సచివాలయ ఉద్యోగుల్లోనూ కలకలం

Published by
sharma somaraju

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: రాజధాని తరలింపు వ్యవహారం సచివాలయ ఉద్యోగుల్లోనూ తీవ్ర కలకలాన్ని రేపుతోంది. సిఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి అమరావతి ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా వందలాది మంది సచివాలయ ఉద్యోగులు కూడా మానసికంగా ఆందోళన చెందుతున్నారు. అమరావతి రైతులకంటే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉందని పలువురు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిఎం మూడు రాజదానుల ప్రకటనకు తగిన విధంగానే జిఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టర్ రిపోర్టులు రావడంతో విశాఖపట్నానికి సచివాలయం తరలింపు లాంఛనమే అని తేలిపోతున్నది. ఈ రెండు కమిటీల నివేదికలను అధ్యయనం చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ  కూడా జగన్మోహనరెడ్డి ఆలోచనకు తగిన విధంగానే నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నందున పలువురు ఉన్నతాధికారులు విశాఖలో పరిపాలనా భవనాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఇప్పటి నుండి పరిశీలన కూడా ప్రారంభించారు. హైపవర్ కమిటీ నివేదిక అందిన వెంటనే మంత్రివర్గంలో దాన్ని ఆమోదించి ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.

రాజధాని తరలింపుపై ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వార్తలు సచివాలయ ఉద్యోగులను కలవరపరుస్తున్నాయి. ఏపి సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వద్ద పలువురు ఉద్యోగులు తమ ఇబ్బందులను వివరించారు. రాజధాని తరలింపు అంశానికి సంబంధించి అసలేమి జరుగుతుందో తెలియజేయాలని వారు కోరగా ప్రభుత్వం నుండి ఎలాంటి సమాచారం లేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

‘అమరావతే రాజధాని అనుకొని ఊళ్లల్లో పొలాలు, ఇళ్లు అమ్మేసి రుణాలు తీసుకుని ప్లాట్‌లు కొనుగోలు చేసుకున్నాం, ఇప్పుడు వాటిని అద్దెకు ఎవరు తీసుకుంటారు ? నెలనెల వాయిదాలు ఎలా కట్టాలి? విశాఖ వెళ్లి అద్దెకు తీసుకోవాలంటే ఎంత చెల్లించాలి? అంత భరించగలమా? పిల్లల చదువులు ఎలా?’ అని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇప్పుడు విశాఖపట్నం అంటున్నారు. రాజధాని అక్కడే ఉంచేస్తారా? మళ్లీ అయిదేళ్ల తరువాత అమరావతి రావాలా? ఇంకోకాయన వచ్చి కర్నూలు అంటారు, మేం పోవాలా? రైతులైతే రోడ్డు మీద కూర్చుంటారు. మేము బయటకు వచ్చి గట్టిగా మాట్లాడలేం, లోలోపల ఏడుస్తున్నామనీ అంటున్నారు. ఇప్పటికిప్పుడు విశాఖ వెళ్లమంటే తాము వెళ్లే పరిస్థితిలో లేమని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎలాగూ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి విద్యాసంవత్సరం పూర్తి అయ్యే వరకూ సమయం కోరతామని పలువురు ఉద్యోగులు అంటున్నారు.

 

This post was last modified on January 8, 2020 4:47 pm

sharma somaraju

Recent Posts

Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

Election 2024: హింసాత్మక ఘటనల మధ్య తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం  6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ,… Read More

May 13, 2024

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Sridevi Drama Company: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలలో పామిడి తరహా ఎంటర్టైన్మెంట్… Read More

May 13, 2024

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Ashika Gopal: ప్రస్తుత కాలంలో ఇంస్టాగ్రామ్ స్రీల్స్ చేసేవాళ్లు యూట్యూబ్ వంటి ఇతర సోషల్ మీడియా ఎకౌంట్లో కూడా యాక్టివ్… Read More

May 13, 2024

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Janaki kalaganaledu: సీరియల్ యాక్టర్ విష్ణు ప్రియా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదటిగా సినిమాలతో తన కెరీర్… Read More

May 13, 2024

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Pavitra Jayaram: త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచమయ్యి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ దూసుకుపోతుంది.… Read More

May 13, 2024

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Trinayani: ప్రెసెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక మరణాన్ని జీర్ణించుకునే లోపే మరొక మరణంతో… Read More

May 13, 2024

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Sirisha: సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు మరియు రీల్స్ చేస్తూ ఎంతోమంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. వారిలో బర్రెలక్క… Read More

May 13, 2024

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Video Viral:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద… Read More

May 13, 2024

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభించారు అధికారులు.… Read More

May 13, 2024

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు క్యూ లైన్ లో… Read More

May 13, 2024

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

Supreme Court: లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం… Read More

May 13, 2024

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ ను కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు… Read More

May 13, 2024

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

Sreemukhi: టాలీవుడ్ లో ఉన్న ఫిమేల్ స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకటి. సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమం… Read More

May 13, 2024

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

Daggubati Lakshmi: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చందు… Read More

May 13, 2024

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పండుగకు కౌంట్ డౌన్ షురూ అయింది. గత రెండు నెలలుగా ఏపీ లో అన్ని రాజకీయ… Read More

May 13, 2024