YSRCP: ఫలించిన జగన్ వ్యూహం .. మెత్తబడ్డ బాలినేని

Published by
sharma somaraju

YSRCP: ఒంగోలు లోక్ సభ వైసీపీ అభ్యర్ధిత్వం సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఖరారు చేయాలని పట్టుబడుతూ  వచ్చిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చివరకు మెత్తబడ్డారు. గత రెండు రోజులుగా విజయవాడలోనే ఉండి అధిష్టానంతో చర్చలు జరిపారు. అయితే అధిష్టానం పెద్దలతో బాలినేని జరిపిన చర్చల్లో ఫలితం లభించలేదు. మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని బాలినేనికి వైసీపీ పెద్దలు తెగేసి చెప్పారు.

Balineni Srinivasa Reddy

చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరు ఒంగోలు లోక్ సభకు ఖరారు చేసినట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఒంగోలు లోక్ సభ విషయంలో బాలినేని మరో ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినా పార్టీ ససేమిరా అన్నట్లుగా తెలుస్తొంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడేళ్ల పాటు జిల్లాలో అన్ని తానే అన్నట్లుగా చక్రం తిప్పిన బాలినేని కి ఆ తర్వాత ప్రాధాన్యత తగ్గడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. పార్టీ మారతారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఆయన ఖండించారు.

balineni magunta reddy

అయిదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బాలినేని ..సీఎం దగ్గరి బంధువు అయినప్పటికీ పార్టీలో మాట చెల్లుబాటు కాకపోవడంతో పలు మార్లు అలిగి హైదరాబాద్ కూడా వెళ్లారని టాక్ నడిచింది. అయితే బాలినేని కోరిక మేరకు ఒంగోలులో 25వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గానూ అవసరమైన నిధులను సీఎం జగన్ ఇటీవల విడుదల చేశారు. దీంతో బాలినేని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

విజయవాడ నుండి ఒంగోలు చేరుకున్న బాలినేని మీడియాతో మాట్లాడారు. ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే తనకు ముఖ్యమని తెలిపారు. ఎంపీ అభ్యర్ధిగా మాగుంట అయితే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇతర అసెంబ్లీ సిగ్మెంట్ లలో బాగుంటుందనే తాను పోరాటం చేశానన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోని అభ్యర్ధులు మాగుంట విషయంలో పట్టీపట్టనట్లు ఉన్నారనీ, వాళ్లకు లేని బాధ తనకు ఎందుకు అని ప్రశ్నించారు.

ఇక పార్టీ హైకమాండ్ ఏమి చెబితే అదే చేస్తానని వెల్లడించారు బాలినేని. మాగుంట టికెట్ విషయంలో పట్టుబడితే తాను పార్టీ మారుతానంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎంపీ అభ్యర్ధిగా ఎవరు వచ్చినా తనకు అభ్యంతరం లేదనీ, ఒంగోలులో తన గెలుపును తాను చూసుకుంటానని బాలినేని తేల్చి చెప్పారు. బాలినేని ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడంతో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తొలి నుండి కాంగ్రెస్ కుటుంబానికి చెందిన మాగుంట రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి వైవీ సుబ్బారెడ్డి చేతిలో  కేవలం 15వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి మూడో సారి ఎంపీగా గెలిచారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరతారా లేక మరల టీడీపీలోకి వెళతారా అనేది వేచి చూడాలి.

YS Sharmila: వైఎస్ షర్మిలకు జగన్ సర్కార్ షాక్ .. డీజీపీకి రఘువీరా లేఖ ..ఎందుకంటే..?

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More

May 10, 2024

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More

May 10, 2024

Balagam: ఘాటు అందాలతో బలగం బ్యూటీ.. ఇందువల్లే ఈమెకి అవకాశాలు రావడం లేదా..!

Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More

May 10, 2024

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: చత్తీస్‌గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More

May 10, 2024

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More

May 10, 2024

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More

May 10, 2024

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024