NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

అవును.. రాజ‌కీయాల్లో అన్ని వేళ‌లా పంతమే ప‌నికిరాదు. ఒక్కొక్క‌సారి ప‌ట్టు విడుపులు కూడా ముఖ్య‌మే. ఈ విష‌యంలో నాయ‌కులు, పార్టీలు కూడా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాయి. ఎంతో ప‌ట్టుద‌ల‌కు పోయిన నాయ‌కులు కూడా.. ప‌రిస్థితుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి దిగి వ‌చ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న ప‌రిణామాలే కార‌ణం.

విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పూస‌పాటి అశోక్ గజ‌ప‌తి రాజు కుమార్తె అదితి గ‌జ‌ప‌తి రాజు పోటీలో ఉన్నారు. అయితే.. ఆమె వైసీపీ కంటే కూడా.. అస‌లు స‌మ‌స్య‌.. సొంత పార్టీ నాయ‌కురాలు.. మీసాల గీత నుంచే ఎదురైంది. గ‌తంలో విజ‌యం ద‌క్కించుకున్న గీత‌.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, ఆమెకు ద‌క్క‌లేదు. దీంతో రెబ‌ల్‌గా అయినా.. పోటీ చేస్తాన‌ని ముందుగానే ప్ర‌కటించారు. దీంతో స్తానిక నాయ‌క‌త్వం అలెర్ట‌యింది.

పార్టీ అధినేత చంద్ర‌బాబుకూడా.. ఆమెను బుజ్జ‌గించాల‌ని సూచించారు. దీంతో కిమిడి నాగార్జున వంటి వారు ఆమెను బుజ్జ‌గించారు. పార్టీ అదికారంలోకివ‌స్తే.. ఎమ్మెల్సీ ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌మన్న‌ట్టు చెప్పుకొచ్చారు. కానీ.. ఆమె అంగీక‌రించ‌లేదు. అశోక్ గ‌జ‌ప‌తి రాజు త‌నకు ఫోన్ చేసినా.. స్వ‌యంగా వ‌చ్చినా.. వింటాన‌ని అన్నారు. దీంతో బాల్ అశోక్ గ‌జ‌ప‌తి కోర్టులోకి వెళ్లింది. కానీ, గ‌తంలో ఉన్న రాజ‌కీయ విభేదాల కార‌ణంగా.. ఆమెను బుజ్జ‌గించేందుకు అశోక్ ముందుకు రాలేదు.

పైగా.. త‌న కుమార్తె మ‌రోసారి ఓడిపోయినా త‌న‌కు ఇబ్బంది లేద‌ని బాహాటంగా చెప్పారు. దీంతో మీసాల గీత ఇండిపెండెంట్‌గా నామినేష‌న్ వేశారు. అంతేకాదు.. త‌న‌కు ఎన్నిక‌ల గుర్తుగా.. గాజు గ్లాసును తీసుకు న్నారు. ఈ ప‌రిణామం.. అదితి గ‌జ‌ప‌తి రాజుకు తీవ్ర సంక‌టంగా మారిపోయింది. ఊరూ వాడా తిరుగుతూ.. తాను ఇక్క‌డే ఉంటాన‌ని.. అంకిత భావంతో ప‌నిచేస్తాన‌ని చెబుతున్నా.. ఆమెకు గీత రూపంలో సుడిగుండం ఎదురుగా క‌నిపిస్తోంది.

దీనికి కార‌ణం.. అశోకేన‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఒక్క మెట్టు దిగి వ‌చ్చి.. ఆయ‌న స‌హ‌క‌రించి ఉంటే.. గీత పోటీ నుంచి త‌ప్పుకొనే వార‌ని.. అప్పుడుఅదితి విజ‌యం ఖాయ‌మ‌య్యేద‌ని అంటున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ ప‌రిస్థితి త‌గ్గిపోయింద‌ని త‌మ్ముళ్లే చెబుతున్నారు.

Related posts

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk