NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

Brahmamudi Today Episode May 1 2024 Episode 398 highlights

Brahmamudi May 1 2024 Episode 398: అనామిక చేసిన పనికి ఇంట్లో అందరూ అనామిక మీద కోప్పడతారు దాంతో అనామిక కోపంగా వెళ్ళిపోతుంది. అనామిక రూంలోకి వెళ్తుంటే స్వప్న చిటిక వేసి పిలుస్తుంది. ఏంటి చెల్లిని అరెస్ట్ చేయించేటప్పటికి నీకు మాట పడిపోయిందా అంటుంది అనామిక. అరెస్ట్ చేయించి ఏం సాధించావు అని అంటుంది స్వప్న. ఇకమీదట కల్యాణప్పుని కలవకుండా ఉంటాడు అని అంటుంది అది నీ బ్రమే అని అంటుంది స్వప్న. చూస్తావుగా ఒక చంప దెబ్బ కొట్టినందుకే కళ్యాణ్ అప్పుల పరిస్థితి ఎలా ఉందో, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని స్వప్న దగ్గర మాట్లాడుతుంది అనామిక దాంతో అవునా ఒక్క చెంప దెబ్బ కొట్టినందుకే ఇదంతా చేసావా, అని స్వప్న అనామిక చంప పగలగొడుతుంది. నా చెల్లిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినందుకు ఈ దెబ్బ అని అంటుంది దాంతో అనామిక కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది కానీ స్వప్న చెయ్యి పట్టుకొని, నీకు అంత లేదమ్మా, ఇంకొకసారి నా చెల్లెలు జోలికి వెళ్తే నేనైనా ఒక దెబ్బతో సరిపెట్టాను అది సీల్ రాకాసి చీరేస్తుంది అని వార్నింగ్ ఇస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు అని అనామికకు చెప్పి వెళ్ళిపోతుంది. అనామిక కోపంగా రూమ్ లోకి వెళ్తుంది అప్పటికే కళ్యాణ్ అప్పు తో ఫోన్ మాట్లాడుతుంటాడు.

Brahmamudi Today Episode May 1 2024 Episode 398 highlights
Brahmamudi Today Episode May 1 2024 Episode 398 highlights

ఇక అనమిక రూంలోకి వచ్చేసరికి అప్పు కి కాల్ చేస్తాడు కళ్యాణ్. ఇంత జరిగినా ఇంకా నువ్వు ఫోన్ చేస్తున్నావ్ ఏంటి అని అంటుంది అప్పు. మనం ఏ తప్పు చేయలేదు కదా అందుకే ఫోన్ చేశాను అయినా ఫోన్ చేయకపోతే తప్పు గాని చేస్తే తప్పేంటి అని అంటాడు. సరే నాకు నిద్ర వస్తుంది అని అంటుంది అప్పు నా వల్ల పోలీస్ స్టేషన్ కి వచ్చావు కదా సారీ అని అంటాడు. నేనొక్కదాన్నే వెళ్లినట్టు అయితే నీ సంగతి చెప్పేదాన్ని కానీ నాతో పాటు నువ్వు పోలీస్ స్టేషన్కు వచ్చావు కాబట్టి నేను ఏం అనలేకపోతున్నాను అని అంటుంది అప్పు. దాంతో కళ్యాణ్ నవ్వుతాడు అనామిక అదంతా చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది. సరే బ్రో గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్. పక్కకు తిరిగేసరికి అనామిక ఉంటుంది. సిగ్గు లేదా నీకు ఇంకా ఫోన్ మాట్లాడుతున్నావా అని అంటుంది. అవును మాట్లాడతాను మాట్లాడితే తప్పేముంది అని అంటాడు. అయినా ఇప్పుడు నేను మాట్లాడితే నువ్వు ఏం చేస్తావు మహా అయితే అరెస్ట్ చేస్తావా అంతే కదా అరెస్ట్ చేసుకో అని అంటాడు. అపు విషయంలో ఎవరు చెప్పినా నువ్వు చెప్పినా ఎవ్వరు చెప్పినా కానీ నేను వినను అని అనామిక గట్టిగా వార్నింగ్ ఇస్తాడు కళ్యాణ్. పెళ్లికి ముందు నువ్వు చెప్పిన మాటలు విని నేను అవన్నీ నిజమని నీ ప్రేమలో పడ్డాను కానీ అదంతా భ్రమ అని నేను మోసపోయానని నాకు ఇప్పుడు అర్థమైంది జీవితంలో ఎప్పటికీ నిన్ను క్షమించను అని అనామికతో మొహం మీద చెప్పేసి వెళ్లిపోతాడు కళ్యాణ్. అనామిక ఎలా నన్ను క్షమించు అది చూస్తాను అని అనుకుంటుంది.

