ఇప్పటి వరకూ ఎన్నికల సర్వేల విషయంలో లగడపాటి సర్వేలకు ఒక విశ్వసనీయత ఉండేది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఆయన సర్వే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పినట్లు చిలక జోస్యం స్థాయికి పడిపోయింది. వార్ వన్ సైడే పోలింగ్ శాతం పెరిగితే కూటమి వన్ సైడ్ గా విజయం సాధిస్తుందన్న ఆయన అంచనాలు పూర్తిగా తప్పయ్యాయి. ఫలితాల సరళిని బట్టి చూస్తే కారు ఆధిక్యత చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కనీసం రెండు పదుల స్థానాలను కూడా ప్రజాకూటమి చేరుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ దశలో లగడపాటి సర్వేల విశ్వసనీయత మసకబారిందనే చెప్పాలి.
ఎగ్జిట్ పోల్స్ వెలువరించే సంప్రదాయాన్ని కూడా ఉల్లంఘించి పోలింగ్ కు ముందే అంచనాలు అంటే లగడపాటి వెలువరించినప్పుడే ఎప్పుడూ లేని విధంగా ఇలా ఎందుకు చేశారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అంచనాలు చెబుతున్నాననంటూ ఆయన కూటమికి అనుకూలంగా చేసిన ప్రకటన పోలింగ్ కు ముందు ఏదో మేరకు ఓటర్లను ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నంగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఆయన అంచనాలు, గతంలో ఆయన అంచనాలు నిజమైన పరిస్థితి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ తీవ్రంగా పెరిగిన మాట వాస్తవం. అయితే ఫలితాల సరళిని బట్టి చూస్తే లగడపాటి ఏదో రాజకీయ ప్రయోజనం ఆశించే సర్వే అంచనాలను ప్రకటించారని భావించాల్సి ఉంటుంది. మొత్తంగా తెరాస ముందు నుంచీ చెబుతున్నట్లుగానే గతానికి మించి అద్భుత ఫలితాలను సాధించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోంది. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 89 స్థానాలు, కాంగ్రెస్ 16, బీజేపీ4, ఎంఐఎం 5 ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 1 స్థానం, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 7 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ 1, టీడీపీ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 2 స్థానాల్లోనూ ఇండిపెండెంట్ ఒకరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ 9 స్థానాల్లోనూ కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యత కనబరుస్తుంది. ఇకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 1 స్థానంలోనే ఆధిక్యతలో ఉంది. ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 8 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అటు కాంగ్రెస్ 1 స్థానంలో బీజేపీ 1 స్థానంలో ఆధిక్యతలో ఉంది. ఇకపోతే హైదరాబాద్ లో టీఆర్ఎస్ 6, బీజేపీ 4, ఎంఐఎం 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More
AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More
Family Star OTT Response: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More
Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More
Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్… Read More
Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్… Read More
Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More
Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More
Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More
Himaja: బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు… Read More
Guppedantha Manasu: ముఖేష్ గౌడ అనే పేరు వినగానే బుల్లితెర ఆడియన్స్ లేచి నుంచుంటారని చెప్పుకోవచ్చు. అంత ఇష్టం మరి… Read More