‘వైసిపి వేధింపులపై రాజీలేని పోరాటం’

Published by
sharma somaraju

అమరావతి: వైసిపి ప్రభుత్వ వేధింపులపై రాజీలేని పోరాటం చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులతో మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. చింతమనేని ప్రభాకర్, అఖిలప్రియ, వల్లభనేని వంశీ తదితరులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనీ, తప్పుడు కేసులతో కోడెల శివప్రసాద్‌ను బలి తీసుకున్నారనీ చంద్రబాబు ఆరోపించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలను దారుణంగా వేధిస్తూ, ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం కార్యకర్తలు నిలబడ్డారని చంద్రబాబు అన్నారు. టిడిపి ఎంపిలు ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు ఇచ్చిన వినతి పత్రంపై ఈ రోజు నుండి మానవహక్కుల కమిషన్ బృందం నవంబర్ ఒకటి వరకూ రాష్ట్రంలో పర్యటిస్తోందని చంద్రబాబు చెప్పారు. ఈ బృందం ఆత్మకూరు, జంగేశ్వరపాడు, పిన్నెల్లి, పొనుగుపాడు ప్రాంతాల్లో పర్యటిస్తుందనీ, వైసిపి నేతల బాధితులు అందరూ మానవహక్కుల బృందాన్ని కలవాలనీ చంద్రబాబు తెలిపారు. పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను నెల రోజుల్లో తీయిస్తామనీ శాసనమండలిలోనే హామీ ఇచ్చారనీ, నాలుగు నెలలు అయినా కానీ గోడ తీయించలేదనీ చంద్రబాబు పేర్కొన్నారు. ఇది చూసి మిగిలిన చోట్ల కూడా వైసిపి నేతలు రెచ్చిపోతున్నారని చంద్రబాబు అన్నారు. అనంతరం జిల్లా వెంకటాపురంలో కూడా టిడిపి కార్యకర్త ఇంటి చుట్టూ గోడ కట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసిపి అరాచకాలను హ్యూమన్ రైట్స్ బృందానికి వివరించాలని చంద్రబాబు సూచించారు.

రాష్ట్రంలో వైసిపి నేతల స్వార్థానికి రోజు కూలీలు బలి అవుతున్నారని చంద్రబాబు విమర్శించారు. లక్షలాది కార్మికులు జీవనోపాధిని దెబ్బతీశారని చంద్రబాబు అన్నారు. సొంత గ్రామాల్లో వాగుల్లో ఇసుక తెచ్చుకోవడానికీ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పది రెట్ల ఎక్కువ ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు జగన్మాయగా మారిందనీ, అరగంటలోనే నో స్టాక్ బోర్డులు పెడుతున్నారనీ చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కూదేలయ్యే దుస్థితి తెచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు.

జలాశయాలు ఎందుకు నింపలేదని సిఎం ఇప్పుడు అధికారులను ప్రశ్నించడం హస్యాస్పదంగా ఉందని చంద్రబాబు అన్నారు. వరదల్లో నాలుగు వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృధాగా పోయాయని చంద్రబాబు పేర్కొన్నారు. టిడిపి చేసిన అభివృద్ధి పనులన్నీ రివర్స్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

టిడిపి నిర్మించిన భవనాలకు వైసిపి రంగులు వేస్తూ ప్రజల్లో టిడిపి అభివృద్ధి ముద్ర చెరిపివేయాలని పన్నాగాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

రాజధానిపై ప్రభుత్వం మరో కమిటీని వేసిందట, దానికి సూచనలు ఇవ్వాలట అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

This post was last modified on October 29, 2019 11:24 am

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Guppedantha Manasu: ముఖేష్ గౌడ అనే పేరు వినగానే బుల్లితెర ఆడియన్స్ లేచి నుంచుంటారని చెప్పుకోవచ్చు. అంత ఇష్టం మరి… Read More

April 27, 2024

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

Malli Nindu Jabili April 27 2024 Episode 634:  మాట్లాడుతున్నావా వసుంధర అని శరత్ అంటాడు. బయటికి వెళ్లి… Read More

April 27, 2024

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

YSRCP: ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.… Read More

April 27, 2024

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

Madhuranagarilo April 27 2024 Episode 349:  రుక్మిణి ఆలోచిస్తూ ఉండగా శ్యామ్ గోడ దూకి లోపలికి వస్తాడు. శ్యామ్… Read More

April 27, 2024

Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

Trinayani April 27 2024 Episode 1224: ఎందుకు అందరూ భయపడుతున్నారు అని నైని అడుగుతుంది. ఇక్కడ ఒక మూట… Read More

April 27, 2024

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

Aamani: 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తారల్లో ఆమని ఒకటి. బెంగళూరులో జన్మించిన ఆమని..… Read More

April 27, 2024

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

Ramayana: హిందువుల పవిత్ర గ్రంథమైన‌ రామాయణాన్ని ఇప్ప‌టికే ఎంద‌రో ద‌ర్శ‌కులు వెండితెర‌పై ఆవిష్క‌రించారు. ఈసారి నితేష్ తివారీ వంతు వచ్చింది.… Read More

April 27, 2024

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Karthika Deepam 2 April 27th 2024 Episode: దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్న అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.… Read More

April 27, 2024

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.… Read More

April 27, 2024

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈ ఆరడుగుల అందాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన… Read More

April 27, 2024

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

Manipur: మణిపూర్ లో మరో సారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు… Read More

April 27, 2024

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రం… Read More

April 27, 2024

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More

April 27, 2024

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More

April 27, 2024