‘మళ్లీ దాడి చేస్తే చూస్తూ ఊరుకోం’

Published by
Mahesh

కాకినాడ: వైసీపీ నేతల భాష దారుణంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో ఇటీవల వైసీపీ దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను మంగళవారం పవన్ పరామర్శించారు. అనంతరం హెలికాన్ టైమ్స్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడులను పవన్ కల్యాణ్ ఖండించారు. తమ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకున్నా దూషించారని అన్నారు. కారణం లేకుండా తమపై దాడికి పాల్పడితే పోలీసులు చోద్యం చూడటం బాధ కలిగించిందన్నారు. నిరసనలు తెలిపే హక్క తమకు ఉందన్నారు. ఘటనకు బాధ్యుడిగా కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకొస్తామంటే ప్రజలు సహించరని చెప్పారు. మమ్మల్ని తిట్టి, మమ్మల్నికొట్టి తిరిగి తమపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.” పచ్చి బూతులు తిట్టి కారణం లేకుండా దాడులు చేస్తారా? 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరేమైనా దిగొచ్చారా ?” అని ధ్వజమెత్తారు.

తాము శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే ‘మీరెవరూ ఉండలేరు’ అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. ఇంకోసారి జనసేన కార్యకర్తలపై ఇలాంటి దాడులు జరిగితే తాము చేతులు కట్టుకొని కూర్చోబోమని వార్నింగ్ ఇచ్చారు. తాము తెగించి రోడ్లపైకి వస్తే ఏమీ చేయలేరని పవన్‌ వ్యాఖ్యానించారు. తమకు రోడ్లపైకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదన్నారు. తాము చాలా బాధ్యతగా రాజకీయాలు చేస్తున్నామని చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న తమపై ఇలాంటి దాడులు సబబు కాదని, బాధ్యత గల వ్యక్తులం కనుక ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నామన్నారు. కేసులు పెడతామంటే జనసేన ఎప్పుడూ భయపడదని చెప్పారు. తెగించే రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. వైసీపీ నేతలు ఇదే పంథా కొనసాగిస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అధికారం ఎల్లవేళలా ఉండదనే విషయాన్ని వాళ్లు గుర్తు పెట్టుకోవాలని పవన్ హితవు పలికారు. పండుగ సమయంలో ఇలాంటి ఘటనలు బాధాకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కావాలనే లేనిపోని గొడవలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సంఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేయాలని పవన్ డిమాండ్ చేశారు. జనసేనికులపై దాడి విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి దాడులు చేసినవారిపై కేసులు పెట్టాలని, అన్యాయాలకు పోలీసులు గొడుగు పట్టొద్దని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరిగితే పోలీసులదే బాధ్యతని పవన్ పేర్కొన్నారు.

This post was last modified on January 14, 2020 6:08 pm

Mahesh

Share
Published by
Mahesh

Recent Posts

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

Nuvvu Nenu Prema:విక్కీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడడంతో, ఆకలితో ఉన్న ఫ్యామిలీకి అను పద్మావతి ఇద్దరూ, గుడిలో… Read More

May 16, 2024

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More

May 15, 2024

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More

May 15, 2024

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More

May 15, 2024

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More

May 15, 2024

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More

May 15, 2024

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More

May 15, 2024

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More

May 15, 2024

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More

May 15, 2024

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More

May 15, 2024

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More

May 15, 2024

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More

May 15, 2024

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్… Read More

May 15, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావ్ మనందరికీ సుపరిచితమే. ఈయన… Read More

May 15, 2024