రాయలసీమ ఏం పాపం చేసుకున్నది!?

Published by
sharma somaraju

చాలా మంది దృష్టిలో రాయలసీమ నీటి సమస్యకు కారణం నీటి కొరత, కృష్ణలో తగ్గిన నీటి లభ్యత అని చెబుతారు. మొదటి నుంచి రాయలసీమ ఉద్యమం మాత్రం సీమలో నీటి నిల్వ ప్రాజెక్టుల నిర్మాణం చేయకపోవడం, నిర్మించిన ప్రాజెక్టులు కూడా సీమకు ఉపయోగపడని రీతిలో ఉండటం. రాయలసీమ ఉద్యమం మాట వినని పాలకులు ప్రకృతి చెప్పిన నిజాలను చూడటం కనీస ధర్మం.

అనేక సంవత్సరాల లెక్కలను పరిగణనలోకి తీసుకొని చూస్తే సీమ నుండి వందల టిఎంసిల నీరు క్రిందకు వెళుతుంది. కృష్ణలో నీరు తగ్గిన సమయంలో కూడా తుంగభద్ర , కుందు ఉపనదులు పుష్కలంగా నీటిని తీసుకు వస్తున్నాయి. నేడు నెల్లూరు జిల్లాలోని సోమశిలకు 75 టిఎంసిలు, కండలేరుకు 25 టిఎంసిల నీరు చేరింది కేవలం కర్నూలు, కడప జిల్లాలలోని కుందు , చెయ్యేరు నదులు తెచ్చిన వరద నీరు మాత్రమే. సమస్యకు కారణం ఆ నీటిని రాయలసీమలో నిల్వ చేసుకునే ప్రాజెక్టుల నిర్మాణం చేయకపోవడమే.

ఆగస్టు నెల నుండి నేటి వరకు దాదాపు 70 రోజులుగా విడతల  వారిగా వరద వచ్చింది. ఆరు సార్లు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజి నిండి వందల టిఎంసిలు సముద్రంలో కలిసింది. కానీ రాయలసీమలో మాత్రం కేవలం 48 టిఎంసిల నీరు మాత్రమే చేరింది. నాలుగు రాయలసీమ జిల్లాల్లో చిన్నా పెద్దా ప్రాజెక్టుల సామర్థ్యం 115 టిఎంసిలు. వాటిలో చేరిన నీరు మాత్రం 48 టిఎంసిలు. సీమ ప్రాజెక్టులకు నీరు అందాలంటే పోతిరెడ్డిపాడు , మాల్యాల, ముచ్చిమర్రి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడానికి అవకాశం ఉంది. అక్కడ నుంచి బనకచర్ల వరకు ఉన్న 12 కిలో మీటర్ల కాలవ నిర్మాణం నీటిని అందుకునే స్థాయిలో చేయలేదు. బనకచర్ల నుంచి సీమ ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయాల్సిన మూడు పాయల నిర్మాణ సామర్థ్యం వరుసగా 15,12,8 వేల క్యూసెక్కులు. అంటే 2.5 టిఎంసిల నీరు మాత్రమే. ఇక మిగిలింది మాల్యాల , ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి అర టిఎంసి మాత్రమే నీటిని సరఫరా చేయగలం. మొత్తంగా రోజుకు మూడు టిఎంసిల నీరు విడుదల చేయడానికి మాత్రమే అవకాశం ఉంది.  నేడు నెల్లూరు, రాయలసీమలో కలిపి దాదాపు 150 టిఎంసిల నీరు నిల్వ చేశారు. మరో 50 టిఎంసిల నీటి నిల్వకు అవకాశం ఉన్నా చేయలేకపోయారు.

శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని వరదల సమయంలో త్వరితగతిన డ్రా చేయడానికి వీలుగా పోతిరెడ్డిపాడు వెడల్పును లక్ష క్యూసెక్కులకు పెంచి దానికి అనుగుణంగా బనకచర్ల కాల్వ , అక్కడి నుంచి మూడు పాయలుగా ఉన్న కాల్వల సామర్ధ్యాన్ని కూడా తగిన స్థాయిలో పెంచాలి. కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిన సమయంలో కూడా పుష్కలంగా నీటిని తీసుకువస్తున్న తుంగభద్ర, కుందు నీటిని నిల్వ చేసుకోవడానికి అనువుగా హెచ్ఎల్‌సికి సమాంతర కాల్వ, గుండ్రేవుల నిర్మాణం పూర్తి చేయాలి. కుందు నదిపై రాజోలు , జోలదరాసి, ఆదినిమ్మాయని బ్యారేజిల నిర్మాణం చేయాలి. రాయలసీమలోని కుందు , చెయ్యేరు నీటితో సోమశిల నిండి సముద్రం పాలు అవుతున్నా రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు ఉపయోగపడే కండలేరుకు నీరు అందని పరిస్థితిని అధిగమించడానికి సోమశిల – కండలేరు కాల్వ సామర్ధ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచాలి.

గోదావరి నీటిని శ్రీశైలంలో నింపి రాయలసీమ నీటి సమస్యను పరిష్కరించాలనుకుంటున్న ప్రభుత్వం నేడు శ్రీశైలం ప్రాజెక్టులో 70 రోజులుగా నీరు నిండుగా ఉన్నా సీమ ప్రాజెక్టులకు నీరు అందకపోవడానికి గల కారణాలపై దృష్టి పెట్టాలి. వరద నీటిని త్వరితగతిన ఉపయోగించుకునే ప్రాధమిక ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. అలా కాని పక్షంలో నేడు శ్రీశైలం నీటిని వాడుకోలేని రాయలసీమ రేపు గోదావరి నీటితో శ్రీశైలం నింపినా అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండవు.

-రాయలసీమ జలసాధన సమితి

This post was last modified on October 20, 2019 2:38 pm

sharma somaraju

Recent Posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More

May 10, 2024

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More

May 10, 2024

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More

May 10, 2024

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ

AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More

May 10, 2024

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024