ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాని వేణు శ్రీరాం తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు…బోనీకపూర్ సహ నిర్మాతగా ఉన్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెడతాడని సమాచారం.
ఇక ఈ సినిమా పూర్తవగానే శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే చేయని ఒక కొత్త క్యారెక్టర్ ని ఈ సినిమాలో చేస్తున్నాడు. క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా పీరియాడికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతుంది. మొఘలుల కాలం నాటి కథ ఎంచుకున్న క్రిష్ పవన్ కెరీర్ లో ఒక గొప్ప సినిమాగా నిలబడేలా రూపొందిస్తున్నాడట. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దొంగగా కనిపిస్తాడని తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకి ముందు నుంచి విరూపాక్ష అన్న టైటిల్ ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. అయితే అధికారకంగా మాత్రం ఇంకా టైటిల్ ఇదే అని చిత్ర యూనిట్ వెల్లడించలేదు. ఇంతలోనే మరో రెండు టైటిల్స్ ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
క్రిష్ తెరకెక్కించే కథ కి అందులో పవన్ కళ్యాణ్ పాత్ర తీరు తెన్నులకి గజదొంగ లేదా బందిపోటు అనే టైటిల్స్ అయితే సూటవుతాయన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఈ రెండు టైటిల్స్ తో సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆ కాలంలో సూపర్ హిట్స్ గా నిలిచాయి. కాని ఆ కాలానికి తగ్గట్టు అప్పట్లో ఆ టైటిల్ ట్రెండ్ అయి ఉండొచ్చు గాని ప్రస్తుతం ఈ జనరేషన్ కి ..ట్రెండ్ కి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఈ టైటిల్స్ సూటవవేమో అన్న అనుమానాలు ఫ్యాన్స్ లో కలుగుతున్నాయట. వాస్తవంగా చూస్తే ట్రెండ్ కి తగ్గట్టు కొత్త తరహా టైటిల్స్ నే ఫ్యాన్స్ గాని ప్రేక్షకులు ఆశిస్తారు. మరి ఈ టైటిల్స్ విషయం వాస్తవమా కాదా అన్నది మేకర్స్ వెల్లడిస్తేనే నమ్మగలం.
This post was last modified on July 9, 2020 10:30 am
Nagarjuna: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'కుబేర' సినిమా నుంచి అక్కినేని నాగార్జున ఫస్ట్ లుక్ విడుదలైంది. తమిళ హీరో… Read More
Guppedanta Manasu May 2 2024 Episode 1064: మహేంద్ర అనుపమ వసుధార ఒక లాయర్ ని తీసుకుని మను… Read More
Mamagaru May 2 2024 Episode 200: హోల్సేల్ గా ఎంతకు అమ్ముతావో చెప్పు కొంటాను అని చంగయ్య అంటాడు.… Read More
Jagadhatri May 2 2024 Episode 220: దేవా జగదాత్రి వాళ్ళని షూట్ చేస్తాడు. జగదాత్రి కేదార్ దాక్కుంటారు. ఉన్నక్కా… Read More
YSRCP: రాజధాని ప్రాంతంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎన్నికల వేళ మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. పల్నాడు… Read More
Naga Panchami: జ్వాలా వాళ్ళ ఇంట్లోకి చేరుకున్న గరుడ రాజు నిద్రిస్తున్న జ్వాలా గర్భంలోకి సూక్ష్మ రూపంగా మారి ప్రవేశిస్తాడు.తెల్లవారింది… Read More
Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: కరుణ బలవంతంగా అమరేంద్ర గదిలోకి భాగమతిని నెట్టేస్తుంది. సారీ… Read More
Malli Nindu Jabili May 2 2024 Episode 637: ఆ టాబ్లెట్లు మార్చింది నేను వాడిని అడిగితే వాడికి… Read More
Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ మనం ఇలా మళ్లీ కలుస్తామని నేను అసలు అనుకోలేదు చాలా… Read More
AP Elections 2024: జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కేసులో కూటమికి హైకోర్టులో ఊరట లభించలేదు. జనసేనకు కేటాయించిన… Read More
Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: అభి చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది మంగమ్మ కేసు పెడితే… Read More
Trinayani May 2 2024 Episode 1229: అసలు నీడ వచ్చిందని సీసీ కెమెరాలు చూద్దామంటే సీసీ కెమెరాలు సాయంత్రం… Read More
OTT: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమాలలో మంజుమ్మల్ బాయ్స్ కూడా… Read More
Happy Ending OTT: యశ్ పురి, అపూర్వ రావ్ హీరో మరియు హీరోయిన్గా నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం… Read More
Aha OTT: అభినవ్, గోమట్టం టైటిల్ పాత్రలో నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటిటిలో రికార్డు వ్యూస్ సాధిస్తుంది.… Read More