NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

Nuvvu Nenu Prema Today Episode May 1 2024 Episode 612 highlights

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతుల పెళ్లిరోజు ఫంక్షన్ లో, రాజ్ కావ్య ఇద్దరు సందడి చేస్తూ ఉంటారు. రాజ్ చిన్న గేమ్ ఆడదామని ఆర్య అను ని పిలుస్తాడు. వాళ్లు రాజ్ పెట్టిన గేమ్ లో ఓడిపోతారు. దాంతో ఇదేంటి బ్రో మీరు సంవత్సరం నుంచి కలిసి ఉంటున్నారు మీరు ఒకరి ఇష్టాలు ఒకరికి తెలియవా అని అంటాడు. దాంతో కావ్య ఇష్టాలు తెలియాల్సిన అవసరం ఏమిటి అభిరుచులు మారుతూ ఉంటాయి. వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ముఖ్యం అని అంటుంది. పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడు ఒకరికొకరు విలువ ఇచ్చుకున్నప్పుడు కలవని మనుషులు కూడా కలుస్తాయి అని అంటుంది కావ్య. భార్యాభర్తల బంధానికి ఉండాల్సింది ప్రేమ, నమ్మకం మాత్రమే అని అంటుంది కావ్య. అందరూ కావ్య మాట్లాడిన దానికి క్లాప్స్ కొడతారు. మీ మనసులో కూడా నామీద ఏదో ఒక మూల ప్రేమ ఉంది కానీ మీరే బయట పెట్టట్లేదు అని రాజ్ కి మాత్రమే వినపడేటట్లు అంటుంది కావ్య. మా స్థాయికి తగిన ఇష్టాలు ఉండవని తెలిసి నేనే ఈ సంబంధం వద్దు అన్నాను అయినా చేశారు అని అంటుంది కుచల. అలా అనుకుంటే నీకు నాకు ఒక విషయంలో కూడా కుదరదు అని అంటాడు నారాయణ, అలాగని నేను నిన్ను వదిలేయలేదు కదా నోరు మూసుకొని కూర్చో అని అంటాడు. ఫైనల్ గా మీ ఇద్దరు మీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు రాయండి అని అంటాడు ఆర్య అను ఇద్దరూ వాళ్లకి ఇష్టమైన వాళ్ల పేర్లు రాస్తారు.

Nuvvu Nenu Prema Today Episode May 1 2024 Episode 612 highlights
Nuvvu Nenu Prema Today Episode May 1 2024 Episode 612 highlights

ఇక వాళ్ళు రాసిన పేర్లు రాజ్ చదువుతాడు ఆర్య కి తన ప్రాణం కన్నా ఇష్టమైనది అని రాశాడు. అనుకూడా తన ప్రాణానికన్నా ఇష్టమైంది ఆర్య అని రాసింది అని కావ్య చదువుతుంది. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇది చాలు అని అంటుంది కావ్య. ఇక ఆర్య చేతిలో రాజ్ ఒక డైమండ్ రింగు పెట్టి నీ ప్రేమకు గుర్తుగా నీ భార్యకి ఈ రింగ్ ని తొడుగు అని అంటాడు. ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా నువ్వు తనకు చేసే ప్రపోజల్ గుర్తుండిపోవాలి రా ఆర్య అని అంటాడు విక్కీ. మనిషిని బ్రతికించేది ప్రాణమైతే నన్ను బతికించేది నీ ప్రేమే అని అంటాడు ఆర్య. అందుకే నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలైనా భరించి నువ్వు నాతోనే ఉంటున్నందుకు, ఇకపై కూడా నాతోనే నడుస్తానని మాట ఇచ్చినందుకు ప్రేమతో నేను నీకు ఇస్తున్న కానుక ఇది అని రింగ్ ని, అను వెలికి తొడుగుతాడు. అందరూ క్లాప్స్ కొడతారు. అక్క బావపై నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు కూడా చూపించాలి కదా అని అంటుంది పద్దు. నన్ను ఇంతగా ప్రేమించి, వ్యక్తి నాకు భర్తగా రావడం నా అదృష్టం అండి అని అంటుంది. కష్టమైనా నష్టమైనా నా కడదాకా నేను మీతోనే ఉంటాను. ఐ లవ్ యు అని అందరి ముందు అను ఆర్య కి ప్రపోజ్ చేస్తుంది. పిల్లలే పుట్టినప్పుడు వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నా, ఏం లాభం నేను వీళ్ళని వదిలిపెట్టను కదా అని అనుకుంటుంది కుచ్చుల మనసు లో, దివ్య విలువ ఓవర్ యాక్షన్ ని బరించలేకపోతున్నాను అని పక్కకు వెళుతుంది.

