నీతి లేని న్యాయం..!! ఎవరి మరణం.? ఎక్కడి కేసు.? ఎందుకీ రాజకీయం.?

Published by
Special Bureau

న్యాయం.., నీతి.., నిజాయితీ ఇవన్నీ ఒకే అమ్మకి పుట్టిన బిడ్డలు. కలిసి ఒకే చోట ఉంటే సంతోషం ఉంటుంది..!! అయితే న్యాయం ఉన్న ప్రతీ చోట నీతి, నిజాయితీ ఉంటుందన్న నమ్మకం లేదు. అలా ఉంటేనే మాంచి కిక్కు ఉంటుంది..!! అలాగే నీతి, నిజాయితీ ఉన్న చోట న్యాయం ఉంటుందన్న నమ్మకమూ లేదు. న్యాయం దారి వేరు. అది చట్టం, కోర్టులు, రాజ్యాంగం అనే సూత్రాల ప్రాతిపదికన పని చేస్తుంది. న్యాయాన్ని నీతి లేకుండా వాడుకోవడంలో కొందరు రాజకీయ నాయకులూ ముందుంటారు. తాజాగా ఓ కేసుని మనం ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ఆ మాజీ ఎంపీకి ఏం పనీ, పాటు ఉండదేమో. ఎక్కడ ఏ కేసు ఉన్న, ఎక్కడ ఏం జరిగినా వాలిపోతారు. తానున్నానన్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. రాజకీయంగా వాడేసుకుంటారు. అందుకే ఆయన అమలాపురం నుండి చీరాల వెళ్లి ఓ కేసుని కనుక్కుని, ఇప్పుడు కోర్టుకి వెళ్లారు. కోర్టుకి వెళ్లడం మంచిదే కానీ.., ఆ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వెళ్లడం కనీస ఇంగితం అనే ఆలోచన లేకుండా వెళ్లడమే ఆ మాజీ ఎంపీకి రాజకీయ వ్యవహారం.

చీరాల కిరణ్ వ్యవహారం గుర్తుందిగా..??

చీరాలకి చెందిన కిరణ్ రెండు నెలల కిందట మరణించారు. పోలీసులు కొట్టిన కారణంగానే కిరణ్ మరణించారనేది ఓ వర్గం వాదన. లేదు కిరణ్ పొలిసు జీపు నుండి దూకేసిన కారణంగా మరణించాడు అనేది పోలీసుల వాదన. దీనిలో నిజాలు తేల్చే క్రమంలో ఇప్పటికీ విచారణ జరుగుతుంది. ఏ ఘటనకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఉన్న ఎస్సైని కూడా సస్పెండ్ చేసారు. ప్రభుత్వం ఈ ఘటనపై అన్ని విధాలుగా స్పందించింది. విషయం తెలిసిన వెంటనే చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో సీఎం జగన్ మాట్లాడారు,వివరాలు తెలుసుకుని ప్రభుత్వం తరపున రూ. 10 లక్షలు సాయం అందించారు. జిల్లా అధికారులను, రాష్ట్ర ఎస్సి ప్రజా ప్రతినిధుల కమిటీని కిరణ్ ఇంటికి పంపించారు. కుటుంబాన్ని ఓదార్చారు, భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున చేయాల్సినవి చేస్తూనే, విచారణ కూడా కీలక దశకు చేరింది.

ఎథికల్ పాయింట్..! మాజీ ఎంపీకి ఏం సంబంధం..!!?

మాజీ ఎంపీ హర్ష కుమార్ అందరికీ తెలిసిన పేరు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీ అంటూ తిరిగినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా..? ఎటువంటి ఇష్యూ ఉన్నా వెంటనే వాలిపోయి తనకు ఏంటి అని ఆలోచించే టైపు. ఆయనకు ఓ లాయర్ శ్రావణ్ కుమార్ తోడయ్యారు. పైన చెప్పుకున్న చీరాల కిరణ్ కేసుని సీబీఐకి అప్పగించాలని కోర్టులో పిల్ వేశారు. అంటే తప్పు లేదు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరగాలి అని కోరడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఆ కిరణ్ తల్లిదండ్రుల అనుమతి లేకపోవడమే కీలక పాయింటు.* న్యాయ సూత్రాల ఆధారాంగా చూస్తే ఆ తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదు. ఎక్కడి కేసుని, ఎవరైనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎథికల్ గా ఆలోచిస్తే ఆ తల్లిదండ్రుల అనుమతితో వేయడం సబబు.

గతంలో వద్దు అనుకుని మళ్ళీ..!!

జులై 21 న కిరణ్ మరణించారు. జులై నెలాఖరు నాటికే ప్రభుత్వం తరపున కొన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆగష్టు 15 వరకు ఆ కుటుంబానికి ఓదార్పులు, పరామర్శలు జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లోనే హర్ష కుమార్ తరపున లాయర్ శ్రావణ్ కుమార్ సిబిఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేయడానికి తల్లి దండ్రులను ఒప్పించారు. అయిష్టంగానే అంగీకరించిన ఆ తల్లిదండ్రులు ఆ తర్వాత దీనిలోని రాజకీయ కోణాలను అలోచించి వాపసు చేయించారు. “మీరు మీ రాజకీయ స్వార్ధం కోసమే వేస్తున్నారు. మీ ప్రయోజనాలకు మమ్మల్ని లాగొద్దు” అంటూ పిటిషన్ ని వాపసు తీసుకున్నారు. ఇది జరిగిన నెల తర్వాత మళ్ళీ తాజాగా హర్ష కుమార్ తరపున శ్రావణ్ కుమార్ కోర్టులో పిటిషన్ వేయడం.., దీనికి కనీసం ఆ తల్లి దండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం, అనుమతి తీసుకోకపోవడం.. వారి రాజకీయ ఉద్దేశాలను అద్దం పడుతుంది. అందుకే ఎవరి మరణం..? ఎక్కడి కేసు..? ఎందుకీ రాజకీయం..??

This post was last modified on September 21, 2020 4:35 pm

Special Bureau

Recent Posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

EC: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి కామన్ సింబల్… Read More

April 28, 2024

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

YS Sharmila: వైఎస్ఆర్ ప్రజాదర్భార్ పెట్టి ప్రజల మధ్యే ఉండే వారు..జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్మెంట్ దొరకలేదు..వైఎస్ఆర్ పాలన..జగన్ పాలనకు… Read More

April 28, 2024

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

TDP: సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన కోడి కత్తి శ్రీను టీడీపీలో చేరాడు. ముమ్మడివరంలో ఆదివారం… Read More

April 28, 2024

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Anand Devarakonda: రౌడీ హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్… Read More

April 28, 2024

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచిన సినిమాలలో పోకిరి కూడా ఒకటి. 2006… Read More

April 28, 2024

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Main Released Movies In OTT: ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చి సందడి చేశాయి. ముఖ్యంగా తెలుగు… Read More

April 28, 2024

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Samantha Movie Poster: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా… Read More

April 28, 2024

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో… Read More

April 28, 2024

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్… Read More

April 28, 2024

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More

April 28, 2024

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More

April 28, 2024

Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!

Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More

April 28, 2024

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More

April 28, 2024

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More

April 28, 2024

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More

April 28, 2024