Brahmamudi Today Episode May 1 2024 Episode 398 highlights
Brahmamudi Today Episode May 1 2024 Episode 398 highlights

ఇక కావ్య వంటింట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి రుద్రాణి వచ్చి ఏంటి ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్నావు అంతా అయిపోయినట్టు చాలా కూల్ గా ఉన్నావు అని అడుగుతుంది. మీరు ప్రశాంతంగా ఉంచారు కదా అని అంటుంది కావ్య. నీ చెల్లెల్ని కళ్యాణ్ విడిపించే సరికి అంతా అయిపోయింది అనుకుంటున్నావా అని అంటుంది. ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అంటుంది. ఇంకా రాజ్ కి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి నిజం చెప్పడానికి అని అంటుంది. దాని గురించి నువ్వు ఏమన్నా ప్లాన్ చేసావో లేదో తెలుసుకుందామని అని అంటుంది. నేనేం ప్లాన్ చేయాలో మీరే చెప్పండి అని అంటుంది కావ్య. అంటే బయట కూడా ఏమన్నా ఇల్లు చూసుకున్నారో లేదో అని అంటుంది ఇల్లు ఎందుకు చూసుకోవడం అని అడుగుతుంది కావ్య. ఇంకో రెండు రోజుల్లో మీ అత్తగారింట్లో నుంచి బయటికి పంపిస్తుంది కదా అప్పటికప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే కష్టం రాజకీయ ఆత్మ అభిమానం ఎక్కువ నీకు పొగరు ఎక్కువ పుట్టింటికి ఎట్లాగు వెళ్లలేరు అలాంటప్పుడు ఇంకో ఇంట్లో ఉండడానికి ఇల్లు చూసుకోవాలి కదా అని అంటుంది. ఏదో పెద్ద దాన్ని నాకు తోచిన సలహా ఇస్తున్నాను అని అంటుంది. మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని మీరు బాగా ఆశపడుతున్నట్లు ఉన్నారు అని అంటుంది కావ్య మీరు అనుకున్నది ఏదీ జరగదు లేండి అని అంటుంది. అంటే మీ అత్తగారిని ఎదిరించి ఇక్కడే ఉంటావా అని అంటుంది నా భర్త కోసం మా అత్త గారిని ఎదిరించడం, కాదు అవసరమైతే ఆ దేవుడితో కూడా పోరాడుతాను అని అంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే దయ్యాలను కూడా ఎదిరిస్తాను అని రుద్రాణి వైపు చూసి అంటుంది. రుద్రాణి నవ్వుతుంది లోపల బాగా కాలుతున్న పైకి నవ్వడం మీకు ఎలా అలవాటయింది అని అంటుంది. మీ అసలు నవ్వు మీ అసలు ముఖం ఇంట్లో జనానికి చూపించాలి అని అంటుంది కావ్య. అది నీ వల్ల కాదులే అని అంటుంది రుద్రాణి. చూస్తారు త్వరలోనేనా భర్త నిర్దోషిని చేసి మీ నిజమైన ముఖాన్ని ఇంట్లో అందరికీ చూపిస్తాను. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూస్తాను అని అంటుంది రుద్రాణి. వెళ్తూ వెళ్తూ లైట్ ఆపేసి వెళ్ళండి అని వెళ్ళిపోతుంది కావ్య.

Brahmamudi Today Episode May 1 2024 Episode 398 highlights
Brahmamudi Today Episode May 1 2024 Episode 398 highlights

ఇక మరోవైపు తెల్లవారేసరికి రాజ్ బిడ్డని నిద్రపుచ్చుతూ ఉంటాడు. మరోవైపు రాజ్ డ్రైవర్ చాలా రోజుల తర్వాత రాజు కారుని క్లీన్ చేస్తూ ఉంటాడు. కావ్య కూడా పక్కనే మొక్కలకు నీళ్లు పెడుతూ ఉంటుంది. ఏమండీ ఒకసారి ఇటు రండి అని రాజ్ ని పిలుస్తుంది. ఏంటి అని అంటాడు ఈ మొక్క మీరే కదా నాటింది అని అంటుంది అవును అని అంటాడు. చూశారా మీరు చెప్పకుండా నాకు ఎలా తెలిసిందో ఈ మొక్క పక్కనే ఇంకో చిన్న మొక్క వచ్చిందండి మీ జీవితంలోకి ఈ బాబు వచ్చినట్టు అని అంటుంది. మీ ఆడవాళ్లు ఎక్కడ తిరిగినా గాని చివరికి మీరు అనాల్సిన మాట దగ్గర అనేసి ఊరుకుంటారు కదా అని అంటాడు. రాజ్ బిడ్డను నిద్రపుచ్చడానికి పక్కకు వెళ్తాడు. అప్పుడే డ్రైవర్ కార్ లో నుంచి ఒక బుక్ ని తీసి పక్కన పడేస్తాడు సౌండ్ కి కావ్య పక్కకు తిరుగుతుంది. అదేంటి అని అడుగుతుంది ఏమో మేడం తెలీదు. కారు చాలా రోజుల నుంచి క్లీన్ చేయట్లేదు కదా ఈ లోపల ఉంది బయట పడేసాను అని అంటాడు. సరే నీ పని చూసుకో నేను చూస్తాను అని కావ్య బొకే దగ్గరికి వెళ్లి బొకే ని చూస్తుంది. దానిమీద మైడియర్ కళావతి హ్యాపీ అనివర్సరీ అని రాసి ఉంటుంది. దాంతో ఒక్కసారిగా కళావతి షాక్ అవుతుంది. ఈ ఒకే మా ఆయన నా కోసం తీసుకున్నాడు అంటే మా యానివర్స్ డే రోజు ఈ ఒకే కొన్న తర్వాత ఆఫీస్ కి వెళ్ళాడు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బిడ్డను తీసుకొని వచ్చాడు. అంటే ఆఫీస్ లోనే ఏదో జరిగింది మనం ఆఫీస్ కి వెళ్లి కనుక్కుంటే అంతా తెలిసిపోతుంది. ఈ బొకే కొన్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అని కావ్య ఆ బొకేని జాగ్రత్తగా లోపలికి తీసుకు వెళుతుంది.

