NewsOrbit
రాజ‌కీయాలు

జగన్‌పై లోకేష్ విమర్శలు

 

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: గత ఎనిమిది నెలల్లో విశాఖలో జరిగిన భూ అక్రమాలపైనా విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై సోమవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాజధానికి సంబంధం లేని భూములు కూడా ఇన్‌సైడర్ అంటూ విచారణ చేస్తామని అంటున్నారనీ, తాము విచారణకు సిద్ధమేననీ అన్నారు. జగన్ ఒక చేతగాని దద్దమ్మ అని వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అని అన్నారు. ఎనిమిది నెలల నుండి ఏమి పీకలేని వాళ్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ గాలి పోగేసి పాత పాటే పాడుతున్నారని లోకేష్ విమర్శించారు.గత ఎనిమిది నెలల్లో విశాఖలో జరిగిన భూ అక్రమాలపైనా విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు.

అమరావతిని కృష్ణమ్మ ముంచెత్తుతుందని వైసిపి నేతలు అబద్దపు ప్రచారం చేశారనీ, ఇప్పుడు నిజంగా ఈ జన ప్రవాహం అసెంబ్లీ ప్రాంతాన్ని ముంచెత్తడాన్ని చూడండి అంటూ ట్విట్టర్‌ ఖాతాలో వీడియో పోస్టు చేశారు.  మహిళలు, పిల్లలు సైతం ప్రభుత్వ నిర్బంధనాలను చేధించుకుని ఎలా వెల్లువెత్తారో చూశాక కూడా ప్రభుత్వం మొండి నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వం కాదా అని లోకేష్ ప్రశ్నించారు.

‘ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే..మరో పక్క రాష్ట్రం మొత్తం టీవిలు చూస్తుంటే.. ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది?’ అని ప్రశ్నిస్తూ అసెంబ్లీలో జగన్ నిద్రపోతున్న ఫోటోను ట్యాగ్ చేశారు.

 

Related posts

VV Lakshmi Narayana: ఏపీ రాజధాని అంశంపై జేడీ లక్ష్మీనారాయణ కేంద్రానికి కీలక వినతి

sharma somaraju

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఊరట ..జూన్ 6 వరకూ అరెస్టు వద్దు

sharma somaraju

AP High Court: మంత్రి అంబటి, మోహిత్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

sharma somaraju

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో పురోగతి .. మరో ముగ్గురు అరెస్టు

sharma somaraju

Prashant Kishor: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్ వైరల్

sharma somaraju

BRS: లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతల పరిస్థితి అంత దారుణంగా ఉంటుందా..?

sharma somaraju

TDP: టీడీపీ నేతల గృహ నిర్బంధం

sharma somaraju

Leave a Comment