ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర పెద్దలతో జగన్ టచ్ లోనే ఉన్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఆగస్టులో టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఇదే అభిప్రాయాన్ని చేశారు. ఏపీకి నాలుగు రాజధానులు రాబోతున్నాయని, అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని, ప్రత్యామ్నాయ రాజధానులపై ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డి బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని చెప్పారు. టీజీ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా సంచలనం అయ్యింది. తాజాగా సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందంటూ లీక్ చేయడం చూస్తే.. కేంద్రంలోని బీజేపీ పెద్దలకి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఏపీలో భవిష్యత్ ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి నివేదించిన మాట వాస్తమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.
జగన్ గతంలో ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రధాని మోదీ, అమిత్ షాలతో రాజధాని అంశంపై చర్చించినట్లు సమాచారం. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన సమయంలోనూ హోం మంత్రి అమిత్ షాతో ఇదే విషయంపై మరోసారి చర్చించాలని భావించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, అమిత్ షా అపాయింట్మెంట్ దొరక్కపోవడం, వ్యక్తిగత కారణాలతో జగన్ తన పర్యటను రద్దు చేసుకుని తిరిగి వచ్చేయడంతో ఈ అంశం తెరపైకి రాలేదని తెలుస్తోంది. రాజధానిపై పక్క ప్రణాళికతో ముందుకు సాగాలని సీఎం జగన్ నిర్ణయించారు. అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరమని అంటున్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయొచ్చేమో అని జగన్ సూచనప్రాయంగా తెలిపారు.
అయితే, ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ఎలా సహకరిస్తుంది ? నిధులు ఇస్తారా లేదా ? అన్నది ఉత్కంఠగా మారింది. గత బడ్జెట్ లో అమరావతికి కేటాయింపులు చేయలేదు. విభజన కష్టాలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ఎప్పటిలాగానే ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూసింది. కానీ మోదీ సర్కార్.. రాజధాని అమరావతి నిర్మాణం, ఆర్థిక సంఘం నిధులు, ద్రవ్యలోటు నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, కేంద్ర పథకాల నిధుల కేటాయింపులో కాస్త ఎక్కువ మొగ్గు చూపాలని కోరినా కేంద్రం కనికరించలేదు. ఈ నేపథ్యంలో జగన్ తాజాగా చేసిన మూడు రాజధానుల ప్రకటనపై కేంద్రం ఎలాంటి వైఖరి అనుసరిస్తుంది ? వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర సహకారం ఉంటుందా ? అన్నది చూడాలి.
This post was last modified on December 18, 2019 3:42 pm
Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More
AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More
Family Star OTT Response: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More
Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More
Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్… Read More
Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్… Read More
Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More
Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More
Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More
Himaja: బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు… Read More