అమరావతిపై పట్టుపట్టనున్న బిజెపి

Published by
sharma somaraju

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.    సిఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి అమరావతి ప్రాంతంలో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతూ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల అంశంలో తొలుత బిజెపి నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసినప్పటికీ తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్నది తమ పార్టీ స్టాండ్‌గా పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగా అమరావతికి మద్దతుగా రాష్ట్ర బిజెపి నాయకత్వం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ దయోధర్ నాయకత్వంలో పార్టీ జాతీయ కౌన్సిల్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులు, మహిళలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.

ప్రధాని మోది స్వయంగా రాజధానికి శంకుస్థాపన చేయడం, కేంద్రం ఇప్పటి వరకూ 2500 కోట్ల రూపాయలు ఇవ్వడం, రింగ్ రోడ్డు, ఎక్స్‌ప్రెస్ హైవేలకు ఆర్థిక సహాయం, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు ముందుకు రావడం, హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం ఇలా ఇన్ని జరిగిన తరువాత రాజధాని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోవడం సరైంది కాదనీ బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

మరో పక్క అఖిల భారత హిందూ మహసభ కూడా జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్నది. హైందవ ప్రాశస్త్యం కలిగిన నగరాలను అణగదొక్కాలని జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు  చక్రపాణి మహారాజ్ ఆరోపించారు. అయోధ్య నుండి 20 వేల మంది హిందువులతో అమరావతి పర్యటనకు వస్తాననీ కూడా ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని  వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో 20 వేల మందితో ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర ఇన్‌చార్జి, ప్రముఖ న్యాయవాది జంద్యాల రవిశంకర్ తెలియజేశారు.

జగన్మోహనరెడ్డి ఆలోచనా విధానాలకు అనుగుణంగానే జిఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదకలు ప్రభుత్వానికి అందిన విషయం తెలిసిందే. ఈ రెండు నివేదికలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. దానిపై మంత్రివర్గంలో చర్చించి మూడు రాజధానులపై అధికారిక ప్రకటన వెల్లడించనున్నారు.

This post was last modified on January 6, 2020 12:22 pm

sharma somaraju

Recent Posts

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More

May 11, 2024

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More

May 11, 2024

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More

May 11, 2024

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More

May 10, 2024

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More

May 10, 2024

Balagam: ఘాటు అందాలతో బలగం బ్యూటీ.. ఇందువల్లే ఈమెకి అవకాశాలు రావడం లేదా..!

Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More

May 10, 2024

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: చత్తీస్‌గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More

May 10, 2024

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More

May 10, 2024

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More

May 10, 2024

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024