Nuvvu Nenu Prema Today Episode May 1 2024 Episode 612 highlights
Nuvvu Nenu Prema Today Episode May 1 2024 Episode 612 highlights

ఇక మరోవైపు రాజ్ పక్కకు వచ్చి పోలీసులకి ఫోన్ చేస్తాడు. మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య కనిపించట్లేదు, ఆవిడ నాకు కూడా సిస్టర్ తో సమానం. తను ప్రమాదంలో ఉంది తను ఎక్కడ ఉంది మీరు కనిపెట్టాలి. ఇప్పటికిప్పుడు అంటే కష్టం అని అంటాడు పోలీస్ దానికి అలా అనకండి సార్ ఆలస్యం అయ్యే కొద్ది మాకు భయంగా ఉంటుంది. మీరు ఏదో ఒకటి చేయాలి అని అంటాడు. కిడ్నాప్ చేసిన వాడి మొబైల్ నెంబర్ మీకు పంపిస్తాను. మీరు జస్ట్ అతను ఎక్కడ ఉన్నది కనుక్కొని చెప్తే మేము వెళ్లి మా అక్కని తెచ్చుకుంటాము అని అంటాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాకపోయినా ఒక ఆడపిల్ల జీవితం అంటున్నావు కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను అని అంటాడు పోలీస్. ఫోన్ నెంబర్ మెసేజ్ చేయండి. ఒక గంటలో మీ పని అవుతుంది అని అంటాడు. థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ అని అంటాడు ఇదంతా దివ్య వెనుక ఉండి వింటుంది చాలా కంగారుపడుతుంది ఇక బావ దొరికిపోయినట్లే అని బాధపడుతుంది ఎలాగైనా ఈ విషయం చెప్పాలి అని అనుకుంటుంది. రాజ్ పోలీసుల హెల్ప్ తీసుకుంటున్నాడు అంటే కచ్చితంగా మురళి ఎక్కడ ఉంది కనిపెట్టేస్తారు. బావ ఎక్కడ ఉన్నది పోలీసులు కనుక్కొని లోపే బావకు నిజం చెప్పేయాలి అని అనుకుంటుంది దివ్య. అప్పుడే కృష్ణ కి ఫోన్ చేస్తుంది కృష్ణ చాలా వేగంగా కారు నడుపుతూ ఉంటాడు. పక్కనే అరవింద కూడా ఉంటుంది. దివ్య ఫోన్ చేస్తుంది ఏంటి అని కృష్ణ అనుకుంటాడు కట్ చేస్తాడు. దివ్య మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుంది. కృష్ణ మాత్రం కట్ చేస్తూనే ఉంటాడు ఇక పక్కనే ఉన్న అరవింద నాకు చాలా ఆనందంగా ఉందండి. విక్కి పెళ్లి రోజు నన్ను ఇంటికి తీసుకెళ్తున్నారు అది చాలు అని అంటుంది. కొన్ని రోజులైనా ఇంటికి వెళ్లి చాలా నెలలు అయినట్టు కనిపిస్తుంది అని అంటుంది. దివ్య మళ్లీ ఫోన్ చేస్తుంది మళ్లీ కృష్ణ కట్ చేస్తాడు. పాపం ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు కదండీ లిఫ్ట్ చేయండి అని అంటుంది అరవింద. నువ్వు చాలా ఆనందంగా ఉన్నావ్ నేను ఇలా చూస్తూ నేను ఆనంద పడుతూ ఉందామనుకున్నాను. ఇలాంటి టైంలో ఇలాంటి ఫోన్స్ లిఫ్ట్ చేయడం నాకు ఇష్టం లేదు రానమ్మ అని అంటాడు. నేనంటే నీకు ఎందుకండీ అంత ఇష్టం అని అంటుంది. కానీ అవతలి వాళ్ళు ఎందుకు అన్ని సార్లు మీకు కాల్ చేస్తున్నారో మీకు తెలియాలి కదా అని అంటుంది. ప్రపంచం స్తంభించిపోయిన నాకు నీ ఆనందమే ముఖ్యం అని అంటాడు కృష్ణ. ఏదో జన్మలో నేను చాలా పుణ్యం చేసుకొని ఉంటానండి. అందుకే మీరు నాకు భర్తగా దొరికారు అని అంటుంది అరవింద.

Nuvvu Nenu Prema Today Episode May 1 2024 Episode 612 highlights
Nuvvu Nenu Prema Today Episode May 1 2024 Episode 612 highlights

ఇక మరోవైపు రాజ్ కావ్య ఇద్దరు, అను ఆర్యాల ప్రేమని మనందరికీ తెలిపిన తర్వాత ఇప్పుడు మనం ఎవరిని పిలవాలి అని అంటాడు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ప్రేమ, ఆ ప్రేమలో భార్యాభర్తల ప్రేమ చాలా గొప్పది. ఒక భార్య భర్త తో ఎలా ఉండాలి అనేది పద్మావతిని చూసి నేర్చుకోవచ్చు అని అంటాడు రాజ్. విక్కీని చూసి భర్త ఎలా ఉండాలో నేర్చుకోవాలి అని అంటుంది కావ్య. విక్కికి కోపం ఎక్కువ అలాగే ప్రేమ కూడా ఎక్కువ. కోపంలో ఏమన్నా పద్మావతి అర్థం చేసుకుంటుంది. పద్మావతి అదంతా పరిస్థితి అంటే అది విక్కీ మీద ప్రేమ మాత్రమే, వాళ్ల ప్రేమ అందరికీ తెలిసిందే అని అంటారు ఇకదానితో విక్కీ పద్మావతి ఇద్దరినీ స్టేజ్ మీదకు రావాలని కావ్య అంటుంది. విక్కీ పద్మావతిని తీసుకొని వస్తూ ఉంటే ఇదేంటి సారూ మీరు చేయి పట్టుకుని తీసుకొస్తున్నారు అని అంటుంది కావ్య. కలవ పువ్వు లాంటి మా పద్దు ని రెండు చేతులతో ఎత్తుకొని స్టేజి మీదకి తీసుకురావాలి అని అంటుంది. ఇప్పుడు మనం మాస్ ఎలా ఉంటారో చూపిద్దాం అని అందరూ విజిల్ వెయ్యండి వాళ్ళు స్టేజి మీదకి వచ్చేంతవరకు విజిల్ ఆపకూడదు అని అంటే పార్వతి సరే అంటుంది. ఇక విక్కీ పద్మావతిని ఎత్తుకొని స్టేజ్ మీదకు తీసుకువెళ్తాడు. ఏంటి మా పద్దు బరువుగా ఉందా అని అడుగుతుంది విక్కీని, గుండెల్లో పెట్టుకొని మోస్తున్న వాడిని చేతులతో మోయలేనా అని అంటాడు. అబ్బా అబ్బా ఏం చెప్పారండి కొంతమంది ఉంటారు ఇక్కడ అల్లాడిపోతుంటారు అని అంటుంది రాజుని చూస్తూ, కావ్య నన్నే కదా నువ్వు అనేది అని అంటాడు రాజ్. ఏంటి నీకు డౌట్ గా ఉందా అని అంటుంది కావ్య. పద్దు విక్కీ గారు మీకు ఏదైనా కాలిన వాసన వస్తుందా అని అంటుంది. ఆ వస్తుంది అని అంటాడు విక్కీ రాజ్ కోపంగా వికీపీ వైపు చూస్తాడు. ఇంక చాలు ఆపు అని అంటాడు రాజ్.

Nuvvu Nenu Prema Today Episode May 1 2024 Episode 612 highlights
Nuvvu Nenu Prema Today Episode May 1 2024 Episode 612 highlights

