టీడీపీ కీలక నేతల్లో అసమ్మతులు..! జగన్ ఊ అంటే ఇక క్యూ తప్పదు..!!

Published by
Srinivas Manem

అధికారం లేదు. ప్రతిపక్ష హోదా ఉంటుందో, పోతుందో తెలియదు. కార్యకర్తల్లో హుషారు ఎప్పుడు వస్తుందో తెలియదు..! ఈ క్రమంలో పార్టీని ఎలా కాపాడుకోవాలి..? కీలక నేతలకు ఎంతగా ప్రాధాన్యత ఇవ్వాలి..? చంద్రబాబుకి ఆ మాత్రం తెలియదా..? ఫార్టీ ఇయర్స్ బాబుకి ఈ మాత్రం సర్దుబాట్లు తెలియవా..? తెలిసినా లక్ష్యమా..? అందుకే ఇప్పుడు పార్టీలో అసమ్మతి సెగ రగులుతుంది. లోలోపల ఉన్న సెగ రేపో, మాపో పైకి వచ్చే అవకాశం ఉంది..!!

శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అదే తంతు..!!

మొన్నటి పదవుల పంపకంలో పార్టీలో అంతర్గత సెగ వేడి పెరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతలకు సరైన పదవులు ఇవ్వలేదంటూ రగిలిపోతున్నారట. విశాఖపట్నంలో పార్టీని బలోపేతం చేయాల్సిన చోట ఇలా వదిలేయడం ఏమిటంటూ ఆవేదన చెందుతున్నారట. పశ్చిమ గోదావరిలో చింతమనేని వర్గం గుర్రుగా ఉందట. ఇటు ప్రకాశం జిల్లాలో ఒక్కరికీ రాష్ట్రస్థాయి పదవులు ఇవ్వలేదేంటి..? అంటూ లోలోపల ప్రశించుకుంటున్నారట. మరోవైపు గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ అసంతృప్తి సెగ రగులుతుంది. వేడిగా సలసలా కాగుతుంది. ఏ క్షణమైనా బయటకు ఉబికెందుకు సిద్ధమవుతోంది.

balakrishna obstructed ap tdp committee

కొన్ని ఉదాహరణలు ఇవిగో..!!

* ప్రతిభాభారతి గురించి అందరికీ తెలుసు. ఏపీలో మొదటి మహిళా స్పీకర్. అంతకు ముందు రెండు సార్లు మంత్రిగానూ పని చేసారు. అయితే కాలం కలిసిరాక 2014 లో 512 తేడాతో ఓడిపోయారు. ఆమె టీడీపీ పొలిట్ బ్యూరోలో ఉండేవారు. ఆమెను తప్పించి, జాతీయ ఉపాధ్యక్షురాలిగా చేశారు. పొలిట్ బ్యూరో అంటే కీలకం, జాతీయ ఉపాధ్యక్షురాలు అంటే నాకెందుకు అంటూ ఆమె సన్నిహితులు వద్ద వాపోతున్నారట. రెండు రోజుల కిందటే “నాకు ఈ పదవి వద్దు” అంటూ చంద్రబాబుకి లేఖ రాసినట్టు సమాచారం. ఇదే జిల్లాలోని గౌతు లచ్చన్న మనవరాలు, గౌతు శిరీషకి కూడా సరైన ప్రాధాన్యత దక్కలేదని అంటున్నారు.


* ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్ టీడీపీకి కీలక నేత. ఒకప్పుడు జిల్లాలో టీడీపీని ఒంటరిగా తన భుజాన మోశారు. ఆయన నోటి దురుసు కారణంగా మంత్రి అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు కనేసాం పార్టీలో పదవి కూడా ఇవ్వలేదు. మంత్రి అంటే పనికిరాకపోవచ్చు.., ఏం..? పార్టీ పదవులకు మా నాయకుడు పనికిరాడా..? అంటూ ఆయన వర్గం పార్టీపై గుర్రుగా ఉంది. చింతమనేని ద్వారానే రాజకీయాల్లోకి వచ్చి సీటు దక్కించుకున్న గన్ని వీరాంజనేయులుకి పార్లమెంటు అధ్యక్షుడు ఇచ్చారు. చింతమనేనికి రాష్ట్రస్థాయి పదవి ఆశించినప్పటికీ రాలేదు.


* ప్రకాశం జిల్లాలో టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. నిజానికి 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వచ్చిన జిల్లా ప్రకాశమే. మొత్తం 12 లో 4 గెలిచారు. తూర్పుగోదావరిలో 19 కి 4 .., విశాఖలో 16 లో 4 గెలిచారు. కానీ ఆ జిల్లా నుండి ఏ ఒక్కరికీ రాష్ట్రస్థాయి పదవి రాకపోవడం అనేక ప్రశ్నలను మిగులుస్తుంది. చిత్తూరు జిల్లాలో గల్లా అరుణకుమారి జాతీయ ఉపాధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చారు. కానీ ఆమెకు అసంతృప్తి ఉందట.

జగన్ ఒకే అంటే క్యూ తప్పదు..!!

టీడీపీపై ఇప్పట్లో ఆశలు లేవు. మరోవైపు చంద్రబాబు చుస్తే ఇంకా ఆ పాత కాలం లెక్కలతో నెట్టుకొస్తున్నారు. అధికార పార్టీ దూకుడుగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో యువ నేతలు, దూకుడుగా ఉన్న నేతలకు రాష్ట్రస్థాయిలో పదవులు ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారట. అందుకే ఇప్పుడు కొన్ని కొత్త మాటలు వస్తున్నాయి. జగన్ ఒకే అంటే కొందరు మాజీలు, దాదాపు 10 మంది టీడీపీ ప్రముఖులు సైతం వైసీపీకి జంపయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీలోనే అంతర్గతంగా వినిపిస్తున్న మాటలు.

Srinivas Manem

Recent Posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More

May 10, 2024

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More

May 10, 2024

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More

May 10, 2024

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ

AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More

May 10, 2024

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024