YV Subba Reddy TTD: అయిష్టంగా పదవి చేపట్టినా టీటీడీ చైర్మన్ పదవికే వన్నె తెచ్చిన వైవీ సుబ్బారెడ్డి.. టీటీడీలో అనేక సంస్కరణలు..ఉమ్మడి ప్రకాశం నేతల్లో భావోద్వేగం

Published by
sharma somaraju

YV Subba Reddy TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా రెండు పర్యాయాలు అంటే దాదాపు నాలుగేళ్ల పాటు సేవలు అందించిన సీనియర్ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం 8వ తేదీ (మంగళవారం) తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో సోమవారం వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన చివరి పాలకవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి స్థానంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని తాజాగా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జన్మించిన వైవీ సుబ్బారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు విద్యుత్ ఉత్పత్తి రంగ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలతో వ్యాపార వేత్తగా ఉండేవారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి  వైవీ సుబ్బారెడ్డి తోడల్లుడు. వైఎస్ఆర్ మరణానంతరం ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో క్రియాశీల భూమికను పోషించిన వైవీ సుబ్బారెడ్డి .. 2014 ఎన్నికల్లో ఒంగోలు నుండి వైసీపీ తరపున లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, జగన్మోహనరెడ్డి పాదయాత్రలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ పై పార్టీ నిర్ణయం మేరకు లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

YV Subba Reddy: Great Achievements of YV Subba Reddy as TTD Chairman

2019 ఎన్నికల్లోనూ ఒంగోలు పార్లమెంట్ కు పోటీ చేయాలని భావించినప్పటికీ టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం తన సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ కు వెళ్లాలని భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో జగన్మోహనరెడ్డి .. వైవీకి అవకాశం కల్పించలేదు. ఆ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించారు సీఎం వైఎస్ జగన్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకు అంటూ ప్రత్యేకంగా అనుచరగణం, అభిమానులు ఉండటంతో ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగాలని వైవీ భావించారు. అయితే దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన టీటీడీకి సమర్ధవంతమైన నాయకుడు చైర్మన్ గా ఉంటేనే ప్రభుత్వానికి చెడు పేరు రాకుండా ఉంటుందని, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా ఉంటుందని భావించి సీఎం జగన్ .. వైవీ సుబ్బారెడ్డిని ఒత్తిడి చేసి ఒప్పించారు. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా నియమితులైన వెంటనే సీఎం జగన్ కు దగ్గర బంధువు కావడంతో .. వైవీ సుబ్బారెడ్డి కూడా క్రైస్తవుడు అని, క్రైస్తవుడికి హిందూ దేవాలయ చైర్మన్ పదవి ఇవ్వడం ఏమిటంటూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి వైవీ సుబ్బారెడ్డి కుటుంబ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరస్వామి. వైవీ కుటుంబం మొదటి నుండి హిందువుగా  దైవారాధన చేస్తుండేవారు. అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్రకు వెళ్లి వస్తుండే వారు. తనపై జరుగుతున్నది అంతా అసభ్య ప్రచారమనీ, తాను హిందువునేనని నాడు వైవీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

YV Subba Reddy: Out going TTD Chairman YV Subba Reddy’s great administration during his tenure

టీటీడీ చైర్మన్ గా విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పని చేశారు. దివాలా అంచున ఉన్న ప్రైవేటు బ్యాంకుల్లోని స్వామి వారి డిపాజిట్ల ను సరైన సమయంలో వెనక్కుతీసుకువచ్చి స్వామి వారి ఆస్తులను కాపాడారు. సాధారణ భక్తులు ఇబ్బందులు పడకుండా మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. రాజకీయ పరంగా వచ్చే విమర్శలను పట్టించుకోకుండా తన దైన ఫందాలో ముందుకు వెళ్లారు. టీటీడీలో ఎటువంటి వివాదాలు లేకుండా సక్రమంగా పరిపాలన సాగిపోతుండటంతో సీఎం జగన్ రెండో దఫా కూడా అవకాశం కల్పించారు. వైవీ తన హయాంలో ఒకే సారి కొండపై ఉన్న వసతి గృహాలను ఆధునీకరించడంతో పాటు అత్యాధునిక వసతి భవనాల నిర్మాణాలను ప్రారంభించడం ద్వారా భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించారు.

