Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈయన సినీ ప్రియులకి బాగా సుపరిచితం. అద్భుతమైన అందం మరియు అభినయంతో కూడిన యాక్టింగ్ కి ఎంతోమంది ఫాన్స్ సైతం ఉన్నారు. ఇక రాస్తారు 2013లో ఉయ్యాల జంపాల మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక మొట్టమొదటి సినిమా నే ఈయనకి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు హీరోగా అనేక సినిమాలు చేస్తూ తొలిసారి తన ప్రేమాయణం గురించి బయట పెట్టాడు రాజ్ తరుణ్. ముఖ్యంగా తనకు యాంకర్ లాస్యతో ఉన్న ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చాడు. మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి చిత్రం విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలవగా తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్నాడు రాజ్ తరుణ్.
ముఖ్యంగా సినిమా సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడోరకం ఆడోరకం, మజ్ను , నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, బెలూన్ వంటి అనేక చిత్రాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు రాజ్ తరుణ్. ఇక ఇవి మాత్రమే కాకుండా రంగులరాట్నం ఇలా అనేక సినిమాల్లో తన నటనను నిరూపించుకున్నాడు. ఇక తాజాగా నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా మూవీతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మూవీ మంచి సక్సెస్ అయింది కూడా. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం యంగ్ లుక్ తో అదరగొడుతున్నాడు.
ఇక 31 ఏళ్లు వయసు కలిగిన ఈయన మూడో సినిమా చేస్తున్న సమయంలోనే ఈ అమ్మాయి పై రూమర్లు మొదలు అయ్యాయి. ముఖ్యంగా ఈ కుర్రాడు ఓ తెలుగు యాంకర్ తో లవ్ ఎఫైర్ నడుపుతున్నాడని పెద్ద ఎత్తున టాప్ నడిచింది. ఒకరి కోసం ఒకరు చనిపోవాలని కూడా అనుకున్నట్లు అప్పట్లో గట్టిగానే పుకార్లు వినిపించాయి. ఇక తాజాగా వీటిపై రాజ్ తరుణ్ స్పందించాడు. అసలు తనకు యాంకర్ లాస్య అంటే ఎవరో కూడా తెలియదని.. కానీ తనకు ఆమెతో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చినప్పుడు చాలా నవ్వొచ్చేదని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. అదేవిధంగా ఆమెతో కలిసి తాను దిగిన ఫోటో చూసి ఆ థంబ్ నెయిన్స్ చూసి షాక్ అయ్యానని.. అసలు ఆ ఫోటో తాను ఆమెతో ఎప్పుడూ దిగాను కూడా తెలియదని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఆ ఫోటో ఎక్కడిది అని రీఛార్జ్ చేస్తుండగానే.. తాను కుమారి 21 ఎఫ్ సినిమా ఆడియో లాంచ్ రోజు దిగిన ఫోటో అని అర్థమయిందని చెప్పాడు. ఇక మధ్యలో ఇంకో వ్యక్తి ఉండగా ఆయనను కట్ చేసి ఇద్దరినీ క్లోజ్ లో పెట్టారని నిజాన్ని నిర్మొహమాటంగా బయట పెట్టాడు రాజ్ తరుణ్. లాస్య కనీసం తనకు పరిచయం కూడా లేదని.. ఆమె ఎవరు ఏంటనేది కూడా తనకు తెలియదని స్పష్టం చేశాడు. అటువంటిది ఇలాంటి వార్తలపై తాను ఎలా స్పందించాలో తెలియక ఊరుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అదేవిధంగా తనకు గతంలో ఓ బ్రేకప్ స్టోరీ కూడా ఉందని వెల్లడించాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం రాజ్ తరుణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.