ఇక విక్కీ మీ పెళ్లి జరిగి సంవత్సరం అవుతుంది కాబట్టి మీ ప్రేమ గురించి మాతో పంచుకోండి అని అంటాడు రాజ్. మీరు కంగారు పడక్కర్లేదు నిదానంగా అయినా చెప్పొచ్చు అని అంటుంది కావ్య. మీ ఎక్స్పీరియన్స్ మా అందరికీ ఉపయోగపడతాయి అని అంటుంది కావ్య. మేము నేర్చుకోవాల్సిన విషయాలు కూడా అర్థం అవుతాయి అని అంటుంది. నేను విక్రమాదిత్య గారి పక్కన నిలబడి ఉన్నాను అంటే, ఇది నా అదృష్టం ఇలాంటి జీవితాన్ని నేను కలలో కూడా ఊహించుకోలేదు. నేను ఆయన పక్కన నిలబడడానికి ఏమాత్రం అర్హత లేని దాన్ని, అడక్కుండా ఆ దేవుడు కూడా వరం ఇవ్వడేమో కానీ, అడక్కుండానే విక్రమాదిత్య గారు నాకు తన అర్ధాంగి వరాన్ని ఇచ్చారు. తను కోపంతో ఆ పని చేసిన తాను నాకు ఇచ్చిన బహుమతి. మొదట్లో నేను కొద్దిగా బాధపడిన, విక్రమాదిత్య గారిని అర్థం చేసుకున్నాక ప్రేమించడం మొదలుపెట్టాను. అప్పటినుండి ఇప్పటివరకు ఆయన మాటలు వల్ల చేతులు వల్ల నేనైతే బాధపడలేదు. కానీ విక్రమాదిత్య గారు నావల్ల నా పిచ్చి పనులు వల్ల చాలాసార్లు బాధపడ్డారు. కానీ ఎప్పుడూ నన్ను దూరం చేసుకోవాలి అని మాత్రం ఆయన అనుకోలేదు. ఆయన అర్థం చేసుకోవడానికి కాస్త టైం పట్టింది అంతే కానీ అర్థం చేసుకుంటారని నేనెప్పుడూ అనుకున్నాను. మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. పెళ్లయిన తర్వాత అర్థం చేసుకున్నమ్, ఇప్పుడు ప్రేమలో ఉన్నాం అని అంటుంది పద్మావతి. అపార్ధాలనుంచి పుట్టిన ప్రేమ చిరకాలం ఉంటుంది అంటారు. మా ప్రేమ అలానే ఉంటుందని, మా మనసులు మాకు చెప్తున్నాయి అని అంటుంది పద్మావతి. ఆయన విషయంలో నేను చేసిన ఒకే ఒక్కటి ఓపిక పట్టి ఉండడం. కానీ ఆయన మాత్రం నా కోసం చాలా చేశారు. అదే ఆయనలోని గొప్పతనం. నేను భూమి అయితే ఆయన ఆకాశం. ఆకాశమే లేకపోతే, ఈ భూమి ఆనందంగా ఆహ్లాదంగా ఉండలేదు అని అంటుంది పద్దు. శ్రీరాముడి పాద ధూళి తగిలిరాయి ఆడది అయితే ఇక్కడ శ్రీరాముడు మా వారు నేను రాయిని అని అంటుంది. నా భర్త శ్రీరామచంద్రుడే అని అంటుంది. నా భర్త నాకు శివుడితో సమానం, ఆయన నాకు దేవుడు ఈ ఇళ్ల నాకు దేవాలయం. అని పద్మావతి అనగానే అందరూ క్లాప్స్ కొడతారు విక్కి మురిసిపోతాడు. నీ భర్త గురించి నువ్వు ఇంత గొప్పగా చెప్పావు పద్మావతి అని అంటాడు రాజ్. మీ ఆవిడ గురించి మీ బంధం గురించి మీరు కూడా మాట్లాడాలి అని కావ్య విక్కీకి మైకు ఇస్తుంది. నా లైఫ్ లో తన అంత ఇంపార్టెంట్ అనేది నేను రాత్రి తనకి చెప్పేసాను. తన గురించి చెప్పాలంటే ఇంకా మాటలు అలానే మిగిలే ఉన్నాయి. వాళ్ల గొప్పతనాన్ని పిల్లలకి భర్తకి ఆపాదించి, మాట్లాడడం ఆడవాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. అని విక్కీ మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode May 1 2024 Episode 612 highlights
Nuvvu Nenu Prema Today Episode May 1 2024 Episode 612 highlights

రేపటి ఎపిసోడ్ లో, విక్కీతో రాజ్ అక్క ఎక్కడ ఉందో తెలిసిపోయింది అని చెప్తాడు దాంతో థాంక్స్ రాజ్ అని విక్కీ అంటాడు అదంతా దివ్య వింటుంది. మరోవైపు పాటలతో డాన్స్ చేస్తూ ఉంటారు విక్కీ పద్మావతి, రాజ్ కావ్య అను ఆర్య అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దివ్య కృష్ణ కి కాల్ చేసి నీ గురించి ఆల్రెడీ పోలీసులకు తెలిసిపోయింది ఏ క్షణమైనా నిన్ను అరెస్ట్ చేయొచ్చు. నా మాట విని పారిపో అని అంటుంది అంతలోనే అక్కడికి విక్కీ రాజ్ ఇద్దరూ కృష్ణ దగ్గరికి వెళ్తారు. కృష్ణని బాగా కొడుతూ ఉంటారు. సడన్ గా ఇద్దరూ కొట్టడం ఆపేస్తారు.మరి పక్కనే ఉన్న అరవింద కి గొడవ గురించి తెలుస్తుందో లేదో తెలియాలంటే, రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella