Tollywood vs Bollywood : గత రెండు సంవత్సరాల్లో టాలీవుడ్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ‘బాహుబలి‘ సినిమా చూసిన రాజమౌళి కథలో విషయం ఉండి ఎక్కువ బడ్జెట్ పెట్టగలిగే సత్తా తో క్వాలిటీ సినిమా తీస్తే వసూళ్ళు కూడా కచ్చితంగా తిరిగి రాబట్టగలం అనేది ధైర్యాన్ని అందరికీ పుట్టించాడు. దీంతో టాలీవుడ్ స్టార్స్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ను నమ్ముకుని మన దగ్గర ఉన్న కంటెంట్ పై భరోసాతో నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తున్నారు.
అందుకే ఇప్పుడు పాన్ ఇండియా సందడి టాలీవుడ్ లో ఎక్కువ అయిపోయింది. స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. తెలుగు సినిమాలు అంటే వాటితో ఢీ కొట్టేందుకు ఇతర భాషల సినిమాలు భయపడుతున్నాయి. మన సినిమాలు అన్ని భాషల్లో ఇంత తక్కువ వ్యవధిలో ఎక్కువగా విడుదల కావడం శుభపరిణామమే. అయితే భారత చలన చిత్ర సీమకు పెద్దన్న బాలీవుడ్ నుండి మాత్రం టాలీవుడ్ కి గట్టి పోటీ ఎదురు కాబోతోంది.
వివరాల్లోకి వెళితే… జూలై 2వ తేదీన అడవి శేష్ హీరోగా నటిస్తున్న ‘మేజర్‘ చిత్రం విడుదల అవుతోంది. ఈ సినిమాకి మహేష్ బాబు కి చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ సంస్థ గా వ్యవహరిస్తోంది. అయితే అదే రోజున ‘షేర్షా‘ చిత్రం బాక్సాఫీస్ ను ఢీ కొట్టబోతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ రెండూ దేశభక్తి నేపథ్యంలో నడిచే చిత్రాలే.
అలాగే జూలై 30వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం విడుదల అవుతోంది. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే అదే రోజున సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూభాయ్ కథియావాడి‘ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆలియాభట్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కొద్ది గంటల క్రితమే విడుదలైంది. సంజయ్ లీలా భన్సాలీ ఎంత పెద్ద డైరెక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అతని సినిమాలు అతి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంటాయి.
ఇక ఇవన్నీ పక్కన పెడితే ఆగస్టు 13వ తేదీన అల్లుఅర్జున్ ‘పుష్ప‘ రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను విస్తృతంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అదే రోజున జాన్ అబ్రహామ్ ‘అటాక్’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. ఇక అక్టోబర్ 13వ తేదీన రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్‘ చిత్రం విడుదల అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులు అన్న విషయం తెలిసిందే.
అయితే అక్టోబర్ 15వ తేదీన అజయ్ దేవగణ్ హీరోగా ‘మైదాన్‘ విడుదలవుతోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్‘ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సంవత్సరంలోనే ఇలా టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ పోరులు నాలుగు ఉన్నాయి. మరి చివరికి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.
This post was last modified on February 25, 2021 3:07 am
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More