Yatra 2: వైసీపీ అధినేత సీఎం జగన్ పొలిటికల్ కెరియర్ ఆధారంగా తీసిన సినిమా “యాత్ర 2”. మహీ వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తారీకు రిలీజ్ అయింది. మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సరిగ్గా 2019 ఎన్నికలకి ముందు ఇదే దర్శకుడు “యాత్ర” అనే సినిమా తీయడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారం చేసుకుని తీసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. రాజకీయంగా సమయంలో వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ ఈ సినిమా తీసుకొచ్చినట్లు అయింది. కాగా ఇప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైయస్ జగన్ ఎదుర్కొన్న పొలిటికల్ సమస్యలను ఆధారం చేసుకుని “యాత్ర 2” చేశారు.
ఈ సినిమాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ఇంకా 2014లో ప్రతిపక్షం నేతగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, 2019 ఎన్నికలలో సీఎం కావటం అన్నిటిని కళ్ళకి కట్టినట్లు చూపించారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాలా ఎలిమెంట్స్ జగన్ అభిమానులను టచ్ చేశాయి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా సురేష్ అనే వైసీపీ కార్యకర్తని అక్రమ కేసుల్లో అరెస్టు చేయటం సీన్ చాలామందిని ఆకట్టుకుంది. రాజధాని భూములలో చెట్లు కాల్చేశారని జగన్ మీద నింద వేయటానికి పోలీసుల చేత సురేష్ ని చాలా దారుణంగా జగన్ ప్రత్యర్ధులు హింసిస్తారు. కానీ ఎక్కడా కూడా సురేష్ లొంగకుండా న్యాయం వైపు నిలబడటం జరుగుద్ది. ఈ సన్నివేశంలో పోలీసులు సురేష్ ని ఇంటి దగ్గర విడిచి పెట్టేస్తారు.
అనంతరం కుటుంబ సభ్యులు ఎందుకయ్యా రాజకీయాలు ఎవరైనా వచ్చి మనల్ని ఆదుకుంటారా మనమెంత మన బతుకులు ఎంత అని సురేష్ కి నచ్చచెప్పుతారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ వల్ల తన తండ్రి 10 సంవత్సరాల అధికంగా బతికినట్లు సురేష్ బదులిస్తాడు. ఈ క్రమంలో విషయం మొత్తం తెలుసుకున్న వైయస్ జగన్ స్వయంగా సురేష్ ఇంటికి వచ్చి.. నువ్వు న్యాయం కోసం నిలబడ్డావు నిన్ను కొట్టిన పోలీసుల రాబోయే రోజులలో నీకు సెల్యూట్ చేసేలా నేను చూసుకుంటా అంటూ సినిమాలో చెప్పిన డైలాగ్ థియేటర్ లో మంచి రెస్పాన్స్ రప్పించింది. ఆ తర్వాత అదే సురేష్ 2019 ఎన్నికలలో బాపట్ల ఎంపీగా గెలవడం జరుగుతుంది. “యాత్ర 2” బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవటంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. జగన్ పాత్రలో జీవ అద్భుతమైన హావభావాలు పలికించారు.
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More
Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్‌ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More
Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More
Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More
Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More
Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More
Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More
Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More
EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More
Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More
Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More
Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్… Read More
OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావ్ మనందరికీ సుపరిచితమే. ఈయన… Read More
Sri Sathya: ప్రెసెంట్ ఉన్న సినీ తారలు కారులు కొనుగోలు చేయడంపై బిజీ అయిపోయారు. చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్… Read More
NTR: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో… Read More