Brahmamudi Today Episode May 1 2024 Episode 398 highlights
Brahmamudi Today Episode May 1 2024 Episode 398 highlights

ఇక మరోవైపు అనామిక ధాన్య లక్ష్మి ఎదురెదురు పడతారు అనామికని చూసి కూడా ధాన్య లక్ష్మి కోపంగా వంటగదిలోనికి వెళ్ళిపోతుంది కాఫీ పెట్టుకుందాం అనుకునే టయానికి అనామిక వచ్చి నేను పెడతాను అత్తయ్య అని అంటుంది. వద్దులే మళ్ళీ నీ చేత కాఫీ పెట్టించుకున్నందుకు నన్ను కూడా జైల్లో వేస్తావేమో అని అంటుంది అదేంట అత్తయ్య నేను అసలే బాధలో ఉంటే మీరు కూడా నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు అని అంటుంది ఏం అర్థం చేసుకోవాలి నిన్ను, నా కొడుకు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక మాట కూడా అనకుండా వాడికన్నా నీకే ఎక్కువ సపోర్ట్ చేశాను అలాంటిది వాన్ని తీసుకెళ్లి జైల్లో కూర్చో పెట్టావు. మరి ఏం చేయమంటారు అప్పుతో తిరుగుతుంటే అని అంటుంది అనామిక తిరుగుతుంటే నాతో చెప్పాలి అంతేకానీ నేనొక దాన్ని ఉన్నానన్న విషయం మర్చిపోయా నా పెంపకాన్ని ప్రశ్నిస్తూ అని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు వాడిని ఎక్కడికి తీసుకెళ్తాను అని చెప్పి వారం రోజులు కూడా ఎండి సీట్లో కూర్చొని ఒక ముందే వాడిని తీసుకెళ్లి జైల్లో కూర్చో పెట్టావు. చూడు అనామిక నువ్వు సారీ చెప్పడం కాదు నేనే నీకు సారీ చెప్తున్నాను జీవితంలో నేను నిన్ను క్షమించలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యం.ఇక దాంతో అనామిక బాధగా దీనందిటికి కారణం రుద్రాణి ఆవిడ పని చెప్పాలి అని అనుకుంటుంది.

Brahmamudi Today Episode May 1 2024 Episode 398 highlights
Brahmamudi Today Episode May 1 2024 Episode 398 highlights

