NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ… తేనె మనసులు సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా దర్శకుడు అదుర్తి అబ్బారావు ఈ సినిమాని తెరకెక్కించారు. కృష్ణ, రామ్మోహన్ ఇద్దరు ఈ సినిమాలో కథానాయకులుగా నటించారు. ఇక ఈ సినిమాలో అందరూ కొత్తవారే కావడం విశేషం. కొత్తవారిని తీసుకోవడం కూడా ఒక వార్త ప్రకటన ఇచ్చి అందులో వచ్చిన ఫోటోల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకున్నారు డైరెక్టర్. ఇక అతనికి సహాయ దర్శకుడిగా పని చేసిన కే విశ్వనాధ్ కృష్ణ కి మేకప్ వేయించి ఫోటో తీసిన సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. ఇక అప్పట్లో మూగమనసులు సినిమా విడుదలై పెద్ద విజయం సాధించింది. కృష్ణ తెనాలి లో ఉంటూ ఈ సినిమా చూసి చాలా బాగుంది. పనిచేస్తే అటువంటి దర్శకుడితో పని చేయాలని అనుకున్నారు.

Super Star Krishna, Ram Mohan bonding
Super Star Krishna, Ram Mohan bonding

ఇక అదే సమయంలో బాబు మూవీస్ వారు వార్త పత్రికలో ఒక పెద్ద ప్రకటన ఇచ్చారు. తేనె మనసులు సినిమాని కొత్త వాళ్లతో తీయాలని అనుకుంటున్నామని.. అందుకు ఫోటోలని పంపాలని.. ఎవరిని ప్రత్యక్షంగా వద్దని ఆ ప్రకటన లో ఉంటుంది. ఇక చాలామందితో పాటు కృష్ణ కూడా తన ఫోటోలను పంపించారు. అలా సెలెక్ట్ అయిన వారిలో కృష్ణతోపాటు రామ్మోహన్ కూడా ఉన్నారు. సినిమా మొదలు పెట్టేముందు తేనె మనసులు సినిమా కోసం సెలెక్ట్ అయినా నటీనటులు అందరు చేత రిహాసల్స్ చేయించారు. కృష్ణకి రామ్మోహన్ కి డాన్సులు కూడా నేర్పించారు. అలా ఆ సినిమా చిత్రీకరణకు వెళ్లేముందు అందరి కి శిక్షణ ఇచ్చారు. సినిమా చిత్రీకరణ ముందు గా నలుపు, తెలుపులో తీశారు.

కానీ డైరెక్టర్ అబ్బారావు తరువాత ఆలోచించి కొత్త వాళ్లతో తీస్తున్నాం కాబట్టి.. ఖర్చు ఎక్కువ వద్దు అని మొదటి తీసిన నాలుగు రీళ్లు పక్కన పెట్టేసి.. మళ్లీ మొదటి నుంచి చిత్రీకరణ చేపట్టారు. చిత్రీకరణ ప్రారంభం అయిన తరువాత కృష్ణ కన్నా.. రామ్మోహన్ బాగా చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ సెట్ లో అవేమీ పట్టించుకోకుండా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు. సినిమా పూర్తయిన అనంతరం చాలా అంచనాల మధ్య 1965 మార్చ్ 31న విడుదలైంది. ఇక‌ సినిమా మొదటి రోజు నుంచి మంచి టాక్ రావడంతో ఇది 100 రోజులు ఆడుతుందని చెప్పేశారు.

Super Star Krishna, Ram Mohan bonding
Super Star Krishna, Ram Mohan bonding

అలాగే సినిమా కూడా గొప్ప విజయం సాధించింది. కృష్ణతో పాటు రామ్మోహన్ కి కూడా మంచి పేరు దక్కింది. కానీ ఇందులో తర్వాత రామ్మోహన్ అంతగా నిలదొక్కుకోలేకపోయాడు. కృష్ణ మాత్రం సూపర్ స్టార్ అయ్యాడు. కానీ తనతో మొదటి సినిమా చేసిన రామ్మోహన్ ని కృష్ణ ఎప్పుడు గుర్తు పెట్టుకుని తాను చేసిన చాలా సినిమాలలో రామ్మోహన్ కి ఒక ప్రధానమైన పాత్ర ఇచ్చి అతను నిలదొక్కుకునేందుకు సహాయపడ్డాడు. అలాగే అది తనకి ఆర్థికంగా స్థాయి పడడానికి ఎంతో సహాయం చేశారు. వాళ్లందరూ మొదటి సినిమాలో ఎంత స్నేహంగా ఉండేవారు అలాగే ఎన్నో సంవత్సరాలు వారి స్నేహం అలానే కొనసాగింది. అలా ముందుగా రామ్మోహన్ కి మంచి పేరుతో ప్రచారం జరిగినప్పటికీ సినిమా విడుదలైన అనంతరం మాత్రం కృష్ణకి సూపర్ స్టార్ గా పేరు వచ్చింది.

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N