Television: నేటి కాలంలో సీరియల్స్ కి ఎంత డిమాండ్ పెరిగిపోయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. సినిమాలని ఆయన వదులుకుంటున్నారేమో కానీ సీరియల్స్ ని మాత్రం వదులుకోవడం లేదు ప్రేక్షకులు. తమకి నచ్చిన సీరియల్ ని చూసేందుకు ఆ సీరియల్ టైమింగ్ ని గుర్తు పెట్టుకుని అదే సమయానికి టీవీ ముందు వాలిపోతున్నారు. ఇక ఇప్పుడు అంటే సీరియల్స్ హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ గతంలో సీరియల్స్ కి ఈ విధమైన పాపులారిటీ అయితే ఉండేది కాదు. ఇక ఈ సీరియల్స్ ని మొట్టమొదటిగా నిర్మించి మరియు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది.
తాజాగా ఈ ప్రశ్నకి ఆన్సర్ దొరికింది. ఓ కమెడియన్ తెలుగు లో మొట్టమొదటిగా సీరియల్స్ ను తానే నిర్మించి మరియు డైరెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ కమీడియన్ ఎవరు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత సీనియర్ హీరోస్ కి మరియు హీరోయిన్స్ కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వారు గతంలో సినిమాలు చేసినప్పటికీ వారి సినిమాలు పెద్దగా నేటి జనరేషన్ కి తెలియక వారు ఒక కమెడియన్ కింద చూస్తున్నారు. కానీ ఆనాటి కాలంలో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు ఎందరో ఉన్నారు. వారిలో F2 యాక్టర్ కూడా ఒకరు. ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న యాక్టర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈయన నేటి కాలంలో వారికి కమీడియన్ అయినప్పటికీ ఆనాటి కాలంలో పెద్ద హీరో. తాను చేసిన సినిమాలు అప్పట్లో భారీ విజయాలు సాధించాయి. ఇక ప్రస్తుతం కమెడియన్ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్న ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. యాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ..” హీరోగా నేను నటించేటప్పుడు నాకు 500 ప్రేమ లేఖలు వచ్చేవి. అటువంటి సమయంలో యాక్టింగ్ ని వదిలేసి నేను సీఐ చార్టెడ్ అకౌంట్ చదువుకున్నాను. తెలుగులో ఫస్ట్ సీరియల్ చేసిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గా నేను గుర్తింపును సంపాదించుకున్నాను. ఈరోజు 15 వేల కుటుంబాలు అక్కడ నిలబడ్డాయి. ఇవన్నీ నా గొప్ప కోసం చెప్పుకోవడం లేదు. గుండెలో ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యం అవుద్ది అనడానికి నేనే సాక్ష్యమని చెబుతున్నా.
నాకు 14 నంది అవార్డులు వచ్చాయి టెలివిజన్లో. ఇక అవి తీసుకుంటూ ఇక్కడే ఉండి పోకుండా ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ పెట్టి దాని నుంచి కార్పొరేట్ ఫిలిం మరియు అడ్వటైజ్మెంట్ ఫిలిం, యాడ్స్ చేస్తూ ఉన్నాను. 1985 లో పర్సనాలిటీ డెవలప్మెంట్.. వ్యక్తిగత వికాసం అంటే ఏంటో ఎవరికీ తెలియని రోజుల్లో సెవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా నేను నా వైఫ్ కంప్లీట్ చేశాము ” అంటూ వెల్లడించారు ఈ నటుడు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటి కాలంలో సీరియల్స్ ని ప్రతి ఒక్కరూ ఇంతగా ఆదరించడం చూసి చూసి ఈ క్రెడిట్ అంట ఆయనదే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు కూడా. ఒకప్పుడు సీరియల్స్ అంటేనే ఎవరికీ తెలీదు. ఇతర భాషల్లో సీరియల్స్ గురించి తెలిసినప్పటికీ తెలుగులో మాత్రం పెద్దగా టచ్ లేదు. కానీ ఆ రోజుల్లోనే ఈ నటుడు సీరియల్స్ కి డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి సీరియల్స్ అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకి చూపించారు.