NewsOrbit
Entertainment News సినిమా

Kannappa Manchu Vishnu: శివుడికి బాణం గురి పెట్టిన మంచు విష్ణు.. ‘కన్నప్ప’ మూవీ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర విషయాలు!

Interesting update on Kannappa Manchu Vishnu Pan India movie

Kannappa Manchu Vishnu: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆడపా దడపా సినిమాలు చేస్తుంటారు. అయితే మంచు విష్ణుకు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందలేకపోయారు. దాంతో ప్రస్తుతం ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారు. ఈ సినిమాకు మోహన్ బాబు దాదాపు రూ.150 కోట్లుతో నిర్మిస్తున్నారు. దూర్జటి విరచిత ‘శ్రీకాళహస్తీశ్వర మహత్యం’ కావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల శ్రీకాళహస్తిలో జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది.

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. తాజాగా మేకర్స్ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. మంచు విష్ణుకు ‘కన్నప్ప’ చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆయన చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులోకి కథకు తగినట్లు దేశంలోని స్టార్ నటీ నటులను మంచు విష్ణు ఎంపిక చేశారు. గురువారం (నవంబర్ 23) నాడు మంచు విష్ణు పుట్టిన రోజు. దాంతో మేకర్స్ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

Interesting update on Kannappa Manchu Vishnu Pan India movie
Interesting update on Kannappa Manchu Vishnu Pan India movie

మంచు విష్ణు ఫస్ట్ లుక్ రిలీజ్..

‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎంత అద్భుతంగా ఉందంటే.. దాన్ని చూసి ఎవరైనా కొనియాడాల్సిందే.. ఈ పోస్టర్‌లో మంచు విష్ణు కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. మంచు విష్ణు ఫస్ట్ లుక్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ పోస్టర్‌లో మంచు విష్ణు వేటగాడిగా కనిపిస్తున్నాడు. గాల్లో ఎగురుతూ బాణాలు సంధిస్తున్న వీరుడిలా మంచు విష్ణు లుక్ అదిరిపోయింది. రెండు కొండల మధ్య శివుడి విగ్రహం.. అటు వైపు నుంచి కొన్ని వందల బాణాలు మంచు విష్ణు వైపు దూసుకొస్తున్నాయి. కన్నప్ప టైటిల్ ఆర్ట్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయని తెలుస్తోంది. ఈ మూవీ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలే పెంచింది. భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివిధ పరిశ్రమల నుంచి నటీనటులు..

కన్నప్ప సినిమా కోసం వివిధ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు కీలక పాత్ర పోషించనున్నారు. మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, కోలీవుడ్ నుంచి నయనతార, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్‌లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో శివుడు పాత్రలో కనిపించనున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే 80 శాతం షూటింగ్ పనులు పూర్తి చేయనున్నారు. న్యూజిలాండ్‌లో ఇంత వరకు తెరపై చూపించిన విజువల్స్‌ను అద్భుతంగా చిత్రీకరించబోతున్నారు. కన్నప్పను ఒక విజువల్ వండర్‌గా తెరకెక్కించబోతున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ ఈ సినిమాను ఉన్నతమైన స్థాయిలో చూపించబోతున్నారు. కన్నప్ప చిత్రంలోని విజువల్స్, యాక్షన్ సీక్వెల్స్ ఇండియన్ స్క్రీన్స్ మీద ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసేలా ఉండబోతుంది. ఈ సినిమాలో అద్బుతమైన విజువల్ వండర్స్, నటీనటుల యాక్టింగ్, మంచు విష్ణు పర్ఫార్మెన్స్ అందరికీ ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

Interesting update on Kannappa Manchu Vishnu Pan India movie
Interesting update on Kannappa Manchu Vishnu Pan India movie

 

ప్రాణాన్ని పనంగా పెట్టి తీస్తున్నాం: మంచు విష్ణు

కన్నప్ప సినిమా కోసం తమ ప్రాణాలు పనంగా పెట్టి తీస్తున్నామని హీరో మంచు విష్ణు చెప్పుకొచ్చారు. మహా శివుడి ప్రియ భక్తుడైన కన్నప్పను తెరపైకి తీసుకొచ్చేందుకు మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని అన్నారు. కన్నప్ప సినిాను ఒక దృశ్య కావ్యంలా చూపించబోతున్నామని, మునుపెన్నడూ చూడని ఓ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, కన్నప్ప మొదట నాస్తికుడిగా ఉంటాడు. ఆ తర్వాత శివుడికి కన్నప్ప భక్తుడిగా ఎలా మారుతాడు. శివ భక్తుడిగా మారినప్పుడు అతనేలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

Related posts

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar