రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పైన ‘పవర్ స్టార్‘ పేరిట ఒక సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే వర్కింగ్ స్టిల్స్ ను బయటపెట్టేసిన వర్మ ఇలా ఎన్నో సినిమాలను ముందు మొదలుపెట్టిన కొన్నిటిని ఆపేశాడు కానీ అతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమాలను మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేసి తీరుతాడు. ‘పవర్ స్టార్‘ సినిమాలో కథానాయకుడు పవన్ కళ్యాణ్ లాగే ఒడ్డూ, పొడవూ, మేనరిజం, బాడీ లాంగ్వేజ్, మెడలో ఎర్ర తువ్వాలు మొత్తం దించేశాడు. అయితే పోర్న్ స్టార్ తో వర్మ ‘క్లైమాక్స్‘ అనే సినిమా చేశాడు… ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కరోనా పైన కూడా సినిమా తీస్తున్నాడు…. నగ్నం అంటూ హాట్ హీరోయిన్ చేత తెర పైన అందాలు అరబోయించాడు. మరి ఇలా వేరే పంథాలో సాగుతున్న వర్మ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ పైన పడడం ఏమిటి?
ఇక్కడ విశేషం ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ కు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ప్రేమ. ఇక మెగా ఫ్యామిలీ అంటేనే చెవి కోకొంటారు. నాలుగు రోజుల గ్యాప్ వస్తే చాలు కళ్యాణ్ ని పట్టుకుని మరికెలుక్కుంటాడు లేకపోతే అతనికి ఏమీ తోచదు. అయితే గతంలో శ్రీరెడ్డి ని పవన్ కళ్యాణ్ ని పబ్లిక్ లో తిట్టమని ప్రేరేపించింది తనే అని ఒప్పుకున్న వర్మ ను కనీసం మెగా ఫ్యామిలీ కన్నెత్తి కూడా చూడలేదు. అసలు ఆ విషయంలో వర్మ ని ఏమి అన్నా లాభం లేదు అన్నట్లే వ్యవహరించారు. మెగా అభిమానులు మరియు అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయినా ఆ ఎఫెక్ట్ వర్మ పై కూసింత కూడా పడలేదు. ఇప్పుడు అదే ధైర్యం తో వర్మ సినిమా తీస్తున్నాడా అని అందరికీ సందేహాలు వస్తున్నాయి. కొందరైతే అదే నిజం అనేస్తున్నారు కూడా.
సరే…. సినిమా దర్శకుడికి స్వేచ్ఛ ఉంటుంది. తనకు నచ్చిన కథను తనకు నచ్చినట్లు లీగల్ గా ఎటువంటి ఇష్యూలు రానంతవరకూ తెరకెక్కించుకుంటాడు. మరి డబ్బులు వచ్చేది ఎలా..? ఇదే మెయిన్ పాయింట్. వర్మ ఉన్న పరిస్థితుల్లో అతనిని నమ్మి సినిమాకు డబ్బులు పెట్టే వారు ఎవరు? అదే పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేసే లాగా సినిమా తీస్తే మాత్రం మేము డబ్బులు పెడతామంటూ ఎంతో మంది ముందుకు వస్తారు అన్నది వర్మ లాజిక్. ఇప్పటికే ముందు రెండు సినిమాలను అసలు ఈ ఏటిటి ప్లాట్‌ఫామ్ అనే ఒక మార్గాన్ని కనిపెట్తిన వర్మకు జనాల కథా కమామిషు ఏమిటో అర్థం అయిపోయింది. క్లైమాక్స్, నగ్నం లాంటి రెండు చెత్త సినిమాలు తీసినా కూడా అవి కేవలం మూడు రోజుల్లోనే కోట్ల రూపాయలు లాభాలు తెచ్చి పెట్టాయి.
ఇక మెగా ఫ్యామిలీలోని ప్రస్తుత పాపులర్ హీరో పవన్ కళ్యాణ్ మీద సినిమా తీసుకున్నట్లయితే ప్రొడక్షన్ వ్యాల్యూ సూపర్ వస్తుంది. అతనికి కావాల్సినంత పబ్లిసిటీ మరియు డబ్బు ముడుతుంది. పైగా మెగా ఫ్యామిలీ వారు సౌమ్య పరులు కూడా. ఏదైనా రియాక్ట్ అయితే వారి అభిమానులు రియాక్ట్ అవ్వాలి కానీ వారు మాత్రం తమకు ఏమీ పట్టనట్లు ఉంటారు. వారిలో వారికి అభిప్రాయబేధాలు లేవు కానీ సినిమా వారంటే మాత్రం జాలి, ప్రేమ, దయ, కరుణ అన్నీ వచ్చేస్తాయి.
మరి వారిని అడ్డం పెట్టుకుని, వారిని కించ పరుస్తూ వారి ఇమేజ్ ని డ్యామేజ్ చేసే సినిమాలు తీసేందుకు కావాల్సినంత బడ్జెట్ వస్తుంటే మాత్రం కామ్ గా ఉండడం తప్ప ఎవరు మాత్రం ఏం చేస్తారు..? అలాంటి వారి నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వర్మ లాంటి వారు పవన్ కళ్యాణ్ లాంటి అత్యంత చరిష్మా కలిగిన లీడర్ పైన సినిమాలు తీస్తుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి తగిన ఆరోపణలు, సాక్ష్యాలు అసలు ఎటువంటి కారణాలు లేక ఇబ్బంది పడతారు కానీ వర్మ మాత్రం తన క్రియేటివిటీతో తనకు నచ్చిన సినిమా తీసేస్తాడు. ఎందుకంటే అవతల ఉన్నది మెగా ఫ్యామిలీ…. తీస్తున్నది పవన్ కళ్యాణ్ మీద. అలా అయితేనే డబ్బులు ఇస్తారు మరియు డబ్బులు వస్తాయి కూడా.
This post was last modified on July 10, 2020 11:05 pm
Avinash: జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ఒకప్పుడు ఓ రేంజ్ టిఆర్పి… Read More
Singer Geetha Madhuri: ప్రజెంట్ జనరేషన్ లో టాలీవుడ్ కి చెందిన అనేకమంది కపుల్స్ విడాకులు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి… Read More
Zara Hatke Zera Bachke OTT: జరా హట్ జార బచ్కే సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కోసం చాలామంది ప్రేక్షకులు… Read More
The Goat Life OTT: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం ది… Read More
Vidya Vasula Aham OTT: ఆహా ఓటిటి లోకి నేరుగా మరో మూవీ రానుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండానే విద్య… Read More
AP Elections 2024: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభాల పర్వానికి నేతలు… Read More
Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆదివారం పలు… Read More
Aavesham OTT: మలయాళం సూపర్ స్టార్ ఫహిత్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. పుష్ప మూవీ తో… Read More
Jyoti Roy: రెండు రోజుల కిందట జ్యోతి రాయ్ అనే నటి ఇంటిమేట్ వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. అనంతరం… Read More
Pallavi Prashant: బిగ్‌బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకులలో విపరీతమైన సానుభూతులు కలిగించిన ఏకైక వ్యక్తి పల్లవి ప్రశాంత్.… Read More
Getup Srinu: ప్రజెంట్ ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా నడుస్తుందో మనందరం చూస్తూనే ఉంటున్నాం. ఒకరిపై ఒకరు కాంట్రవర్షల్… Read More
Amardeep: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావచ్చా అంటే.. నిర్మోహమాటంగా రావచ్చు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా ఎటువంటి బ్యాగ్రౌండ్… Read More
Deepti Sunaina: ప్రస్తుత కాలంలోతమ టాలెంట్‌ను యూట్యూబ్‌లో ప్రదర్శిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ప్రజెంట్ జనరేషన్ లో వెండితెర బుల్లితెర… Read More
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దెందులూరు. ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ మార్పు స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం. కూటమి… Read More
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా… Read More