ఆర్టీసీ సమ్మె.. రంగంలో దిగిన బీజేపీ!

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న వేళ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి లక్ష్మణ్ నివేదిక సమర్పించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులను లక్ష్మణ్ కలవనున్నారు. కేంద్రం ఆర్టీసీ సమ్మెపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోదని తెలుస్తోంది. కరీంగనర్ ఎంపీ బండి సంజయ్‌ విషయంలో పోలీసుల ఓవరాక్షన్‌పై బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా లక్ష్మణ్‌కు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.  ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసి… రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, తాజా పరిణామాలను వివరించబోతున్నారు లక్ష్మణ్. ముఖ్యంగా కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద ఓ పోలీసు అధికారి చేయిచేసుకున్న అంశాన్ని కేంద్ర పెద్దల ముందు పంచాయతీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల సందర్భంగా శుక్రవారం(నవంబర్ 1) కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల సందర్భంగా నిర్వహించిన శవయాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. అయితే ర్యాలీగా వెళ్తున్న నేతలను అడ్డుకున్న పోలీసులు పాడెను దారి మళ్లించారు. కుటుంబ సభ్యులను మాత్రమే స్మశాన వాటికలోకి అనుమతించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం,తోపులాట చోటు చేసుకున్నాయి. శవయాత్ర సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో రామగుండం కమిషనరేట్‌కి చెందిన ఏఆర్ డీఎస్పీ నాగయ్య తనపై చేయి చేసుకున్నారని ఎంపీ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. తనపై దాడికి సంబంధించి పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ సీపీ కార్యాలయం ముందు బైఠాయించారు. ఆ సమయంలో అక్కడి డీసీపీ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు సంజయ్ ఆరోపించారు. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించడంపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపడుతానని ఎంపీ బండి సంజయ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్రమంత్రులు అమిత్ షా,జేపీ నడ్డా,కిషన్ రెడ్డి దృష్టి సారించాలని కోరారు.

తెలంగాణలో మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి.. ఆర్టీసీ సమ్మె, శుక్రవారం(నవంబర్ 1) నాటి పరిణామాలు రాజకీయంగా కలిసొచ్చేలా ఉన్నాయి. మొన్నటి హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో… ఢిల్లీ హైకమాండ్… రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై సీరియస్‌గా ఉన్న సమయంలో… సమ్మె ద్వారా తిరిగి ప్రజా మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనికి కేంద్రం కూడా సపోర్టుగా నిలిస్తే… ఈ అంశాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, కేంద్ర పెద్దలు ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్నదాన్ని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

This post was last modified on November 2, 2019 5:03 pm

Mahesh

Recent Posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More

May 11, 2024

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More

May 10, 2024

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More

May 10, 2024

Balagam: ఘాటు అందాలతో బలగం బ్యూటీ.. ఇందువల్లే ఈమెకి అవకాశాలు రావడం లేదా..!

Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More

May 10, 2024

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: చత్తీస్‌గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More

May 10, 2024

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More

May 10, 2024

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More

May 10, 2024

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024