NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

రాజ‌కీయాల్లో సీనియ‌ర్లు ఉంటారు. జూనియ‌ర్లూ వ‌స్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త నీరు పారుతూనే ఉంటుంది. ఇది అవ‌స‌రం కూడా. కానీ, కొన్ని కొన్ని సార్లు జూనియ‌ర్లు స‌క్సెస్ కాలేక పోవ‌డం తెలిసిందే. ఎందుకంటే.. ప్ర‌జ‌ల అభీష్టాలు అలా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణ‌లో కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రిగా అంగీక‌రిం చిన ప్ర‌జ‌లు గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలిస్తే.. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తార‌న్న వాద‌న‌తో ఎందుకో,.. కాంప్ర‌మైజ్ అయ్యారు. ప‌లితంగా బీఆర్ ఎస్ ఓట‌మి త‌ప్ప‌లేదు.

అంటే.. సీనియ‌ర్‌గా ఉన్న కేసీఆర్‌ను న‌మ్మిన‌ట్టుగా కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిగా ప్ర‌జలు స్వీక‌రించ‌లేక పోయారు. దీనికి కార‌ణాలు ఏంట‌నేది చూడ‌లేం. ఇప్పుడు ఏపీలోని విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం లోనూ ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూట‌మి అభ్య‌ర్థిగా టీడీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ఉన్నారు. ఇక‌, వైసీపీ నుంచి యువ నాయ‌కుడు.. వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఉన్న దేవినేని అవినాష్ ఉన్నారు.

వీరిద్ద‌రూ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారే.. సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉన్న కుటుంబాలే. కానీ, ప్ర‌స్తుతం ఏపీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు కావొచ్చు.. ముఖ్యంగా అభివృద్ధి చెందాల్సిన ప‌రిస్థితిలో ఉన్న తూర్పు నియోజ‌క‌వ‌ర్గం కార‌ణం కావొచ్చు.. ఇక్క‌డి ప్ర‌జ‌లు అనుభ‌వానికి పెద్ద పీట వేస్తున్నారు. అంటే.. సీనియ‌ర్ అయిన గ‌ద్దె రామ్మోహ‌న్ వైపు మెజారిటీ ప్ర‌జ‌లు నిలుస్తున్నార‌నేది ఇక్క‌డ జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఆయ‌న‌కు పార్టీల‌తో ప‌నిలేకుండా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, అవినాష్ విష‌యానికి వ‌స్తే..ఆ య‌న యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడు. దేవినేని నెహ్రూ వార‌సుడు అనే కోణంలో ప్ర‌జ‌ల్లో ఎప్ప‌టికీ ఆద‌ర‌ణ ఉంది. కానీ.. ఇప్ప‌టి వ‌రకు చూసుకుంటే.. మాత్రం ఈసారికి.. సీనియ ర్ వైపే మొగ్గు చూపుతున్న ప‌రిస్థితి స్ప‌స్టంగా క‌నిపిస్తోంది. `అవినాష్‌కు మేం వ్య‌తిరేకం కాదు. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో సీనియ‌ర్ నాయ‌కుడు కావాల‌ని కోరుకుంటున్నాం` అని మెజారిటీ క‌మ్మ సామాజిక వ‌ర్గం కోరుకుంటున్న ప‌రిస్థితి తూర్పులో క‌నిపిస్తోంది.

అవినాష్‌లో ఇంకా రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త రావాల‌ని.. గ‌ద్దెతోనే తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చే 5 – 10 ఏళ్ల‌లో భ‌విష్య‌త్తు క‌న‌ప‌డుతోంద‌ని న‌మ్మేవారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ సారి అవినాష్ ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు మ‌ళ్లీ గ‌ద్దేనే కోరుకుంటోన్న వాతావ‌ర‌ణం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

Related posts

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N