NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram November 10 2023 episode 1096: పిల్లల కోసం వచ్చిన ఆర్య అనుని చూస్తాడా లేదా…

Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights

Prema Entha Madhuram November 10 2023 episode 1096: చెల్లెళ్ల మీద ఉన్న ప్రేమతో ఆర్య గుడ్డిగా నమ్మేశాడు,ఫ్యామిలీని తీసుకొచ్చి మన చేతిలో పెడతాడని అతనికి తెలియదు కదా, తెలిసేలోపే మన చేతిలో లాక్ అయిపోతాడు అని మానస అంటుంది. అవును అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం ఆర్య అని ఛాయా అంటుంది. కట్ చేస్తే, ఉష ట్రయల్ రూమ్ లో ఫోను ఉందేమో నేను వెళ్లి చెక్ చేస్తాను నువ్వు ఈలోపు కౌంటర్ దగ్గర అడుగు ఎవరైనా ఇచ్చారేమో అని ఆర్య అంటాడు. అలాగే అన్నయ్య అని ఉషా వెళుతుంది. ఆర్య ట్రయల్ రూమ్ దగ్గరికి వచ్చి లోపల ఎవరో ఉన్నారు అను కోని  ఎక్స్ ఎక్స్క్యూజ్మీ ట్రయల్ రూమ్ లో నా సెల్ ఫోన్ ఉందేమో చెక్ చేసి ఇస్తారా అని ఆర్య అంటాడు. ఆ గొంతు గుర్తుపట్టి అను తనకు కనపడకుండా ఫోన్ ఇస్తుంది.

Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights
Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights

ఫోన్ తీసుకొని ఆర్య థాంక్స్ అండి అని అంటాడు. అన్నయ్య ఫోన్ దొరికిందా అని ఉష అంటుంది. దొరికిందమ్మా వెళ్దాం పద అని ఉషా ని తీసుకొని వెళ్తూ ఉండగా ఉషా వెనుకకు తిరిగి చూస్తుంది, అను తొంగి చూడడం  గమనించి ఏంటో ఈ అను ప్రవర్తన ఏమీ అర్థం కావట్లేదు ఇంత పిరికితనం ఏంటి అనుకుంటూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆర్య అక్కి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంటి ఫ్రెండ్ ఈ టైం లో వచ్చావు నేను అసలు అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. చూడాలనిపించింది వచ్చాను అని ఆర్య అంటాడు. రా ఫ్రెండ్ వచ్చి కూర్చో అని అక్కి అభయ్ ని తీసుకొని కిచెన్లోకి వెళ్లి అన్నయ్య మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే అమ్మ స్నాక్స్ జ్యూస్ ఇస్తుంది కదా ఏమి ఇద్దాము అని అంటుంది.ఇంట్లో జ్యూస్ ఉంది కదా అక్కి అదే ఇద్దాము అని అభయ్ అంటాడు. అక్కి జ్యూస్ తీసుకొచ్చి తాగు ఫ్రెండ్ అని అంటుంది.

Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights
Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights

ఇప్పుడు ఇవన్నీ ఎందుకు డియర్ అని ఆర్య అంటాడు. ఇప్పుడు నువ్వు మా ఇంటికి గెస్ట్ గా వచ్చావు ఫ్రెండ్ తీసుకో అని అక్కి అంటుంది. అక్కి నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను అని ఆర్య ఇస్తాడు. అక్కి ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే తీసుకోవద్దు అని అమ్మ చెప్పింది కదా అని అభయ్ అంటాడు. అన్నయ్య ఎవరైనా ఇస్తే తీసుకోవద్దు అన్నది ఫ్రెండ్స్ కాదు అని అక్కి తీసుకుంటుంది. అభయ్ నీ కూడా తెచ్చాను కావాలంటే మీ అమ్మతో నేను మాట్లాడతాను తీసుకో అని ఆర్య ఇస్తాడు. థాంక్యూ ఫ్రెండ్ అని ఇద్దరు అంటారు. ఇద్దరు ఒకసారి ఈ డ్రెస్సులు వేసుకొని రండి అని ఆర్య అంటాడు. పిల్లలిద్దరూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ లోకి వెళ్తారు. ఇంతలో అను వచ్చి చూసేసరికి ఆర్య సోఫాలో కూర్చొని ఉంటాడు.  ఆర్యని చూసిన అను భయపడి బయటే నిలబడుతుంది. ఎవరో వచ్చినట్టు అనిపించడంతో ఆర్య గుమ్మం వైపు తొంగి చూస్తాడు.

Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights
Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights

ఎవరు కనిపించరు. ఇంతలో అభయ్ అక్కి డ్రెస్సులు వేసుకొని వస్తారు. ఈ డ్రెస్సులు మీకు చాలా బాగున్నాయి అక్కి అని ఆర్య అంటాడు. ఫ్రెండ్ ఒక సెల్ఫీ దిగుదామా అని అక్కి అంటుంది. అలాగే అని ఆర్య వాళ్లతో సెల్ఫీలు దిగుతాడు. కిటికీలో నుంచి చూస్తూ అను సంతోషపడుతుంది. అక్కి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను వెళ్తున్నాను అని ఆర్య అంటాడు. మళ్లీ ఎప్పుడొస్తావు ఫ్రెండ్ అని అక్కి అంటుంది. మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వస్తాను అని ఆర్య వెళ్ళిపోతాడు. ఆర్య వెళ్ళిపోగానే అను ఇంట్లోకి వస్తుంది. అమ్మ నువ్వు ఎప్పుడూ లేటే ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చి వెళ్ళాడు. ఎందుకమ్మా నువ్వు రావడం ఇంత లేట్ అయింది ఎక్కడికి వెళ్లావు అని అభయ్ అంటాడు. జాబ్ చేస్తున్నాను కదా నాన్న అందుకే లేట్ అయింది. ఇకనుంచి నువ్వే చెల్లని చూసుకోవాలి అని అను అంటుంది. అలాగే అమ్మ అని అభయ్ అంటాడు. కట్ చేస్తే, సుగుణ వాళ్ళ ఇంట్లో అందరూ ఆరు బయట కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. సూర్య నీకు గుర్తుందా నాన్న అమ్మమ్మ వచ్చినప్పుడు వెన్నెల్లో నీకు అన్నం తినిపిస్తూ ఉండేది నిన్ను పట్టుకోలేక నా కాళ్లు నొప్పులు పుట్టేవి అని సుగుణ అంటుంది, అవునా అమ్మ అంటూ ఆర్య నవ్వుతాడు.

Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights
Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights

ఇక జ్యోతి ఏమో పొద్దుందాక ఆడుకొని నైట్ నిద్రపోకుండా నన్ను తిప్పలు పెట్టేది, అప్పుడు నువ్వే వచ్చి చెల్లెను ఎత్తుకొని నిద్రపుచ్చేవాడివి అని సుగుణ అంటుంది. అమ్మ దివ్యక్క గురించి కూడా చెప్పు అని ఉష అంటుంది. ఇక దాని సంగతి అంటావా చిన్నప్పటి నుంచి చాలా మొండిఘటం జ్యోతికి ఒక్క చాక్లెట్ ఇస్తే నాకు రెండు చాక్లెట్లు కావాలని అల్లరి చేసేది, అన్నయ్య తన చాక్లెట్ ఇచ్చి తనను ఊరుకోబెట్టేవాడు , వాడు వాళ్లతో ఆడుకున్నాడు కానీ నీతోటే గడపలేకపోయాడమ్మా నువ్వు పొట్టలో ఉన్నావు అప్పటికే వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని సుగుణ అంటుంది. అందుకే ఇప్పుడు అన్నయ్యకు నేను ఇంత క్లోజ్ గా ఉంటున్నాను అని ఉష అంటుంది. చూడు దివ్య అక్క తినడమే కాదు వంట కూడా కాస్త నేర్చుకో లేదంటే మీ అత్తయ్య హరిలో రంగ హరి అని అంటుంది.

Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights
Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights

రోజులు గడిచిపోతున్నాయి పెళ్లి సమయం దగ్గర పడుతుంది పెళ్లి పనులు చేయాలి డబ్బులు ఏమో తక్కువగా ఉన్నాయి ఉన్నదాంట్లో చేద్దామంటే వీడేమో గొప్పగా చేద్దాం అంటున్నాడు అని సుగుణ అంటుంది. గొప్పలకు పోయి అప్పు చేసి తర్వాత తిప్పలు పడకండి పెళ్లి చేసిన తర్వాత నీవల్లే మాకు అప్పైందని జ్యోతి అక్కని తిట్టినట్టు నన్ను తిట్టకండి నేను మాత్రం మాటలు పడను అంటూ దివ్య లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మాటకి జ్యోతి అన్నం తినడం మానేసి చేయి కడుక్కుంటుంది.

Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights
Prema Entha Madhuram today episode november 10 2023 episode 1096 highlights

అదేంటి జ్యోతి తినకుండా వెళ్ళిపోతున్నావు అని సుగుణ అంటుంది. పుట్టింట్లో పడి తింటున్నాను కదా అమ్మ ఎవరు ఏమన్నా పడాలి అని జ్యోతి బాధతో అంటుంది. అమ్మ జ్యోతి దివ్య పెళ్లి అయిపోగానే నిన్ను కూడా అత్తవారింటికి పంపిస్తాను అని ఆర్య అంటాడు. నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది కానీ ముందు దాని పెళ్లి గురించి చూడండి అంటూ జ్యోతి లోపలికి వెళ్ళిపోతుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N