు ప్రవేశం ఉందని, ఇందుకు వ్యతిరేకంగా ఎవరూ నిరసనలు చేయకూడదని పేర్కొన్నారు. శబరిమల కేసు తీర్పు విషయంలో ధర్మాసనం జాప్యం చేయకూడదని సాధ్యమైనంత త్వరగా తుది తీర్పు వెలువరించాలని కోరారు. గత ఏడాది అయ్యప్ప దర్శనానికి యత్నించిన తృప్తి దేశాయ్‌.. తిరువనంతపురం ఎయిర్ పోర్టు నుంచే వెనక్కి వెళ్లింది. ఆమెను శబరిమలకు తీసుకెళ్లేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. తృప్తి దేశాయ్ కి వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు నినాదాలు చేయడంతో ఆమె వెనుదిరిగింది.

ఇక, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గతేడాది ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్లపై గురువారం(నవంబర్ 14) సుప్రీంకోర్టు తీర్పు.. ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని మెజార్టీ న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవడంతో ఈ తీర్పు ఇచ్చింది. సమీక్ష పిటిషన్లన్నీ సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉంచింది. గతంలో ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు చంద్రచూడ్, జస్టిస్ నారిమన్ వ్యతిరేకించారు.

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం పాటించాలన్నది ఆలయ సంప్రదాయం. కానీ దీనిపై కొందరు మహిళలు ఇది లింగ వివక్ష అంటూ, తమ ప్రాథమిక హక్కుకు భంగం కలుగుతోందంటూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత 2018 సెప్టెంబరు 28న నిషేధం ఎత్తేయాలంటూ తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అనంతరం ఈ ఏడాది జనవరిలో కొంత మంది మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. అయితే దీనిపై అప్పట్లోనే రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సుప్రీం ధర్మాసనం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం పరిశీస్తుందని గురువారం తీర్పు వెల్లడించింది.

ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన అంశాన్ని నిశితింగా పరిశీలిస్తున్నామని కేరళ సీఎం పినరాయి విజయన్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై మరింత స్పష్టత కావాలంటున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల విషయంలో ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే మహిళల ఆలయ ప్రవేశంపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోర్టు ఉత్తర్వులు ఏవైనా సరే అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు.

This post was last modified on November 16, 2019 10:32 am

Mahesh

Recent Posts

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More

May 10, 2024

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More

May 10, 2024

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More

May 10, 2024

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ

AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More

May 10, 2024

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024