Justice NV Ramana: సంచలనాలకు శ్రీకారం చుడుతున్న జస్టిస్ రమణ..!!

Published by
Srinivas Manem

Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టి తరువాత న్యాయ వ్యవస్థలో సరికొత్త సంస్కరణలు వచ్చేస్తున్నాయి. ఆ దిశగా జస్టిస్ రమణ కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ప్రదానంగా దేశ వ్యవస్థలో మార్పులు జరగాలన్నా, కొత్త చట్టాలను తీసుకురావాలన్నా, పాత చట్టాలను సవరించాలన్నా, వ్యవస్థల ప్రక్షాళన జరగాలన్నా అవి భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టుల వల్లనే సాధ్యమవుతుంది. ఆ విషయం మన అందరికీ తెలుసు. ప్రధాన మంత్రి విషయానికి వస్తే ఓ పక్క రాజకీయ ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం రెండు ఆలోచనలతో నిర్ణయాలను తీసుకుంటారు. ఇక రాష్ట్రపతి లోక్‌సభ, రాజ్యసభ తీర్మానాలకు అనుగుణంగా వెళుతుంటారు. ఈ రెండింటి నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసే విధంగా ఆదేశాలు ఇచ్చేది  న్యాయవ్యవస్థ. ఇటువంటి కీలక వ్యవస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఏపికి చెందిన జస్టిస్ రమణ చేపడుతున్న సంస్కరణలు భవిష్యత్తు తరాలకు శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Justice NV Ramana sensational decisions

Read More: Supreme Court: ఇకపై బెయిల్ మంజూరైన క్షణాల్లోనే రిలీజ్..! జస్టిస్ ఎన్‌వీ రమణ ‘ఫాస్టర్’..!!

అందులో ప్రధానంగా ఐటి యాక్ట్ 66 ఏ కేసులు, రాజద్రోహం కేసులు, బెయిల్ మంజూరైన ఖైదీల విడుదల అంశాలపై కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ మూడు నిర్ణయాలు దేశ దిశ మార్చబోతున్నాయి.  ఐటీ యాక్ట్ 66 ఏ కింద కేసుల నమోదు రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ 2015లోనే దాన్ని సుప్రీం కోర్టు దాన్ని రద్దు చేస్తే ఆ తరువాత కూడా కేసులు నమోదు చేస్తుండటంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ కావడంతో కేంద్ర హోంశాఖ ఆ సెక్షన్ కింద నమోదు అయిన కేసులు అన్నీ రద్దు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయవద్దని కూడా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది. ఆ తరువాత ఇటీవల రాజద్రోహం (సెక్షన్ 124(ఎ)) కేసుల నమోదుపైనా ఇటీవల జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వలస పాలన అవశేషమైన 124 ఏ సెక్షన్ రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడం ఏమిటని ప్రశ్నించారు. ఇక కోర్టు నుండి బెయిల్ మంజూరైన తరువాత అండర్ ట్రైల్ ఖైదీలు ఒక్క క్షణం కూడా జైలులో ఉండాల్సిన అవసరం లేదనీ, తక్షణం విడుదల చేసేలా ఫాస్టర్ వ్యవస్థను తీసుకువస్తున్నారు. బెయిల్ మంజూరు పత్రాలు అందలేదన్న సాగుతో జైలులో ఖైదీలు రోజుల తరబడి మగ్గిపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సూమోటోగా తీసుకుని విచారణ జరిపారు జస్టిస్ వెంకట రమణ.

తాజాగా కోర్టులో జరిగే అంశాలు పారదర్శకంగా ఉండాలన్న భావనతో సుప్రీం కోర్టులో జరిగే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకూ అది లేకపోవడంతో కోర్టులో జరిగిన అంశాలను వివిధ మీడియాలు వారికి ఇష్టాను సారంగా ప్రచురితం చేయడంతో ప్రజలు అయోమయానికి గురి అయ్యే పరిస్థితి ఉంది. సుప్రీం కోర్టులో విచారణలను ప్రత్యక్ష ప్రసారాలు చేయడం వల్ల ఎవరైనా వీక్షించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యక్ష ప్రసారాల వ్యవస్థ ఆగస్టు 15 నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీ తనానికి ఇది దోహదపడుతుంది.

Srinivas Manem

Recent Posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్… Read More

April 28, 2024

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More

April 28, 2024

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More

April 28, 2024

Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!

Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More

April 28, 2024

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More

April 28, 2024

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More

April 28, 2024

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More

April 28, 2024

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ… Read More

April 28, 2024

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈయన సినీ ప్రియులకి బాగా… Read More

April 28, 2024

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన… Read More

April 28, 2024

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

Samantha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నార కాలం… Read More

April 28, 2024

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

Baahubali 2: ప్రతి ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు థియేటర్స్ లోకి వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే… Read More

April 28, 2024

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

Tollywood Actress: పైన ఫోటోలో కరాటే చేస్తూ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఎవరు గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో స్టార్… Read More

April 28, 2024

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

Congress: ఎవరైనా ఒక నాయకుడు నేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటే .. సదరు నేత ఆ పార్టీలో చేరినట్లే… Read More

April 28, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఖ‌చ్చితంగా మ‌రో 15 రోజులు మాత్ర‌మే ప్ర‌చారా నికి స‌మ‌యం ఉంది.… Read More

April 28, 2024