NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 31 2024 Episode 141: కౌశికి తో సవాల్ విసురుతున్న దివ్యాంక..

Jagadhatri Today Episode January 31 2024 Episode 141 Highlights

Jagadhatri January 31 2024 Episode 141: ఆగు దివ్యాంక నీలాంటి వాళ్లకు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని జగదాత్రి ఉంటుంది. నువ్వెవరే చెప్పడానికి దివ్యాంక ఎవరో రమ్మంటే రాలేదు నా ఫ్రెండ్ నేను పిలిస్తే వచ్చింది అని నిషిక అంటుంది. ఏంటి నిషిక నీ వదిన కంటే నీ అక్కకే ఇక్కడ పవర్ ఎక్కువగా ఉన్నట్టుంది అని దివ్యాంక అంటుంది.దాని మొహం అది అలాగే అంటుంది  దివ్యాంక అని నిషిక తీసుకొని లోపలికి వెళ్తుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 31 2024 Episode 141 Highlights
Jagadhatri Today Episode January 31 2024 Episode 141 Highlights

నిషిక అనవసరమైన వాళ్ళందరినీ ఇంట్లోకి ఎందుకు తీసుకు వస్తున్నావు అసలు నీకు ఎవరు ఇచ్చారు అధికారం అని కౌశికి అంటుంది. అది కాదు నిషికకి ఉద్యోగం వచ్చింది అన్న సంతోషంలో పార్టీ ఇస్తానంటే కాదనలేకపోయాను ఇష్టమున్న వాళ్ళు ఉందాం కష్టమైన వాళ్ళు వెళ్ళిపోతారు అని వైజయంతి అంటుంది. పిన్ని నీకు అర్థం కావట్లేదు నిషిక చెడ్డ స్నేహాలు చేస్తుంది అని కౌశికి అంటుంది. జాబ్ ఇచ్చిన అమ్మాయిని పిలిచి ఒక పూట భోజనం పెడితే చెడు స్నేహం ఎలా అవుతుంది అని వైజయంతి అంటుంది. నేను అన్నది మంచి చెడుల గురించి పిన్ని ఇంత వయసు వచ్చింది మంచేదో చెడేదో నిషికకి తెలియదా అని కౌశికి అంటుంది. నువ్వు చెప్తే కానీ మంచేదో చెడేదో తెలుసుకోలేను అనుకున్నావా వదిన అయినా దివ్యాంక నేను పిలిస్తే వచ్చింది అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode January 31 2024 Episode 141 Highlights
Jagadhatri Today Episode January 31 2024 Episode 141 Highlights

వదిన మీకు అసలే కాలికి దెబ్బ తగిలి ఉంది మీరు హాల్లోకి ఎందుకు వచ్చారు అని జగదాత్రి అంటుంది. ఏంటి కౌశికి నీకు దెబ్బ తగిలిందా ఎలా తగిలింది హాస్పిటల్ కి వెళ్ళావా? అయినా నువ్వు వెళ్ళి ఉండవులే రా హాస్పిటల్ కి వెళ్దాం అని సురేష్ అంటాడు. ఈ కపట ప్రేమలే చూపించొద్దు నా కూతురు నమ్ముతుందేమో కానీ నేను నమ్మను అని కౌశికి కోపంగా వెళ్ళిపోతూ ఉండగా కాలు నొప్పిగా ఉండడంతో అరుస్తుంది. వదిన నేను మీ రూమ్ దాకా వస్తాను అని జగదాత్రి అంటుంది. పర్వాలేదు ధాత్రి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను ఈ దెబ్బ నాకేమీ లెక్క కాదు అని కౌశికి గుండె నిండా బాధతోటి లోపలికి వెళుతుంది. బాధ లేదు బంధం లేదు అంటూనే కౌశికి మమ్మల్ని చూసి బాధపడుతుంది నిషిక అని దివ్యాంక అంటుంది. భర్త వేరే అమ్మాయితో కనపడితే ఏ భార్యకి అయినా బాధ ఉండద అమ్మాయి అని వైజయంతి అంటుంది. నిషిక ఇప్పుడే వస్తాము అని సురేష్ ని తీసుకొని కౌశికి గదిలోకి వెళుతుంది దివ్యాంక. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 31 2024 Episode 141 Highlights
Jagadhatri Today Episode January 31 2024 Episode 141 Highlights

కీర్తి నువ్వు వెళ్లి ఆడుకో అని కౌశికి అంటుంది. ఏంటి కౌశికి నీ మాజీ మొగుణ్ణి పెళ్లి చేసుకుంటున్నా అందుకు నీకు బాధ లేదంటున్న నీ కళ్ళల్లో కనపడుతుంది అని దివ్యాంక అంటుంది. నేను ఇంతకుముందే చెప్పాను నువ్వు పెళ్లి చేసుకో లేదంటే గంగలో దూకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని కౌశికి అంటుంది. మేడం నేను బయట వెయిట్ చేస్తాను అని సురేష్ వెళ్తూ ఉండగా చేయి పట్టుకొని ఆపుతుంది దివ్యాంక. అది చూసి కౌశికి మొహం చాటేస్తుంది. ఏంటి కౌశికి మా ఇద్దరిని ఇలా పక్కపక్కన చూసి తట్టుకోలేకపోతున్నావా అని దివ్యాంక తన చెవి దగ్గరికి వచ్చి చూడు కౌశికి నీ కళ్ళ ముందు నీ భర్తను పట్టుకుంటేనే తట్టుకోలేకపోయావు ఈ ఫంక్షన్ అయిపోయే లోపు నీ భర్త చేత ముద్దు పెట్టించుకుంటాను ఇది నా చాలెంజ్, ఒకప్పుడు  నువ్వు ఈ ఇంటికి మకుటం లేని మహారాణిలా తిరిగే దానివి నీకు తెలియకుండా నీకు ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోకి రానివ్వను అనేదానివి కానీ నేను నీ భర్తని పెళ్లి చేసుకుంటూ నీ కళ్ళ ముందుకు వచ్చి సవాలు విసురుతుంటే ఎలా ఉందో తెలుసా నాకు పట్టలేనంత ఆనందం గా ఉంది ఇలాంటివి ఇంకా ఎన్నో చూపిస్తాను అంటూ దివ్యాంక సురేష్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. కౌశికి దివ్యాంక అన్న మాటలకి బాధపడుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 31 2024 Episode 141 Highlights
Jagadhatri Today Episode January 31 2024 Episode 141 Highlights

దివ్యాంక నిషిక కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు జగదాత్రి అని కేదార్ అంటాడు. వదిన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ కొట్టేయడానికి ఈ పార్టీ అడ్డు పెట్టుకున్నారండి అని జగదాత్రి అంటుంది. మనం ఇంట్లో ఉండగా అక్క రూమ్ లోకి వెళ్లి పెన్ డ్రైవ్ కొట్టేస్తే మనం ఉండి కూడా వేస్ట్ జగదాత్రి అని కేదార్ అంటాడు. అందుకే కేదార్ నువ్వు వదిన రూమ్ వైపు ఎవరూ రాకుండా చూసుకో నేను ఇక్కడ చూసుకుంటాను అని జగదాత్రి వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 31 2024 Episode 141 Highlights
Jagadhatri Today Episode January 31 2024 Episode 141 Highlights

యువరాజ్ జగదాత్రి పోలీసా కాదా తెలుసుకోవడానికి వడల పిండి తెప్పించి కాచిని పిలిచి జగదాత్రిని వచ్చి వడలు చేయమని చెబుతాడు. కాచి వెళ్లి జగదాత్రికి నిషిక వడలు చేయమని చెప్పిందంట అని జగదాత్రికి చెబుతాడు. జగదాత్రి వచ్చి వడల పిండి కలుపుతూ ఉండగా తన చేతికి ఉన్న గాయాన్ని చూసి గుర్తుపట్టి యువరాజ్ వచ్చి తన చేయి పట్టుకొని నువ్వు జగదాత్రి ఐ.పీ.ఎస్.  కదా నీకు ఈ చేయికి గాయం ఎలా అయింది అక్కను కాపాడింది నువ్వే కదా చెప్పు అని యువరాజ్ అంటాడు. నేను పోలీసు ఏంటి యువరాజ్ నా చేయి వదులు అని జగదాత్రి అంటుంది. లేదు నువ్వు నిజంగానే పోలీస్  అంటూ ఉండగా కేదార్ చూసి పరిగెత్తుకొస్తాడు మీరిద్దరూ పోలీసులు కదా అబద్ధం చెప్పకండి మీ గుట్టు అంత నాకు తెలిసిపోయింది అని యువరాజ్ అంటాడు.ఏం చెప్పాలో అర్థం కాక వాళ్లు కంగారు పడుతూ ఉండగా నిషిక వచ్చి ఏం జరిగింది అని అంటుంది.వీళ్లు పోలీసులు నిషి అడుగుతుంటే అబద్దం చెబుతున్నారు మా అక్కను కాపాడితే గాయం అయింది మీ అక్క చేతికి కూడా గాయం అయింది చూడు అని యువరాజ్ జగదాత్రి చేయని చూపెడతాడు. మీరు చెప్పింది నమ్మి వీళ్ళు నిజంగానే పోలీసులు ఏమో అనుకున్నాను ఆ గాయం గురించి నాకు తెలుసు నిన్న కూరగాయలు కట్ చేస్తుంటే అయింది అని నిషిక అంటుంది..

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri