Chandrababu Arrest: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు .. తీర్పు రేపటికి వాయిదా

Published by
sharma somaraju

Chandrababu Arrest: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ను కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఉదయం తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు. దీంతో తీర్పుపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును అయిదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ తరపున అదనపు అడ్వొకేటే జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తరపున సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్ధ్ అగర్వాల్ లు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల మధ్య వాదనలు వాడివేడిగా జరిగాయి.

chandrababu

చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాల్సి ఉందనీ, కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం ముఖ్యమని ఏఏసీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబును మరో సారి విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో రూ.371 కోట్ల దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయనీ, నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉందనీ, కేసులో ఇంకా పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని అన్నారు. సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందన్న భయంతోనే కస్టడీ అడ్డుకుంటున్నారంటూ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, సిద్దార్ద్ అగర్వాల్ లు వాదనలు వినిపించారు. చంద్రబాబును కోర్టులో హజరుపర్చిన సెప్టెంబర్ 10న సీఐడీ కస్టడీ కోరలేదని, మరుసటి రోజు సెప్టెంబర్ 11న కస్టడీ కోరుతూ మెమో ఎలా దాఖలు చేస్తారని కోర్టు దృష్టికి తెచ్చారు. 24 గంటల్లో దర్యాప్తు అధికారి నిర్ణయం మార్చుకున్నారని తెలిపారు. పాత అంశాలతో కస్టడీకి ఎలా కోరతారని ప్రశ్నించారు. అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్దంగా జరిగిందన్నారు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవనీ..నాలుగేళ్లుగా ఎవరిని అరెస్టు చేసినా నిధుల దుర్వినియోగం పేరు చెబుతున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబును అరెస్టు చేసి విచారణ పేరుతో సీఐడీ ఆఫీసులో ఉంచారని, కొన్ని గంటల పాటు చంద్రబాబును విచారించారన్నారు. ఆయన నుండి అన్ని విషయాలు రాబట్టామని చెప్పి మళ్లీ కస్టడీకి ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. దర్యాప్తు విషయాలపై సీఐడీ మీడియా సమావేశాలు ఎలా పెడుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రతోనే జరిగిందని, విచారణలో కొత్త కోణం కోర్టు ముందు పెట్టలేకపోయారనీ చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు.

YS Viveka Case: వివేకా కేసులో వైఎస్ భాస్కరరెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More

May 10, 2024

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024