NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గొట్టిపాటి ర‌వికుమార్‌కే కాదు.. ఆ ఫ్యామిలీలో మ‌రో లేడీకి కూడా టీడీపీ టిక్కెట్‌…!

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడింది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. అటు అధికార వైసిపి తో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికలో తలమునకలు అవుతున్నాయి. తెలుగుదేశం జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీలు ఎవరు ఎన్ని ? సీట్లలో పోటీ చేయాలి ఎవరు ఏయే సీట్లలో పోటీ చేయాలి అనేదానిపై ఇప్పటికే జోరుగా చర్చలు నడుస్తున్నాయి. పొత్తులోకి బిజెపి కూడా వచ్చి చేరడంతో ముందు ఒక పార్టీకి అనుకున్న సీట్లు ఇప్పుడు మారుతున్న పరిస్థితి.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ స్థానాన్ని ముందుగా జనసేనకు కేటాయించాలని చంద్రబాబు అనుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం మీద జనసేన పోటీ చేసే సీటు దర్శి అవుతుందని అనుకున్నారు. ఇక్కడ నుంచి జనసేన తరఫున గరికపాటి వెంకట్ పేరు తెరమీదకు వచ్చింది. అయితే ఇప్పుడు దర్శి స్తానాన్ని జనసేన వదులుకుంది. బిజెపితో కుదిరిన అవగాహన మేరకు జనసేన మూడు స్థానాలను వదులుకున్న సంగతి తెలిసిందే. జనసేన వదులుకున్న మూడు స్థానాలలో దర్శి ఒకటి కావడంతో ఇక్కడి నుంచి తెలుగుదేశం తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపనుంది.

దర్శి నుంచి టిడిపి అభ్యర్థిగా ఎవరు రేసులో ? ఉంటారు అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇక్కడ నుంచి గత ఎన్నికలలో కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ మారిపోయాక సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన పమిడి రమేష్ కు ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత ఆయన కూడా తప్పుకున్నారు. ఇక ఇప్పుడు దర్శిలో టిడిపి పోటీ చేస్తుందన్నది క్లారిటీ రావడంతో ఇక్కడ టిడిపి సీటు కోసం గట్టి పోటీ నెలకొంది. 2014లో దర్శి నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన సిద్ధా రాఘవరావు అనుహింగా తెరమీదకి వచ్చారు.

ఆయన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తో పాటు టిడిపిలో చేరతారని సమాచారం. దర్శి నుంచి సిద్ధా రాఘవరావు లేదా ఆయన తనయుడు సుదీర్ బాబు పేరు రేసులో ఉంది. టిడిపిలో జిల్లాకే చెందిన కొందరు కీలక నాయకులు కూడా సిద్దాను పార్టీలోకి తీసుకువచ్చి దర్శిలో పోటీ చేస్తే వైశ్య సామాజిక వర్గంలో మంచి సానుకూలత ఉంటుందని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గరటయ్య.. ఆయన కుమారుడు కృష్ణ చైతన్య కూడా దర్శి సీటు ఆశిస్తున్నారు.

కృష్ణ చైతన్యకు దర్శి సీటు ఇవ్వాలని గరటయ్య కోరుతున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కుటుంబానికి చెందిన డాక్టర్ లక్ష్మీ కూడా దర్శి టిడిపి రేసులకి అనూహ్యంగా దూసుకు వచ్చింది. గొట్టిపాటి రవికుమార్ పెదనాన్న అయినా గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు.. మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె అయిన డాక్టర్ లక్ష్మి కూడా దర్శి టిడిపి టికెట్ రేసులోకి వచ్చారు. ఆమె భర్త డాక్టర్ లలిత్, మామ డాక్టర్ వెంకటేశ్వర్లు నరసరావుపేట టిడిపిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మ‌రి ఈ ముగ్గురిలో ద‌ర్శి టీడీపీ టిక్కెట్ ఎవ‌రికి వ‌స్తుందో ? చూడాలి.

Related posts

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju