ఆ కామెంట్సే ఆయనకు మంత్రి పదవిని దూరం చేసాయా..!!

Published by
Special Bureau

జూనియర్ కు కలిసొచ్చిన కొత్త జిల్లాల నిర్ణయం కొత్త మంత్రుల ఎంపికలో అసలు ఏం జరిగింది…!

ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన 15 నెలల తరువాత తొలి కేబినెట్ విస్తరణ జరిగింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా తొలి సారి గెలిచిన ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇద్దరు బీసీల స్థానంలో తిరిగి బీసీలతోనే ఆ స్థానాలను భర్తీ చేయాలని తొలుత ముఖ్యమంత్రి నిర్ణయించారు.

 

అందు కోసం ఆయన కొందరి పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. కానీ, సీఎం కోరుకున్న వారిలో ఒకరు ప్రస్తుతం కీలకమైన పదవిలో ఉన్నారు. ఆయన అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నిలవటంతో..ఆ ప్రముఖుడి పేరు చివరికి మారిపోయి..జూనియర్ కు అవకాశం దక్కింది. ఇద్దరు మంత్రులను రాజ్య సభకు పంపిన తరువాత ముందుగా ముఖ్యమంత్రి కేబినెట్ లోకి తీసుకోవాలనుకున్న వారి పేర్లు చివర్లో ఏ రకంగా మారాయి. అసలు వైసీపీ అధినాయకత్వం వద్ద కేబినెట్ విస్తరణకు ముందు జరిగిన చర్చ ఏంటి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరు మంత్రులకు ఏ రకంగా అవకాశం దక్కింది. మొత్తంగా..అసలు ఏం జరిగింది…

ఆ వ్యాఖ్యలే ఆయనకు అడ్డుగా నిలిచాయా…!!

సీఎం జగన్ తన కేబినెట్ లో ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకట రమణను రాజ్యసభకు ఎంపిక చేసిన సమయంలోనే వారిద్దరిలో స్థానంలో ఎవరిని నియమించాలనే దాని పైన ఒక అంచనాకు వచ్చారు. రకరకాల పేర్లు తెర మీదకు వస్తుండటంతో ఆ ఇద్దరూ బీసీలే కావటంతో తిరిగి బీసీలతోనే ఆ రెండు స్థానాలు ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. అందు కోసం ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో కీలక ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా..ప్రస్తుత స్పీకర్ తమ్మినేనిని కేబినెట్ లోకి తీసుకోవాలని భావించారని..డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘపతిని స్పీకర్ గా ప్రమోట్ చేయాలని భావించినట్లు విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా మోపిదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లకు చెందిన వారికి స్పీకర్ పదవి ఇచ్చి…శ్రీకాకుళం..తూర్పు గోదావరి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి తొలి చర్చల్లో వ్యక్తం చేసిన అభిప్రాయంగా తెలిసింది. కానీ, అదే సమయంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలను పెంచాలనే చర్చ రావటం..ఆ సమయంలో ధర్మాన ప్రసాద రావు అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయటం..దానికి అదే సభలో ఉన్న తమ్మినేని సైతం మద్దతిచ్చే విధంగా వ్యాఖ్యానిస్తూనే..ముఖ్యమంత్రికి మద్దతుగానూ సర్ధిచెప్పే ప్రయత్నం చేయటం పైన చర్చ సాగింది. దీంతో..మంత్రివర్గ విస్తరణకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ పరిణామంతో కేబినెట్ కొత్త బెర్తుల సమీకరణాలు మారిపోయినట్లు పార్టీ ముఖ్యులు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు.

చివరి నిమిషంలో అప్పలరాజుకు ఛాన్స్..

తొలి నుండి తనకు అండగా నిలిచిన ధర్మాన క్రిష్ణదాస్ కు ముఖ్యమంత్రి జగన్ తన తొలి కేబినెట్ లోనే మంత్రిగా అవకాశం కల్పించారు. ధర్మాన ప్రసాద రావు సీనియర్ అయినా…క్రిష్ణదాస్ కే ప్రాధాన్యత లభించింది. ఇక, శ్రీకాకుళం జిల్లాలో కళింగ సామాజిక వర్గం బలంగా ఉండటంతో ఆ వర్గానికి చెందిన తమ్మినేనికి స్పీకర్ హోదా కల్పించారు. కానీ, ఆయనను కేబినెట్ లోకి తీసుకొని..పిల్లి బోసు నిర్వహించిన శాఖలను ఇవ్వాలని తొలుత చర్చ జరిగినట్లు సమాచారం. ఇక, గుంటూరు జిల్లాకు స్పీకర్ పదవి ఇస్తుండటంతో..శ్రీకాకుళంకు మంత్రి పదవి..పిల్లి స్థానంలో వేణు లేదా పొన్నాడ సతీష్ పేర్ల మీద చర్చ జరిగింది. అదే సమయంలో ధర్మాన సోదరుల మధ్య సైతం కోల్డ్ వార్ ఉన్నట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోది. దీంతో..ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యల పైన ఆగ్రహంగా ఉన్న సీఎం..ధర్మాన క్రిష్ణదాస్ కు ప్రమోషన్ ఇచ్చారనే ప్రచారం నడుస్తోంది. ఇక..చివరి నిమిషంలో సమీకరణాలు మారి..మొత్తంగా గతంలో పని చేసి రాజ్యసభకు ఎంపికైన వారి సామాజిక వర్గాలకే తిరిగి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో..జూనియర్ అయినా డాక్టర్ అప్పలరాజుకు గెల్డెన్ ఛాన్స్ తగిలింది. అదే విధంగా గుంటూరు జిల్లాకు స్పీకర్ పదవి ఆ విధంగా నిలిచిపోయిందనే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

This post was last modified on July 28, 2020 1:44 pm

Special Bureau

Share
Published by
Special Bureau

Recent Posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More

April 27, 2024

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More

April 27, 2024

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More

April 27, 2024

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Family Star OTT Response:  భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More

April 27, 2024

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More

April 27, 2024

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్… Read More

April 27, 2024

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్… Read More

April 27, 2024

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్… Read More

April 27, 2024

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More

April 27, 2024

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More

April 27, 2024

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More

April 27, 2024

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More

April 27, 2024

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More

April 27, 2024

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More

April 27, 2024

Himaja: కట్టి పుల్లకు చీర కట్టిన వాళ్లు వదలరు.. బిగ్ బాస్ హిమజ బోల్డ్ కామెంట్స్..!

Himaja: బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు… Read More

April 27, 2024