పోలవరంపై కేంద్రం ఏం చేస్తుందో!?

Published by
sharma somaraju

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో గత టిడిపి ప్రభుత్వ హయాంలో అంచనాలు పెంచి వారికి అనుకూలమైన వారికి దోచి పెట్టారని ఆరోపిస్తూ వచ్చిన వైసిపి ప్రభుత్వం అందుకు ఆధారాలు చూపే క్రమంలో తొలి విజయం సాధించింది. అయితే గత తెలుగుదేశం  ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమే వైసిపి నేతలు మేఘా ఇంజరింగ్ కంపెనీపై ఒత్తడికి తీసుకువచ్చి లెస్ టెండరింగ్ వేయించారనీ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆ కంపెనీకి వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్‌తో పాటు వాటర్ గ్రిడ్ పనులు కూడా అప్పగించేందుకు పథక రచన చేశారనీ టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల నాసిరకం పనులతో ఈ భారీ ప్రాజెక్టు భద్రతకు ముప్పు ఏర్పడితే ఉభయ గోదావరి జిల్లాలూ ప్రమాదానికి గురయ్యే అవకాశముందని వారు అంటున్నారు.

పోలవరం జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి కాంట్రాక్టు రద్దును సవాలు చేస్తున్న పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. పనుల రద్దుపై నవయుగ  కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం హైకోర్టు డివిజన్ ‌బెంచ్‌కి అప్పీల్ చేయడంతో అక్కడ వాదనలు జరుగుతున్నాయి.

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, పోలవరం ప్రాజెక్టు అధారిటీ కూడా పోలవరంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లవదని సూచించినా వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకే రివర్స్ టెండరింగ్‌ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లింది.

పోలవరం హెడ్ వాటర్ వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం పనులకు మేఘా సంస్థ 12.6 శాతం తక్కువకు బిడ్ కోట్ చేసి  ఎల్ 1 గా నిలిచింది. ఈ పనులకు 4,987 కోట్ల రూపాయలు ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువగా ప్రభుత్వం నిర్ణయించగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ 4,358కోట్ల రూపాయలకు పనులు పూర్తి చేస్తామని ముందు వచ్చింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు 629 కోట్ల రూపాయలు ఆదా అవుతోందని వైసిపి ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. ఇదే విధంగా పోలవరం 65వ ప్యాకెజీ పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్ టెండరింగ్ ‌వల్ల 58.53 కోట్ల రూపాయలు ఖజానాకు అదా అవుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. ఈ నిర్ణయాల కారణం కారణంగా ప్రభుత్వానికి దాదాపు 750 కోట్ల రూపాయల ఆదా అవుతున్నదని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ పేర్కొంటున్నారు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే రివర్స్ టెండరింగ్ నిర్వహించాలంటే కనీసం రెండు కంపెనీలైనా బిడ్‌లు దాఖలు చేసి ఉండాలి. ఈ విషయం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జివో నెం.67లో పేర్కొన్నది. ప్రభుత్వానికి మేలు జరుగుతున్నందున   మేఘా సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసినప్పటికీ నిబంధనలు సడలించి పనులు అప్పగించవచ్చని పోలవరం ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. మేఘా సంస్థకు పనులు కేటాయించవచ్చని పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరింగ్ ఇప్పటికే జలవనరుల శాఖకు సిఫార్సు చేశారు. అయితే కోర్టు తీర్పు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను కేంద్రమే చేపట్టి పూర్తి చేయాలని రాష్ట బిజెపి నేతలు మరో పక్క డిమాండ్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్‌పై ప్రధాన ప్రతిపక్ష నేతల ఆరోపణలు, బిజెపి నేతల డిమాండ్‌ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి  చూడాల్సి ఉంది.

 

 

 

 

 

This post was last modified on September 24, 2019 12:32 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More

May 9, 2024

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More

May 9, 2024

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More

May 9, 2024

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌రియు… Read More

May 9, 2024

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More

May 9, 2024

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong Backing from Domestic Family Offices and UHNIs

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More

May 9, 2024

Millennials dominate 60% of Investor Base into Fractional Investments: Grip Invest Report

Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More

May 9, 2024

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More

May 9, 2024

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More

May 9, 2024