ఇక మరోవైపు సుభాష్ సీతారామయ్య దగ్గరికి వచ్చి మన షాపులని రోడ్డుకి అడ్డంగా ఉన్నాయని ఒక మూడు అడుగుల లోపలికి జరుపమంటున్నారు అని అంటే దానికి సీతారామయ్య మనం ఆల్రెడీ లోపలికే కట్టుకున్నాం కదా నువ్వు ఒకసారి కలెక్టర్ తో మాట్లాడు అని అంటాడు దానికి సుభాష్ నేను అందుకే డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తున్నాను అని అంటాడు దాంతోపాటు స్వప్న కి ఇచ్చిన షాపుల కూడా మూడు అడుగులు లోపలికి జరపాలి అని అన్నారు ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్లి మాట్లాడుతాను అని అంటే సరే అంటాడు సీతారామయ్య. దాంతో స్వప్న కిందకి రాగానే నువ్వు వెళ్లి నీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ పట్టుకురామ్మా మనం షాపు గురించి మాట్లాడాలి కలెక్టర్ దగ్గర అని అంటాడు. సరే అని డాక్యుమెంట్స్ కోసం వెళ్తుంది ఇక పక్కనే ఉన్న రుద్రాణి రాహుల్ ఇద్దరు ఇప్పుడు దానికి డాక్యుమెంట్స్ కనిపించవు కదా మమ్మీ ఏం చేద్దాం అని అంటాడు మనం ఏం చేయక్కర్లే జరుగుతూ ఉంటాయి చూస్తూ ఉండు అని అంటుంది. ఎంత వెతికినా డాక్యుమెంట్స్ కనిపించావు కిందకు వచ్చి డాక్యుమెంట్స్ కనిపించట్లేదు నేను అక్కడే పెట్టాను అని అంటుంది. దానికి ఇంట్లో అందరూ షాక్ అవుతారు సరిగ్గా చూసావా అక్క అని అంటుంది కావ్య చూశాను కావ్య అవేమైనా నల్లపూస ఒకటికి నాలుగు సార్లు వెతకడానికి డాక్యుమెంట్స్ అని అంటుంది. ఇంకొకసారి వెళ్లి చూడు అక్క అని అంటుంది ఇంతలో రుద్రాణి వచ్చి అసలు డాక్యుమెంట్స్ స్వప్న పేరు మీద రాయడమే తప్పు ఆ డాక్యుమెంట్స్ ఏదో నాకు నా కొడుకు రాహుల్కో ఇచ్చినట్టు అయితే జాగ్రత్తగా ఉంచే వాళ్ళం అని అంటుంది దాంతో ఇందిరాదేవి కోపంగా మీరిద్దరేమైనా కడుపుతో ఉన్నారా ఏంటి ఆస్తి రాసి ఇవ్వడానికి అని అంటుంది. మరి ఇప్పుడు చూసావు కదా అమ్మ స్వప్న డాక్యుమెంట్స్ ఎక్కడో పడేసింది అసలు పడేసిందో లేదంటే తాకట్టు పెట్టుకుందో అని అంటుంది. దాంతో కావ్య కోపంగా ఆమెతో ఆకట్టు పెట్టుకున్న విషయం మీకు ఎలా తెలుసు డాక్యుమెంట్స్ కనిపించట్లేదు మాత్రమే అంతేకానీ ఇక్కడ ఆస్తి ఎక్కడికీ పోలేదు కదా మీకు తాకట్టు పెట్టుకుంది అన్నమాట ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. దాంతో రుద్రాణి నేనంటుంది మీ అక్కకి జాగ్రత్త లేదు కదా ఏం చేసిందో ఏంటో అని అంటుంది దాంతో ఇంకొకసారి వెతకమని కావ్య స్వప్నని పంపిస్తుంది. స్వప్న వెతకడానికి పైకి వెళ్తుంది ఇక రుద్రాణి రాహుల్ పక్కకు వెళ్తారు. చూడు రాహుల్ ఇదే మనకు కరెక్ట్ అయిన సమయం ఆ స్వప్న కోటి రూపాయలు అప్పు తీసుకున్నట్లు మనం కనుక ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే ఇప్పుడు వాళ్లు స్వప్నని బయటికి గెంటేస్తారు నువ్వు వెళ్లి ఆ సేటు ఎక్కడున్నాడో కనుక్కొని వాణ్ణి తీసుకొని రా ఇక్కడికి అని అంటుంది దాంతో సరే అని అక్కడి నుంచి రాహుల్ పక్కకు వెళ్తాడు అప్పుడే రుద్రాణి అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది అక్కడ ఎవరు ఉన్నది మనకు చూపించరు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో రాజ్ సుభాష్ దగ్గర 10 లక్షలు తీసుకుంటాడు సుభాష్ 10 లక్షలు ఇస్తూ ఇంత డబ్బు ఇవ్వడం అవసరమా ఒకసారి ఆలోచించు అంటే డబ్బు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తే అందరి ముందు పరువు పోతుంది కదా అని అంటాడు ఇక్కడతో ఇది ఆగదు కదా అని అంటే మనం చేసేదేం లేదు అని అంటాడు అదంతా కావ్య పైనుంచి చూస్తూ ఉంటుంది. ఈయన డబ్బులు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు ఈయనని ఫాలో అయితే అన్ని విషయాలు తెలిసిపోతాయా బాబు తల్లికి డబ్బు ఇవ్వడానికి వెళ్తున్నాడు ఏమో అని కావ్యకి డౌట్ వస్తుంది. రాజు వెనకాలే ఫాలో అవుతుంది రాజ్ ఒక పాడు బడిన బంగ్లా దగ్గరికి వెళ్తాడు అక్కడ కారు ఆపి అటు ఇటు చూస్తూ ఉంటాడు. కావ్య కూడా దూరంగా కారు ఆపి రాజ్ ని గమనిస్తూ ఉంటుంది.

Related posts

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar