NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో అనేక ఇబ్బం దులు ప‌డి కూడా.. పొత్తులు పెట్టుకుంది. అయితే.. ఈ పార్టీకి అనుకున్న విధంగా అయితే ప‌రిస్తితి ఈజీగా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఎప్ప‌టిక‌ప్పుడు వైసీపీ నుంచి ఎదుర‌వుతున్న ఇబ్బందులే. ఒక‌వైపు ఇండిపెండెంట్ల‌తో టీడీపీకి త‌ల‌బొప్పి క‌ట్టింది. చాలా చోట్ల గాజు గ్లాసు గుర్తును అభ్య‌ర్థుల‌కు కేటాయించ డం కూడా.. పార్టీకి ఇబ్బందిగా మారింది. అంటే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సైకిల్ సింబ‌ల్‌కు తోడుగా గాజు గ్లాసు గుర్తు కూడా ఈవీఎంల‌లో ఉండ‌బోతోంది.

కొన్ని చోట్ల క‌మ‌లం సింబ‌ల్ తో పాటు గాజు గ్లాసు గుర్తు ఉంటుంది. ఇలా ర‌క‌ర‌కాలుగా చిత్ర విచిత్ర‌మైన ఈ కూట‌మి ఏ తీరాల‌కు చేరుతుందో ఎన్నిక‌ల‌కు ముందే ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు మ‌రో కీల‌క‌మైన స‌మ‌స్య టీడీపీకి ఎదురైంది. పోలింగ్ బూతుల్లో సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చే యడం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్‌ల‌లోనూ ఫ్యాన్లు లేని చోట సీలింగ్ ఫ్యాన్ల‌ను ఏర్పాటు చేస్తు న్నారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న సాగుతున్న ఈ కార్య‌క్ర‌మం కూడా.. టీడీపీకి ఇబ్బందిగానే మారింది. ఎందుకం టే.. వైసీపీ ఎన్నిక‌ల గుర్తు.. సీలింగ్ ఫ్యాను. దీంతో నేరుగా పోలింగ్ బూతుల్లోనే ఈ ఫ్యాన్లు ఏర్పాటు చేయ‌డం పార్టీకి సంక‌టంగా మారింది.

కానీ, త‌ప్పదు. దీనిని త‌ప్పు అని కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఏ కార్యాల‌యంలో అయినా.. ఫ్యాన్లు ఉంటాయి. ఉన్న‌తాధికారుల‌కు మాత్ర‌మే ఏసీలు ఏర్పాటు చేస్తారు. కానీ, సాధార‌ణ పోలింగ్ బూతుల్లో మాత్రం.. ఫాన్లే ఉంటాయి. ఇవిలేని చోట‌.. ఉన్నా ప‌నిచేయ‌ని చోట కొత్త ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, ఇది ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంద‌న్న‌ది టీడీపీ మాట‌. దీనిపై ఫిర్యాదు చేయాలా? లేక‌.. అస‌లు ఫ్యాన్లే లేకుండా ఎలా చేయాల‌నే అంశంపై అంత‌ర్గ‌తంగా చ‌ర్చిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

అస‌లు గ‌దుల‌లో ఫ్యాన్లే లేకుండా చేయ‌డం సాధ్యం కాని ప‌ని… ప్ర‌తి రూమ్‌లోనూ ఫ్యాన్ ఉండాల్సిందే. ఏదేమైనా.. చిన్న అవ‌కాశం కూడా.. వైసీపీకి లేకుండా చేయాల‌న్న రాజ‌కీయ వ్యూహం బాగానే ఉన్నా.. కొన్ని కొన్ని విస‌యాల్లో మాత్రం త‌ప్పించుకునే ప‌రిస్థితి అయితే.. టీడీపీకి క‌నిపించ‌డం లేదు. ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

Related posts

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?