మూడు పార్టీల నేతల నిరసనలు..! రామతీర్థం వద్ద ఉద్రిక్తత..! విజయసాయి వాహనంపై టీడీపీ శ్రేణుల దాడి..!!

Published by
sharma somaraju

 

గత నెల 28న విజయనగరం జిల్లాలో ప్రఖ్యాత రామతీర్థం బోడికొండపై గల కోదండ రామాలయంలోని స్వామి విగ్రహన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి శిరస్సును కొలనులో పడవేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ, బీజేపీలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండగా వైసీపీ నేతలు టీడీపీ నేతల కుట్రేనంటూ ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఘటన వెనుక చంద్రబాబు, లోకేష్ లు ఉన్నారనీ, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలే ఈ దారుణానికి పాల్పడ్డారని విమర్శించారు. దీనిపై ఇరు పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శల దాడి జరుగుతోంది.

ఈ క్రమంలోనే నేడు టీడీపీ అధినేత చంద్రబాబురామతీర్ధం సందర్శనకు బయలుదేరారు. చంద్రబాబు రాక సందర్బంగా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రామతీర్థం కొండ వద్దకు చేరుకున్నారు. అయితే చంద్రబాబు కంటే ముందుగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, పలువురు పార్టీ నేతలతో కలిసి రామతీర్ధంకు చేరుకున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా బీజెపీ శ్రేణులతో అక్కడకు చేరుకున్నారు. మూడు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ ఆందోళనలు, నిరసనలతో ఆ ప్రాంతం అట్టుడికింది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు రాళ్లతో దాడి చేశారు. దీంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు టీడీపీ శ్రేణులను నిలువరించారు. పోలీసులు, వైసీీపీ కార్యకర్తల రక్షణ మధ్య విజయసాయి రెడ్డి కొండపైకి వెళ్లి అక్కడ ఘటన గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. తరువాత కొండ కిందకు వచ్చి కారును అక్కడే ఉంచి కాలినడకను వేరే ఆలయానికి విజయసాయి రెడ్డి వెళ్లారు.

కొండపైకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదని చెప్పిన పోలీసులు విజయసాయిరెడ్డికి ఎలా అనుమతించారంటూ బీజెపీ శ్రేణలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కొండపైకి అనుమతించాలంటూ బీజెపీ ఎమ్మెల్సీ మాధవ్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కాగా బోడికొండ దిగువన బీజేపీ, వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఆందోళనకు దిగారు. మరో వైపు విశాఖ నుండి రోడ్డు మార్గంలో రామతీర్థం బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై పోలీసులతో టీడీపీ నేతలు వాదనకు దిగారు. చంద్రబాబు కాన్వాయ్ లో అదనపు కార్లు రావడానికి వీలులేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబుతో సహా పార్టీ నేతలు కొద్ది సేపు రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు. అనంతరం చంద్రబాబు రామతీర్థంకు చేరుకున్నారు.

This post was last modified on January 2, 2021 5:24 pm

sharma somaraju

Recent Posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More

May 8, 2024

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More

May 8, 2024

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More

May 8, 2024

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More

May 8, 2024

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More

May 8, 2024

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

వైసీపీ అగ్ర‌ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కోట‌రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పుంగ‌నూరు స‌హా.. పీలేరు,… Read More

May 8, 2024

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

మెగా కుటుంబంలో భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం.. ఆయ‌న పోటీ చేస్తున్న ఉమ్మ‌డి తూర్పు… Read More

May 8, 2024