ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ స్టార్ హీరో మరియు హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అదేవిధంగా సినిమాలలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలని కూడా ఫుల్ ట్రెండింగ్ చేస్తున్నారు. వారి పర్సనల్ లైఫ్ గురించి అందం గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటున్నారు.
ఇక ఇదే క్రమంలో మరో స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ప్రస్తుతం ఆ ముద్దుగుమ్మ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. తన అంద చందాలతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకుంది కూడా. ఇక తాజాగా ఓ స్టార్ హీరోని ప్రేమించి.. పెళ్లి చేసుకుని సంవత్సరం గడవకముందే విడాకులు తీసుకుని విడిపోయింది.
ఇక మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూ సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఆమె మరెవ్వరూ కాదు స్టార్ హీరోయిన్ సమంత. తన అందం అభినయంతో టాలీవుడ్ ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సమంత చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె ఇప్పుడు ఎంత ముద్దుగా ఉందో చిన్నప్పుడు కూడా అంతే క్యూట్ గా ఉంది. ఇక ఈమె ఫోటోలను చూసిన పలువురు..” నిజంగా అతిలోక సుందరి లాగా ఉంది. సమంత ఆల్వేస్ క్యూటీ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.