వివేకా హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్య

Published by
sharma somaraju

కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడుగా భావిస్తున్న శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్రీనివాసులరెడ్డి మృతి చెందాడు. పోలీసుల వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాసులరెడ్డి సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. వివేకా హత్యకేసుతో తనకు సంబంధం లేదంటూ లేఖలో శ్రీనివాసరెడ్డి వాపోయాడు. సిఎం జగన్మోహనరెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలకు శ్రీనివాసులరెడ్డి వేరు వేరుగా లేఖలు రాశాడు. సూసైడ్‌ నోట్‌ను కుటుంబ సభ్యులకు డాక్టర్లు అందజేశారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపై ఆయన కుమారుడు స్పందించాడు.‘రెండు రోజుల క్రితం పోలీసులు విచారణకు పిలిచారు. వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం లేకపోయినా విచారణ ఎదుర్కొవాల్సి రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్ కుటుంబం అంటే మా నాన్నకు చాలా అభిమానం’ అని శ్రీనివాసరెడ్డి కుమారుడు పేర్కొన్నారు. శ్రీనివాసరెడ్డిని సిఐ రాములు తీవ్రంగా వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణను వేగంవంతం చేసింది. వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్యకు నార్కో అనాలసిస్‌, పాలిగ్రాఫ్‌, బీప్‌ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరగా న్యాయమూర్తి కిశోర్‌కుమార్‌ అనుమతి ఇచ్చారు. కోర్టు అనుమతితో పులివెందుల డిఎస్‌పి వాసుదేవన్‌ ఆధ్వర్యంలో రంగయ్యను హైదరాబాద్‌ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పోలీసులు అప్పట్లో సుమారు 60 మందికిపైగా వ్యక్తులను ప్రశ్నించారు.
ఘటనా స్థలంలో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌పై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కేసు నమోదు చేసిన 90 రోజుల వరకూ చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో వీరికి జూన్‌ 27న కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

కాగా ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరెడ్డి సూసైడ్ లేఖలో రెండు రకాల రాతలు ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిఐ రాములు పనితీరుపై ప్రాధమిక నివేదకను ఉన్నతాధికారులు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసరెడ్డి పేరున్న వ్యక్తి కోసం కానిస్టేబుల్‌ను పంపితే ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరెడ్డిని తీసుకువచ్చారనీ ప్రాధమిక నివేదిక ద్వారా తెలిసినట్లు సమాచారం. అసలు శ్రీనివాసరెడ్డి కాదని తేలడంతో స్టేషన్‌కు పిలిచిన అయిదు నిమిషాల్లోనే అతనిని పోలీసులు పంపినట్లు పేర్కొన్నారు. అతని ఆత్మహత్య వెనుక వేరే కారణాలు ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు  భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారు. కడప పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కోసం రాయలసీమ రేంజ్ నుండి ఉన్నతాధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది.

This post was last modified on September 3, 2019 12:53 pm

sharma somaraju

Recent Posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More

May 10, 2024

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More

May 10, 2024

Balagam: ఘాటు అందాలతో బలగం బ్యూటీ.. ఇందువల్లే ఈమెకి అవకాశాలు రావడం లేదా..!

Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More

May 10, 2024

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: చత్తీస్‌గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More

May 10, 2024

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More

May 10, 2024

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More

May 10, 2024

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024