YV Subba Reddy: Out going TTD Chairman YV Subba Reddy’s great administration during his tenure

కాలినడక వచ్చే వారి సౌకర్యార్ధం మెట్ల మార్గాన్ని పూర్తిగా ఆధూకరించారు. స్వామివారి ఆర్జిత సేవల్లో దళారుల ప్రమేయాన్ని తగ్గించారు. తిరుమల కొండని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చారు. భక్తుల కోసం ఎలక్టిక్ బస్సులను ఏర్పాటు చేశారు. టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి తన దైన ముద్ర చూపించారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాకపోతే పబ్లిసిటీ మీద అంత ఇంట్రెస్ట్ చూపని వైవీ తన హయాంలో జరిగిన వాటిపై అంతగా ప్రచారం చేసుకోలేదు. అయిష్టంగానే చైర్మన్ పదవి చేపట్టినా వైవీ సుబ్బారెడ్డి పదవికే వన్నె తెచ్చారని అంటుంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కలగదు. అటువంటిది వైవీ సుబ్బారెడ్డికి రెండు టర్మ్ లు సేవ చేసుకునే భాగ్యం కల్గింది. ఇది నిజంగా శ్రీవారి కృపాకటాక్షమే అనుకోవాల్సి ఉంటుంది. అయితే తమ ప్రాంతానికి చెందిన నాయకుడు ఈ రోజు టీటీడీ చైర్మన్ పదవి నుండి దిగిపోతున్నాడని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆయన వర్గీయులు, అభిమానులు భావోద్వేగానికి గురి అవుతున్నారు.

This post was last modified on August 8, 2023 6:53 am

sharma somaraju

Recent Posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Aavesham OTT: మలయాళం సూపర్ స్టార్ ఫహిత్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. పుష్ప మూవీ తో… Read More

May 12, 2024

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Jyoti Roy: రెండు రోజుల కిందట జ్యోతి రాయ్‌ అనే నటి ఇంటిమేట్ వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. అనంతరం… Read More

May 12, 2024

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Pallavi Prashant: బిగ్బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకులలో విపరీతమైన సానుభూతులు కలిగించిన ఏకైక వ్యక్తి పల్లవి ప్రశాంత్.… Read More

May 12, 2024

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Getup Srinu: ప్రజెంట్ ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా నడుస్తుందో మనందరం చూస్తూనే ఉంటున్నాం. ఒకరిపై ఒకరు కాంట్రవర్షల్… Read More

May 12, 2024

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Amardeep: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావచ్చా అంటే.. నిర్మోహమాటంగా రావచ్చు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా ఎటువంటి బ్యాగ్రౌండ్… Read More

May 12, 2024

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Deepti Sunaina: ప్రస్తుత కాలంలోతమ టాలెంట్ను యూట్యూబ్లో ప్రదర్శిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ప్రజెంట్ జనరేషన్ లో వెండితెర బుల్లితెర… Read More

May 12, 2024

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి… Read More

May 12, 2024

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జ‌ట్టుకు ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా… Read More

May 12, 2024

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్ లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్ర… Read More

May 12, 2024

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

Ravi Teja: చిత్ర పరిశ్రమలో కథలు ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఒక హీరో… Read More

May 12, 2024

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Big Breaking: ప్రస్తుత కాలంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక ఇటువంటివి సాధారణమైన మనుషులకి… Read More

May 12, 2024

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

Kona Venkat: బాపట్ల జిల్లాలో సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పై కేసు నమోదైంది. దళిత యువకుడిపై దాడి… Read More

May 12, 2024

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

Kriti Sanon: టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో కృతి స‌న‌న్… Read More

May 12, 2024

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులతో కలిసి ఫుట్… Read More

May 12, 2024

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More

May 12, 2024